నిజామాబాద్

పోలింగ్ కేంద్రాల వారీగా దివ్యాంగుల వివరాలు ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, నవంబర్ 16: కాగా, పోలింగ్ కేంద్రాల వారీగా దివ్యాంగులు ఎంత మంది ఉన్నారో, వారి వైకల్యమేమిటో శనివారంలోగా నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అంగన్‌వాడీ, డీఆర్‌డీఏ, పంచాయతీరాజ్ అధికారులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుత ఎన్నికల్లో దివ్యాంగులు కూడా ఓటు వేయడానికి అవసరమైన సదుపాయాలు కల్పించవలసిందిగా ఎన్నికల సంఘం ఆదేశించిందని, ఇందుకై పోలింగ్ కేంద్రాల వారీగా ఎంత మంది దివ్యాంగులు, వారి వైకల్యంపై నివేదికలు ఇవ్వాల్సిందిగా తెలిపామని, వారి వివరాలు శనివారంలోగా సమర్పించాలని ఆదేశించారు. తద్వారా ఎవరికి ఏ సదుపాయాలు కల్పించాలో ఆ దిశగా చర్యలు తీసుకుంటామని ఎన్నికల రోజు వారు సులభంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి సదుపాయాలు కల్పిస్తామని, ఆటో రవాణా, వీల్ చైర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ పనులకై యుద్ధ ప్రాతిపదికన సర్వే నిర్వహించి వెంటనే వివరాలు సమర్పించాలని ఆయన ఆదేశించారు. సంబంధిత అధికారులు ఈ వివరాలను ఈఆర్‌ఓ నెట్‌లో నమోదు చేయాలన్నారు. డిసెంబర్ 1వ తేదికల్లా ప్రతి ఇంటికి ఓటరు స్లిప్‌లు పంపిణీ చేసి విధిగా రశీదు పొందాలని, ఓటింగ్ రోజున తమకు స్లిప్‌లు అందలేదంటే సంబంధిత అధికారులను బాధ్యులను చేయడం జరుగుతుందన్నారు. ఓటరు స్లిప్‌లతో పాటు పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను, ఓటరు గైడ్‌తో అవసరమైన సూచనల వివరాలను కూడా పంపిణీ చేస్తామని అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ర్యాంప్‌లు, విద్యుత్, త్రాగునీరు తదితర సదుపాయాలను సరిచూసుకోవాలన్నారు.కాగా, తాను గ్రామాల్లో పర్యటించిన సందర్భంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు సరిగా లేనట్లు గుర్తించడం జరిగిందని, అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం, చెత్తను ఊడ్చడం, డ్రైనేజీలు తీయడం, చెత్త ఎత్తడం, నీరు నిల్వ ఉండకుండా చేయడం, యాంటీ లార్వా కార్యక్రమాలు నిర్వహించాలని గ్రామస్థాయి, మండల స్థాయి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అపరిశుభ్రత వల్ల దోమలు వ్యాప్తి చెంది, సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండటమే కాకుండా ప్రజలు రోగాల బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సానిటేషన్ పనులు నిర్వహించేందుకు సరిపడా సంఖ్యలో పారిశుద్ధ్య కార్మికులు కూడా అవసరమని అధికారులకు సూచించారు. స్వైన్‌ఫ్లూ సోకకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.