నిజామాబాద్

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, నవంబర్ 16: ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సత్యనారాయణ హెచ్చరించారు. శుక్రవారం జనహిత భవన్‌లో ఎంసీ కంట్రోల్ రూమ్‌లో జరిగిన ప్రింట్, అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్‌మిట్‌లో ఆయన మాట్లాడారు. నిన్నటి వరకు 15-11-18 వరకు కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 11 నామినేషన్‌లు దాఖాలు అయ్యాయని, జుక్కల్ నియోజకవర్గంలో 5, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 3, కామారెడ్డి నియోజకవర్గంలో 3 నామినేషన్‌లు దాఖలైనట్లు వివరించారు. బీఎస్పీ నుంచి 1, బీజేపీ నుంచి 1, కాంగ్రెస్ నుంచి రెండు, టీఆర్‌ఎస్ నుంచి 5. ఇండిపెండెంట్ నుంచి ఇద్దరు అభ్యర్థులు నామినేషన్‌లు వేయడం జరిగిందన్నారు. ఈ నెల 19వ తేదీ వరకు నామినేషన్‌ల ప్రక్రియా కొసాగుతోందని, 20న నామినేషన్‌ల పరిశీలన జరుగుతుందని, 22 లోగా విత్‌డ్రావల్స్ ప్రక్రియా ఉంటుందన్నారు. ఉద్యోగులకు ఈ నెల 24లోగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని, ఎన్నికల వ్యయ పరిశీలకులుగా రాజిలాల్ మీనా తిరిగి 23, 24వ తేదీల్లో పర్యటిస్తారని, కామారెడ్డి, జుక్కల్ సెగ్మెంట్‌లకు సాదారణ పరిశీలకులుగా అభిషేక్‌కృష్ణా, బ్రిజ్‌రాయ్, జుక్కల్ నియోజకవర్గానికి సాధారణ పరిశీలకులుగా సుఖీబీర్‌సింగ్, కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలకు పోటీస్ అబ్జర్వర్‌గా ఈ నెల 18న వస్తున్నారని అన్నారు. విజిల్ యాప్‌కు 45 పిర్యాదులు, నేషనల్ గ్రీవెనె్సస్ ఆన్‌లైన్‌కు 28 పిర్యాదులు, జిల్లా ఎన్నికల కాంట్రోల్ రూమ్‌కు 121 పిర్యాదులు అందాయన్నారు. సువిధ ఆన్‌లైన్‌కు 257 అనుమతులు కోరడం జరిగిందని, వీటిలో 237 ఆనుమతులు ఇవ్వడం జరిగిందని, మిగిలినవి పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన్నట్లు అయితే నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రచారంలో మతం, కులం, బాషాపరమైన ఉల్లంఘనైతే ప్రజాప్రాతినిధ్య చట్ట సెక్షన్ 125 అనుసరించి, 1951 సంవత్సరం ఐపీసీ 153 ఏ ప్రకారం 3 సంవత్సరాలు జైలు శిక్ష 6 సంవత్సరాలు అనర్హాత వేటు, జరిమానా పడుతుందన్నారు. పోలింగ్‌కు ముందు 48 గంటల్లో సభలు నిర్వహించరాదని, ఉల్లంఘన జరిగితే సెక్షన్ 126ను అనుసరించి 2 సంవత్సరాలు జైలు శిక్ష జరిమానా విధించడం జరుగుతుందని, అనుమతులు లేకుండా వాహనాలలో ఓటర్లను చేరవేయడం నేరమని, 133 సెక్షన్ కింద 3 నెలల జైలు శిక్ష విధించడం జరుగుతుందని, పబ్లిక్ మీటింగ్‌లో అంతరాయం కలిగిస్తే సెక్షన్ 127 ప్రకారం మూడు మాసాల పాటు జైలు శిక్ష, ఉద్యోగులు, వ్యక్తులు ఓటు రహస్యాన్ని బహిర్గతం చేస్తే సెక్షన్ 128 ప్రకారం మూడు మాసాల పాటు శిక్ష, జరిమానాకు గురవుతారని, ప్రభుత్వ ఉద్యోగులు ఏవరైనా అభ్యర్థి ఎలక్షన్ ఏజేంట్, పోలింగ్ ఏజేంట్, కౌంటింగ్ ఏజేంట్‌గా వ్యవహారిస్తే 134 సెక్షన్ ప్రకారం మూడు మాసాల పాటు జైలు శిక్ష జరిమానా, పోలింగ్, రోజున పోలింగ్ స్టేషన్ పరిధిలో ప్రచారం, ఫలానా అభ్యర్థికి ఓటు వేయమనడం, ఓటు వేయవద్దనడం, సైగలు చేయడం వంటివి 130 సెక్షన్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పోలింగ్ రోజున పోలింగ్ స్టేషన్ వద్ద లౌడ్ స్పీకర్స్, మెగాపోన్స్ సెక్షన్ 131 ప్రకారం నిషేద్దమని, అతిక్రమిస్తే 3 మాసాల