నిజామాబాద్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, నవంబర్ 13: గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు ధీటుగా జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించడంలో ముందున్నదని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) డాక్టర్ రమేష్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పూర్వ ఆచార్యుల సన్మాన మహోత్సవం జరుగగా, ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మెడికల్ కళాశాల, దానికి అనుబంధంగా ఉన్న ఆసుపత్రిలో అన్ని విభాగాలకు సంబంధించిన ఫ్యాకల్టీ వైద్యులు అందుబాటులో ఉండటం వల్ల సకాలంలో రోగులకు వైద్య సేవలు అందించడంలో ఈ ఆసుపత్రి ముందున్నదని అన్నారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో జరగని శస్త్ర చికిత్సలు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జరుగుతున్నాయన్నారు. ముఖ్యంగా గైనిక్, ఆర్థో, సర్జన్ వంటి వైద్య బృందం సమన్వయంతో స్థానిక ఆసుపత్రిలో మెరుగైన సేవలను అందించడం జరుగుతుందన్నారు. నూతనంగా ఏర్పడిన మెడికల్ కళాశాలకు ఎంసీఐకి సంబంధించిన లోటుపాట్లు ఉన్నప్పటికీ, అన్ని విభాగాలకు సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతోనే కళాశాలకు అనుమతి లభించిందన్నారు. వైద్య వృత్తిలో ఒకరికొకరితో బంధుత్వాలు ఉన్నప్పటికీ, ఒక వ్యవస్థలో కీలకమైన వ్యక్తులుగా ఉన్నందున క్రమశిక్షణతో కూడుకున్న పద్ధతులను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నారు. వైద్య వృత్తి సహజం అయినప్పటికీ, మానవతా దృక్పథంతో సేవలు అందించినప్పుడే వృత్తికి న్యాయం చేసిన వారమవుతామన్నారు. జిల్లా మెడికల్ కళాశాల, ఆసుపత్రికి తక్షణమే నిధులు కేటాయించాలని ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నామన్నారు. పూర్వ ఆచార్యుల మహోత్సవం అనే బదులు వైద్య వృత్తిపరంగా నిత్యం విద్యార్థి భావనలోనే ఉండాలన్నారు. అనంతరం 2012సంవత్సరంలో జిల్లా మెడికల్ కళాశాల మంజూరైనప్పటి నుండి సేవలు అందించిన పూర్వ ఆచార్యులైన టీఎస్‌ఎంఐడీసీ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ సుమన్‌చంద్ర, రిటైర్డ్ డీఎంఈ రమణి, అసిస్టెంట్ డీఎంఈ డాక్టర్ జిజియాబాయి, ఉస్మానియా హెచ్‌ఓడీ డాక్టర్ తిమ్మారెడ్డి, గాంధీ ఆసుపత్రి హెచ్‌ఓడీ డాక్టర్ బన్సీలాల్, మలక్‌పేట్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవూఫ్‌లను మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఇందిరా, ఆసుపత్రి సూపరింటెండెంట్ రాములు సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గోపాల్‌సింగ్, నవీన్‌కుమార్, డాక్టర్ రజినీకాంత్, డాక్టర్ విశాల్, డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, డాక్టర్ బాల్‌రాజ్, డాక్టర్ భూమ్‌రెడ్డి, మెడికోలు పాల్గొన్నారు.

రెండో రోజు నామినేషన్లు నిల్
ఆర్మూర్, నవంబర్ 13: ఆర్మూర్ నియోజకవర్గ స్థానానికి రెండో రోజైన మంగళవారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు తెలిపారు. మొదటి రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆకుల లలిత నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. రెండవ రోజు మంగళవారం మంచి ముహూర్తం లేదని భావించిన ఆయా పార్టీల నాయకులు నామినేషన్లు వేయలేదు. ఆర్మూర్ తహశీల్ కార్యాలయానికి వంద మీటర్ల పరిధిలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఎన్నికల వ్యయంపై
నిఘా పెట్టాలి
జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థుల వ్యయంపై నిఘా పెట్టాలని ఎన్నికల వ్యయ పరిశీలకుడు నంద కుమార్ అన్నారు. మంగళవారం ఉదయం ఆర్మూర్‌లోని తహశీల్ కార్యాలయంలో ఎఇఓ, వీఎస్టీ, ఎఫ్‌ఎస్టీ, ఎస్‌ఎస్‌టీ, ఎంసీసీ తదితర బృందాలతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. అభ్యర్థులు చేస్తున్న ఖర్చుపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని అన్నారు. ఎన్నికల సందర్భంగా డబ్బుల పంపిణీపై దృష్టి పెట్టాలని, అడ్డుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఆర్‌ఓ శ్రీనివాసులు, ఎఆర్‌ఓ రాణాప్రతాప్‌సింగ్, ఆయా బృందాల ఇన్‌చార్జీలు పాల్గొన్నారు.