నిజామాబాద్

మూడు స్థానాలపై పీటముడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, నవంబర్ 14: ఓ వైపు నామినేషన్ల దాఖలు పర్వం ఊపందుకుంటుండగా, మరోవైపు మహాకూటమి అభ్యర్థుల ఎంపికపై నెలకొని ఉన్న ప్రతిష్టంభన దూరం కాలేకపోతోంది. కాంగ్రెస్ అధిష్టానం బుధవారం ప్రకటించిన రెండవ జాబితాలోనూ పూర్తిస్థాయిలో స్పష్టత రాలేకపోయింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పెండింగ్‌లో ఉంచిన నాలుగు స్థానాలకు గాను కేవలం ఎల్లారెడ్డి నియోజకవర్గానికి మాత్రమే మలివిడతలో అభ్యర్థిని ప్రకటించారు. ఈ సెగ్మెంట్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా జాజాల సురేందర్‌కు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీంతో ఎల్లారెడ్డి సీటుపై కొనసాగిన సస్పెన్స్‌కు తెరపడినట్లయ్యింది. ఈ స్థానాన్ని పొత్తులో భాగంగా తెలంగాణ జన సమితి కోరగా, తెజసా తరఫున ప్రముఖ హైకోర్టు న్యాయవాది రచనారెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ తరఫున సుభాష్‌రెడ్డి, మదన్‌మోహన్ తదితరులు కూడా టిక్కెట్‌ను ఆశిస్తూ తమవంతు ప్రయత్నాలు సాగించారు. అయితే ఎట్టకేలకు అధిష్టానం జాజాల సురేందర్ వైపే మొగ్గు చూపింది. ఇదివరకు ఆయన పలు పర్యాయాలు ఇదే నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం సానుభూతి పవనాలతో ఆయన గట్టెక్కేందుకు అవకాశాలున్నాయన్న అంచనాతో కాంగ్రెస్ హైకమాండ్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించినట్టు తెలుస్తోంది. అయితే మిగతా మూడు సెగ్మెంట్ల విషయంలో పీటముడి నెలకొని ఉంది. నిజామాబాద్ అర్బన్, రూరల్, బాల్కొండ నియోజకవర్గాలకు ఇంకనూ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా, ఈ మూడు సెగ్మెంట్లలో పరిస్థితి ఒకదానితో ఒకటి ముడిపడి ఉండడం వల్ల ఆ చిక్కుముడిని విప్పేందుకు అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా నుండి కనీసం ఏదైనా ఒక స్థానం నుండి పోటీ చేయాలని టీ.టీడీపీ భావిస్తోంది. అయితే ఆ పార్టీకి ఏ నియోజకవర్గం కేటాయించాలనేది ఖరారు కాకపోవడం వల్లే మూడు సెగ్మెంట్లలో అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. నిజామాబాద్ రూరల్ స్థానాన్ని టీడీపీకి కేటాయిస్తే ఆ పార్టీ తరఫున మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు బరిలోకి నిలువడం దాదాపుగా ఖాయమని భావిస్తున్నారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసే విషయమై మండవ ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకుండా సస్పెన్స్ పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇదే స్థానాన్ని ఆశిస్తూ కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీ డాక్టర్ ఆర్.్భపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అర్కల నర్సారెడ్డి, నగేష్‌రెడ్డి తదితరులు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరోవైపు తెదెపా తరఫున బాల్కొండ నియోజకవర్గం నుండి బరిలోకి దిగేందుకు మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ తనయుడు, నియోజకవర్గ ఇన్‌చార్జి ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి ఆసక్తి చూపుతున్నారు. నిజానికి మొదట్లో తెదెపాకు బాల్కొండ స్థానాన్ని కేటాయించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని విస్తృత ప్రచారం జరిగింది. ఈ కారణంగానే మాజీ స్పీకర్ కేఆర్.సురేష్‌రెడ్డి సైతం కాంగ్రెస్‌ను వీడి తెరాసలో చేరారు. కాంగ్రెస్ తరఫున మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ టిక్కెట్ తనకే కేటాయిస్తారనే ధీమాతో ప్రచార రథాన్ని సిద్ధం చేసుకుని అధిష్టానం అధికారిక ప్రకటన కోసం ఎదురుతెన్నులు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీ.టీడీపీకి బాల్కొండ, నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్లలో ఏ స్థానాన్ని కేటాయిస్తారు? అసలు తెదెపాకు ఉమ్మడి జిల్లా నుండి పోటీ చేసే అవకాశం కల్పిస్తారా? లేక అన్ని స్థానాల నుండి కాంగ్రెస్ అభ్యర్థులే బరిలోకి దిగుతారా? అనేది తేటతెల్లం కావాల్సి ఉంది. ఒకవేళ నిజామాబాద్ రూరల్ స్థానాన్ని తెదెపాకు కేటాయిస్తే, అక్కడి నుండి బరిలోకి దిగాలని భావిస్తున్న ఎమ్మెల్సీ భూపతిరెడ్డిని అర్బన్ సెగ్మెంట్ నుండి అవకాశం కల్పించే దిశగా కూడా కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇలా పెండింగ్‌లో ఉన్న మూడు సెగ్మెంట్లలో పరిస్థితి ఒకదానితో ఒకటి ముడిపడి ఉండడంతో ఈ చిక్కుముడిని అధిష్టానం ఎలా విప్పుతుందనే దానిపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.