నిజామాబాద్

వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, అక్టోబర్ 14: వివిధ సంస్థలు, సంఘాలతో పాటు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే శిబిరాల సందర్భంగా వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు హితవు పలికారు. తెలంగాణ సిక్కు సొసైటీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఐపీఎస్ అధికారిణి తేజ్‌దీప్ కౌర్ మీనన్ ఆధ్వర్యంలో ఆదివారం సుభాష్‌నగర్‌లో ఉచిత మెగా హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహించారు. ఈ శిబిరానికి కలెక్టర్ ఎంఆర్‌ఎం.రావు ముఖ్య అతిథిగా హాజరవగా, పోలీస్ కమిషనర్ కార్తికేయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వైద్య శిబిరాలను నిర్వహించడం ఎంతో వ్యయ, ప్రయాసాలతో కూడుకున్నదని అన్నారు. అయినప్పటికీ తెలంగాణ సిక్కు సొసైటీ ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేయడంతో పాటు హైదరాబాద్ నుండి అపోలో వంటి ప్రముఖ ఆసుపత్రుల వైద్యులచే ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ శిబిరంలో అవసరమైన రోగులకు మందులు ఉచితంగా అందజేశారు. మునుముందు కూడా సంస్థ తరఫున మరింత విస్తృత స్థాయిలో సేవలందించాలని కమిషనర్ కార్తికేయ అభిలషించారు. ఈ శిబిరంలో వైద్యులు, సిక్కులు, స్థానికులు పాల్గొన్నారు.

దుర్గామాత మండపం వద్ద బోనాలు
ఆర్మూర్, అక్టోబర్ 14: ఆర్మూర్ పట్టణంలోని రంగాచారినగర్, చేనేత కాలనీలో వందేమాతరం యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సతీమణి రజితారెడ్డి, స్థానిక కౌన్సిలర్ సంగీత ఖాందేశ్‌లు విచ్చేసి తలపై బోనాలు ఎత్తుకున్నారు. భక్తిశ్రద్ధలతో డప్పులతో ఊరేగింపుగా వెళ్లారు. పెద్దమ్మ తల్లి పూజారి శంకర్ బోనంతో చేసిన నృత్యం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకుడు ఖాందేశ్ శ్రీనివాస్, కాలనీ కమిటీ సభ్యులు ఆడెపు ప్రభాకర్, దాసరి ఆనంద్, నరేందర్, గంగాధర్, వందేమాతరం సభ్యులు నవనీత్, షరత్, గిరీష్, విష్ణు, వంశీ, రఘు పాల్గొన్నారు.