నిజామాబాద్

‘కారు’ స్టీరింగ్ చేతబూనిన ఎంపీ కవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, నవంబర్ 15: నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత గురువారం కారు స్టీరింగ్‌ను చేతబూని స్థానికులను, తెరాస పార్టీ శ్రేణులందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. నిజామాబాద్ అర్బన్ టీఆర్‌ఎస్ అభ్యర్థి బిగాల గణేష్‌గుప్తా గురువారం రెండవ సెట్ నామినేషన్‌ను దాఖలు చేసేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆయన ఎం.పీ కవితను ఆహ్వానించడంతో ఆమె బిగాల నివాసానికి చేరుకున్నారు. అక్కడి నుండి రిటర్నింగ్ అధికారి కార్యాలయంగా ఉన్న నిజామాబాద్ నగర పాలక సంస్థకు చేరుకుని నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ మేరకు బిగాల గణేష్‌గుప్తా, ఇతర తెరాస నాయకులంతా ఎం.పీ కవితతో కలిసి బిగాల నివాసం నుండి బయటకు వచ్చారు. అక్కడ ప్రత్యేకంగా గులాబీ రంగుతో ముస్తాబు చేసిన అంబాసిడర్ కారును చూడగానే ఎం.పీ కవిత ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్నారు. అప్పటికి గాని ఎం.పీ కవిత కారు నడుపబోతున్నారని తెరాస నాయకులు కూడా పసిగట్టలేకపోయారు. కారు స్టీరింగ్‌ను చేతబూని, తెరాస అభ్యర్థి బిగాల గణేష్‌గుప్తాను కారులో కూర్చోవల్సిందిగా ఎం.పీ ఆహ్వానించడంతో ఆయన ముందు సీట్లో కూర్చున్నారు. నగర మేయర్ ఆకుల సుజాత, తెరాస రాష్ట్ర నాయకుడు ఏఎస్.పోశెట్టిలు వెనుక సీట్లో కూర్చోగా, బిగాల నివాసం నుండి రిటర్నింగ్ అధికారి కార్యాలయమైన నిజామాబాద్ నగర పాలక సంస్థ వరకు ఎం.పీ కవిత స్వయంగా కారు నడుపుకుంటూ రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదివరకు ఎప్పుడూ ఎం.పీ కవిత ఇలా కారును తానే డ్రైవ్ చేసుకుంటూ ఎక్కడికీ వెళ్లకపోవడంతో ప్రస్తుతం ఆమె అంబాసిడర్ నడిపిస్తూ ముందుకు సాగుతుండడాన్ని గమనించిన స్థానికులు సైతం ఆ దృశ్యాలను తమతమ సెల్‌ఫోన్‌లలో వీడియోలు, ఫొటోలు తీస్తూ బంధించడం కనిపించింది. మొత్తం మీద అర్బన్ తెరాస అభ్యర్థి బిగాల గణేష్‌గుప్తాచే నామినేషన్ దాఖలు చేయించేందుకు ఎం.పీ కవిత కారును స్వయంగా నడుపుతూ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి రావడం అందరి దృష్టిని ఆకర్షించింది.

అఖండ మెజార్టీతో గెలుస్తాం
- ఆపద్ధర్మ మంత్రి పోచారం
నస్రుల్లాబాద్, నవంబర్ 15: రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఆఖండ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆపదర్మ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బీర్కూర్ మండలంలోని దామరాచ్చ, కిష్టాపూర్, శించొల్లి, తదితర గ్రామాల్లో టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత 50 సంవత్సరాల పాలనల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రానికి ఏమి చేశారని ఒక్కసారి గుర్తు చేసుకోవాలని , ప్రజలకు ఏమి చేశామని వారు గుర్తు చేసుకోవాలన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకువచ్చింది. 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందించిందని ఆయన అన్నారు. రాబోయే జూన్ వరకు కాళేశ్వరం నీటిని సింగూరు ద్వారా నిజాంసాగర్ వరకు వచ్చేలా చూస్తామని, రైతులకు రెండు పంటలకు నీటి కోసం ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆయా గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. సంక్షేమ పథకాలను చేపట్టిన టీఆర్‌ఎస్ పార్టీ వైపు ఉంటారో, ఏమి చేయాలేని కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారో ప్రజలు నిర్ణయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోచారం భాస్కర్‌రెడ్డి, ఎంపీపీ మల్లెల మీనా హన్మంత్, బీర్కూర్, నసరుల్లాబాద్ మండలాల అధ్యక్షుడు గాండ్ల రఘు, ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.