నిజామాబాద్

అర్బన్‌లో మూడోరోజు 3 నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, నవంబర్ 14: నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు బుధవారం రోజున కార్పోరేషన్ కార్యలయంలో రిటర్నింగ్ అధికారి ఎదుట నామినేషన్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు అర్బన్ నియోజకవర్గ తాజామాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా తన అనుయాయులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎదుట రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అనంతరం బిగాల గణేష్ గుప్తా తండ్రి బిగాల కృష్ణమూర్తి అనుబంధ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ, తాను టీఆర్‌ఎస్ తరఫున రెండు సెట్ల నామినేషన్ వేయడం జరిగిందని, గురువారం రోజున నిజామాబాద్ ఎంపీ కవితతో కలిసి తాను మరో రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తానని చెప్పారు. ఇది తనకు మూడవ ఎన్నిక అని, నగర ప్రజలు తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. బిగాల వెంట నగర మేయర్ ఆకుల సుజాత, టీఆర్‌ఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు ఈగ గంగారెడ్డి, కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.
బీఎస్‌పీ ఆధ్వర్యంలో...
బహుజన సమాజ్ పార్టీ నుంచి రిటర్నింగ్ అధికారి ఎదుట మహతి రమేష్ బుధవారం తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆశీస్సులతో తాను బీఎస్‌పీ పార్టీ నుండి పోటీ చేస్తున్నానని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు కూడా సరైన న్యాయం చేయలేదని, అందుకే తాను ఈ వర్గాలకు న్యాయం చేయడానికి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని అన్నారు. ఈ నాలుగున్నర ఏళ్లలో నగర అభివృద్ధి ఇసుమంతైనా జరగలేదని, తాను ఎమ్మెల్యేగా ఎన్నికైతే నగర అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో మహంతి రమేష్‌తో పాటు బీఎస్పీ నాయకులు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్ అభ్యర్థి గంపగోవర్దన్ నామినేషన్
*రెండు సెట్ల నామినేషన్లు దాఖలు
కామారెడ్డి, నవంబర్ 14: కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్‌కు పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే గంపగోవర్ధన్ బుధవారం తన ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ దాఖల్ చేశారు. నామినేషన్‌కు ముందు ఎన్నికల నామినేషన్ కార్యాలయానికి వెళ్లే ముందు ఐడిసిఎంఎస్ చైర్మెన్ ముజిబొద్దిన్ వచ్చి టీఆర్‌ఎస్ అభ్యర్థి గంపగోవర్ధన్ చేతికి అల్లా దగ్గర పూజలు చేసి తెచ్చిన ‘ ఇమామిజామీన్’ను చేతికి కట్టారు. అక్కడి నుండి మున్సిపల్ చైర్సన్ పిప్పిరి సుష్మ, టీఆర్‌ఎస్ నాయకుడు వేణు, వారి న్యాయవాది రాజిరెడ్డితో కలిసి వెళ్లి నామినేషన్ దాఖల్ చేశారు. రెండవ సారి కూడా టీఆర్‌ఎస్ నాయకులు నర్సింగ్‌రావు, మోతే కృష్ణగౌడ్, డాక్టర్. ఎట్టెం సిద్దిరాములుతో కలిసి వచ్చిన టీఆర్‌ఎస్ అభ్యర్థి రెండో నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందించారు. ఈసందర్భంగా టీఆర్‌ఎస్ అభ్యర్థి గంపగోవర్ధన్ మాట్లాడుతూ, కామారెడ్డి అభివృద్ధి చెందాలంటే కేవలం టీఆర్‌ఎస్ వల్లనే సాధ్యం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తరువాత తెలంగాణ రాష్ట్రంలో నాల్గున్నర సంవత్సరంలో జరిగిన అభివృద్ధి ప్రజలందరు చూస్తున్నారని అన్నారు. ప్రజలు మళ్లీ ఆదరించి గెలిపిస్తే, కామారెడ్డిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. మెనిఫెస్టోలో లేని పనులు కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. మళ్లీ టీఆర్‌ఎస్ అధికారంలో వచ్చిన వెంటనే బంగారు తెలంగాణను పూర్తిగా సాధించుకుంటామని అన్నారు. కేవలం నాల్గు ఏళ్ల మూడు నెలల్లో ఏ ప్రభుత్వాలు కూడా సాధించని అభివృద్ధిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు.