నిజామాబాద్

ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నామన్న భయంతోనే ముందస్తు ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, అక్టోబర్ 16: గత సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని, దాంతో ప్రజల్లో రోజురోజుకీ వ్యతిరేకత పెరిగిపోవడంతో సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం జరిగిందని కాంగ్రెస్ మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో వందలాది మంది యువకుల ఆత్మబలిదానాలతో చలించిపోయిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే, 2014లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టిన పాపానికి ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎడపల్లి మండలం ఏఆర్‌పీ.క్యాంప్, బ్రాహ్మణ్‌పల్లి, దుబ్బాతండాల్లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ, గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అమలుకు సాధ్యం కాని హామీలను గుప్పించి అధికారంలోకి రావడం జరిగిందన్నారు. అధికారం చేపట్టిన నాలుగేళ్ల కాలంలో ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయిందని ఆరోపించారు. ముఖ్యంగా దళితులకు మూడెకరాల భూ పంపిణీ, పేద ప్రజలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు, ఇంటికో ఉద్యోగం వంటి హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. అంతేకాకుండా ఈసారి జరిగే ఎన్నికల నాటికి ఇంటింటికి కుళాయి ద్వారా మిషన్ భగీరథ పథకం కింద శుద్ధి జలాలను అందించకుంటే ఓట్లు అడుగనని పేర్కొన్న సీఏం కేసీఆర్, ప్రస్తుతం ప్రజలను ఏ విధంగా ఓట్లు అడుగుతారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న కుటుంబ పాలనపై ప్రజలు విసిగి వేసారిపోయారని, ఈసారి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. 2019ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే రైతులకు ఏకకాలంలో 2లక్షల రూపాయల రుణమాఫీ, 5లక్షల రూపాయల బీమా సౌకర్యం, ఎస్సీ, ఎస్టీలకు ఇంటి నిర్మాణం కోసం 6లక్షలు, బీసీలు, ఇతరులకు 5లక్షల రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. అలాగే ప్రతి మహిళా సంఘానికి లక్ష రూపాయలు ఉచితంగా అందించడంతో పాటు ఎలాంటి వడ్డీలేకుండా ఒక్కో సంఘానికి 10లక్షల రూపాయలు అందిస్తామని, నిరుద్యోగ యువలకు నెలకు 3వేల రూపాయల జీవన భృతి, ప్రస్తుతం అందిస్తున్న ఆసరా, జీవన భృతి పెన్షన్లకు వయో పరిమితిని 58సంవత్సరాలకు సడలించి, పెన్షన్‌ను రెండింతలు చేస్తామని, వికలాంగులను వివాహం చేసుకునే సకలాంగులకు రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. అలాగే అర్హులైన ప్రజలకు రేషన్ షాప్‌ల ద్వారా ఒక్కొక్కరికి 7కిలోల సన్నబియ్యం సరఫరా చేయడంతో పాటు గ్యాస్ కనెక్షన్ కలిగిన ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 6సిలిండర్లను ఉచితంగా అందిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు గృహ అవసరాలకు గాను 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా, సుదర్శన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా స్వాగతించారు. ఈ కార్యక్రమంలో బోధన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లా రామ్మోహన్, ఎడపల్ల మండల అధ్యక్షుడు నర్సింగ్, కాంగ్రెస్ నాయకులు గైని పోచయ్య, కిషన్‌గౌడ్, ఆకుల సురేష్, శేక్ బాబా, ఈరంటి లింగం, పెరిక లక్ష్మణ్, సంతోష్‌రెడ్డి, అయూబ్‌ఖాన్‌తో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

దుర్గాదేవి మండపం వద్ద మహా చండీ హోమం
ఆర్మూర్, అక్టోబర్ 16: ఆర్మూర్ పట్టణంలోని బస్‌డిపో వెనుక గల విద్యానగర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గాదేవి మండపం వద్ద మంగళవారం మహా చండీహోమం నిర్వహించారు. గురుస్వామి బల్యపల్లి సుబ్బారావు స్వామి ఆధ్వర్యంలో చండీహోమం నిర్వహించి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కమిటీ అధ్యక్షుడు యు.సాయన్న, విపంల దంపతులు, ఉపాధ్యక్షులు పెంట రాకేష్, శృతి దంపతులు, మెడికల్ మహేష్, గాయత్రి దంపతులు హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రధాన కార్యదర్శి లోచర్ చంద్రశేఖర్, కోశాధికారి బట్టు గంగాధర్, గౌరవ అధ్యక్షుడు చిట్టాపూర్ నర్సయ్య, నాయకులు బత్తుల భాస్కర్, రాజేందర్‌రెడ్డి, ప్రభాకర్, ఆకుల గణేష్, అంకరి కిరణ్, శికారి విజయ్ తదితరులు పాల్గొన్నారు.