నిజామాబాద్

కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్, నవంబర్ 14:తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమయ్యిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాద్యక్షుడు అమర్‌నాథ్‌బాబు అన్నారు. బుధవారం బోధన్‌లో జరిగిన నియోజకవర్గ స్థాయి విస్త్రుత సమావేశంలో ఆయన మాట్లాడారు. తెరాస పాలన వలన తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమి లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలన సాగించి రాష్ట్రాన్ని పూర్తిగా దోచేశారని ఆరోపించారు. ఎన్నో త్యాగాల ద్వారా సాధించుకున్న తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి అన్ని వర్గాల వారికి న్యాయం చేయాల్సి ఉన్నప్పటికీ తెరాస పాలన అందుకు విరుద్ధంగా కొనసాగిందన్నారు. తెలుగుదేశాన్ని దెబ్బ తీసేందుకు ఎన్ని రకాల కుట్రలు జరిగినా పార్టీ కార్యకర్తలు అధైర్యపడకుండా ముందుకు వెళుతున్నారని ఆయన వివరించారు. అధికారంలో ఉన్నా, లేకున్నా పార్టీ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు పార్టీ కార్యకర్తలు ఎళ్లవేళలా కృషి చేశారని మునుముందు కూడా ఇదే స్పూర్తిని కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో కాంగ్రేస్, తెలుగుదేశం మహా కూటమికి పట్టం కట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు తెలుగుదేశంలో చేరగా వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, నాయకులు పటేల్, క్రిష్ణారెడ్డి, లక్ష్మన్, రవీందర్, వెంకటేశ్వర్‌రావ్, హన్మంత్‌రావ్, సునీత నాయుడు, పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి నామినేషన్ దాఖలు
ఆర్మూర్, నవంబర్ 14: ఆర్మూర్ తహశీల్ కార్యాలయంలో బుధవారం టీఆర్‌ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మొదటి సెట్టు నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా సిద్ధులగుట్టపై గల శివాలయంలో పూజలు చేసిన జీవన్‌రెడ్డి అనంతరం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం తల్లిదండ్రులు, భార్యతో కలిసి తహశీల్ కార్యాలయానికి వెళ్లారు. తన మొదటి సెట్టు నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులుకు అందజేశారు. అనంతరం జీవన్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సంక్షేమ, అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. అలాగే రెండవ నామినేషన్‌ను సింధుకర్ చరణ్‌కుమార్ దాఖలు చేశారు.

నామినేషన్ వేసిన పోచారం తనయుడు
బాన్సువాడ రూరల్, నవంబర్ 14: బాన్సువాడ నియోజకవర్గం నుండి రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనయుడు పోచారం భాస్కర్‌రెడ్డి నామినేషన్ వేశారు. తన అనుయాయులతో కలిసి నామినేషన్ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అంతకుముందు పోచారం నామినేషన్ దాఖలు చేసిన తరువాత భాస్కర్‌రెడ్డి నామినేషన్ వేశారు.