నిజామాబాద్

పోతంగల్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీపేట, మే 12: నవీపేట మండలంలోని పోతంగల్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని కలెక్టర్ యోగితారాణా పేర్కొన్నారు. ఈ గ్రామాన్ని ఇటీవలే ప్రముఖ పారిశ్రామికవేత్త దత్తత తీసుకుని వసతుల కల్పనకు చొరవ చూపడంతో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మరింత తోడ్పాటును అందించేందుకు వీలుగా కలెక్టర్ గురువారం పోతంగల్ గ్రామాన్ని సందర్శించి స్థానిక ప్రజలతో భేటీ అయ్యారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు, కావాల్సిన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సంసద్ యోజన పథకం కింద రెంజల్ మండలం కందకుర్తి, జుక్కల్ మండలం కౌలాస్ గ్రామాలను ఆయా నియోజకవర్గాలు దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నట్లుగానే, నవీపేట్ మండలం పోతంగల్ గ్రామాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ పథకం కింద సన్ టీవి యాజమాన్యం దత్తత తీసుకోవడం అభినందనీయమన్నారు. అయితే ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న పారిశ్రామికవేత్తతో కలిసి పోతంగల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పరంగా తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామంలోని ప్రతి కుటుంబం వ్యక్తిగత మరుగుదొడ్డిని నిర్మించుకుని, బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా తీర్చి దిద్దేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు. తద్వారా వ్యాధుల నుండి కాపాడుకోవడంతో పాటు ఆరోగ్యంగా ఉండేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. మరుగుదొడ్లతో పాటు ప్రతి కుటుంబం ఇంకుడు గుంతను నిర్మించుకోవాలని, ఇందుకోసం ఇజిఎస్ ద్వారా 4వేల రూపాయలు చెల్లించడం జరుగుతుందన్నారు. ఇంకుడు గుంతలను నిర్మించుకోవడం ద్వారా వృథా నీటిని ఈ గుంతలోకి వెళ్లే విధంగా మళ్లించుకుంటే, భూగర్భ జలమట్టం పెరిగి, భవిష్యత్‌లో నీటి సమస్య తలెత్తకుండా ఉంటుందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకంలో భాగంగా ఈ సంవత్సరం పోతంగల్ గ్రామంలో 40వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని, అందువల్ల ప్రతి ఒక్కరు కనీసం 10మొక్కలైనా నాటాలని కలెక్టర్ సూచించారు. మాతాశిశు మరణాలను సంఖ్యను తగ్గించేందుకు అమలు చేస్తున్న అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా ప్రతి గర్భిణీ స్ర్తి, బాలింతలు, చిన్నారులు ఖచ్చితంగా అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి, అక్కడ అందించే పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. అదే విధంగా 30నుండి 60సంవత్సరాల లోపు మహిళలు ఖచ్చితంగా గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్లకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గ్రామంలోని నిరుద్యో యువతి, యువకులకు శిక్షణతో కూడిన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అదే విధంగా గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు కావాల్సిన వౌలిక సదుపాయాలైన కమ్యూనిటీ భవనాలు, మహిళా సంఘ భవనాలు, లైబ్రరీ, అంగన్‌వాడీ కేంద్రాలు, యూత్ క్లబ్ బిల్డింగ్స్‌తో పాటు సిసి రోడ్లు, డ్రైనేజీలు, స్మశాన వాటికల్లో సదుపాయాల కల్పనకు సన్ నెట్‌వర్క్ యాజమాన్యంతో కలిసి కృషి చేస్తామని పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్ సువర్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎజెసి రాజారాం, ఆర్డీఓ యాదిరెడ్డి, డ్వామా పిడి వెంకటేశ్వర్లు, ఐకెపి పిడి చంద్రమోహన్‌రెడ్డి, డిఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకట్, ఎంపిపి రాజేంద్రకుమార్‌గౌడ్, జడ్పీటిసి శ్రీనివాస్‌గౌడ్, ఎంపిటిసితో పాటు తహశీల్దార్ అనిల్‌కుమార్, ఎంపిడిఓ సాజిద్‌అలీ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.