నిజామాబాద్

అర్హులైన రైతులకు బీమా సౌకర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, సెప్టెంబర్ 24: కామారెడ్డి జిల్లాలో అర్హులైన రైతులకు బీమా సౌకర్యం కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్. సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఉమ్మడి జిల్లాలకు సంబందించిన జడ్పీ సాదారణ సమావేశం ఉమ్మడి జిల్లాల జడ్పీచైర్మెన్ దాఫేదార్ అధ్యక్షతన నిజామాబాద్ జడ్పీ మందిరంలో జరిగింది. ఈసమావేశంలో కామారెడ్డి జిల్లాకు సంబందించిన అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ సభకు వెళ్లడించారు. కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో రైతులకు వ్యవసాయ పంట పెట్టుబడి పథకం రైతు బందు కింద 2లక్షల 48వేల 381చెక్కులకు గాను, 2లక్షల 9వేల 433చెక్కులను పంపిణీ చేసి, 176కోట్ల 50లక్షల రూపాయలు అందించడం జరిగిందన్నారు. రైతు బీమా పథకనికి సంబందించి మొత్తం 1లక్ష 80వేల 902మంది రైతులకు అర్హులైన వారికి 1లక్ష 13వేల 913మంది రైతులకు బీమా సౌకర్యం వర్తింప చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 63మంది రైతుల మరణాలు నమోదు కావడం జరిగిందని, ఇందలో 48కుటుంబాలకు 2కోట్ల 40లక్షలు అందించామని అన్నారు. జిల్లా 2లక్షల 62వేల రైతులకు గాను 2లక్షల 12వేల పట్టాదార్ పాసుబుక్కులు మంజూరు చేయడం జరిగిందన్నారు. మిగిలినవి కూడా క్లియర్ చేసి పట్టాలు అందించడం జరుగుతోందని అన్నారు. అటవీ, రెవిన్యూ భూముల సర్వే జరిపి రైతుబందు, రైతుబీమా సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. రైతులకు ఎరువులు సకాలంలో సక్రమంగా పంపిణీ చేయడం జరుగుతుందని, కల్యాణలక్ష్మీ, షాదిముబారక్ పథకంలో అర్హులైన పేద వారందరికి పథకం వర్తింప చేయడం జరిగిందన్నారు. పెండింగ్‌లో ఉన్న వాటిని పరిశీలిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లాలోని యువజన సర్వీసులు, రోడ్ల పరిస్థితి, విద్యశాఖ, హరితాహారం, గ్రామీణ నీటి సరఫరా, పశుసంవర్థక శాఖ తదితర పథకాలపై చర్చించారు. ఈ సమావేశంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు బీబీపాటిల్‌తో పాటు కామారెడ్డి జిల్లాకుచెందిన డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డి, వ్యవసాయశాఖ జెడి నాగేంద్రయ్య, సీపిఓ శ్రీనివాస్, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ అంజయ్య, యువజన సంక్షేమశాఖఅధికారి దామోదర్‌రెడ్డి, నీటిపారుదలశాఖ ఇఇ బన్సిలాల్, డిఎఫ్‌ఓ వసంత, పశుసంవర్థకశాఖ జెడీ రమేష్, భూగర్భ శాఖ ఎడి శ్రీనివాస్‌బాబు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.