జైలు జరిమానా విధించడం జరుగుతుందని సెక్షన్ 135 బీ ప్రకారం ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం నేరమని, దివ్యాంగులకు 585 వాహనాలు సమకూర్చి ఇంటి నుంచి పోలింగ్ స్టేషన్‌కు ఓటు నమోదు చేయించిన అనంతరం తిరిగి ఇంటి వద్దకు చేర్చడం జరుగుతుందన్నారు. కరపత్రాలు, పోస్టర్‌లు, తదితర ప్రింటింగ్ సంబంధించి ఎన్ని ముద్రించినవని, వాటి సంఖ్య పేరు, తప్పని సరిగా ప్రింటింగ్ ప్రెస్ వారు తెలుపాలని, లేన్నట్లు అయితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అభ్యర్థులు 10 వేలు దాటితే చెక్ రూపేణ చెల్లించాల్సి ఉంటుందని, జిల్లాకు కొత్తగా 52 వేల 500 బ్రేయిలీ ఏపిక్ కార్డులు రానున్నాయన్నారు. ఏవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అతిక్రమించవద్దని, అభ్యర్థి నేర చరిత్రపై మూడు సార్లు ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ శే్వతారెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సందర్బంగా జిల్లాకు 7 కంపెనీల పారా మిలీటరి బలగాలు వస్తున్నాయని, అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పోలీస్ బలగాలు వస్తున్నాయన్నారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్‌లలో పటిష్ట బందోబస్తు చేస్తున్నట్లు, నేను సైతం ప్రాజెక్టు కింద గ్రామ సభలు నిర్వహించడం జరుగుతున్నట్లు, 28 కళా బృందాల ద్వారా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నట్లు ప్రజలల్లో ఎన్నికల విధానంపై నమ్మకాన్ని పెంపొందించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బందోబస్తులో టెక్నాలజీని వాడుతున్నట్లు ప్రతీ పోలింగ్ స్టేషన్‌ను కవర్ చేయడం జరుగుతుందని, పోలింగ్ స్టేషన్ లోపల వెబ్‌కాస్టింట్, బయట వద్ద మీటర్ల వరకు సీసీ కెమెరాలతో నిఘా ఉంటుందని ప్రతీ సంఘటనను కవర్ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతీ గ్రామంలో లోపలికి, బయటకు వెళ్ళే దారిలో దాదాపు 5, 6 సీసీ కెమోరాలతో పర్యవేక్షించడం జరుగుతుందని, ఇప్పటికే 45 గ్రామాలల్లో సీసీ కెమోరాలతో నిఘా ఉన్నట్లు, సీసీ కెమెరాలు పర్యవేష్తిన్నాయనే దైర్యం కలిగించడం జరుగుతుందన్నారు. ప్రశాంతంగా పోలింగ్ జరుగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు, గ్రామ సభల ద్వారా అవగాహన కలిగిస్తున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు 307 గ్రామ సభలునిర్వహించడం జరిగిందని, మిగిలిన గ్రామాలల్లో కూడా సభలు నిర్వహించడం జరుగుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 30 లక్షల 60 వేల రూపాయల సీజ్ చేయడం జరిగిందని, 427 కేసులల్లో బైండోవర్ చేయడం జరిగిందని, ఎన్‌బీడబ్ల్యూ వారెంట్‌లను కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరిగిందని, రెగ్యులర్‌గా వాహనాలు చెకింగ్ చేయడం జరుగుతున్నట్లు, క్యాష్ మద్యం, రవాణాపై నిఘా పెట్టిన్నట్లు, ప్రశాంత పూరిత ఎన్నికలు నిర్వహణాకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రెస్‌మీట్‌లో జేసీ యాదిరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేశ్ దొత్రే, నోడల్ అధికారులు చంద్రమోహన్‌రెడ్డి, రాము, శ్రీనివాస్, పద్మ, రఘునాథ్, డాక్టర్ రమేశ్, ఝాన్సీ, నాగేంద్రయ్య, కలెక్టరేట్ పరిపాలనాధికారి పద్మారావు, ఎన్నికల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.