నిజామాబాద్

శివసేన నుండి శ్రీహరి సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, నవంబర్ 19: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున శివసేన నగర అధ్యక్షునిగా ఉన్న శ్రీహరిగౌడ్‌ను సస్పెండ్ చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షడు మురారి పేర్కొన్నారు. సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందుత్వం, దేశ భక్తి కోసం శివసేన పార్టీ ముందుంటుంది అన్నారు. అందులో భాగంగానే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు హిందూ ధర్మానికి శివసేన కట్టుబడి పని చేస్తోందని చెప్పారు. మహారాష్టల్రో శివసేన పార్టీ బలమైన పార్టీగా ఉన్న విషయం తెలిసిందేనన్నారు. ఇక తెలంగాణాలో 2014ఎన్నికలలో 14 స్థానాలలో పోటీ చేసిందని, ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో కూడా పోటీ చేసేందుకు శివసేన జాతీయ అధ్యక్షుడైన ఉద్ధవ్‌థాక్రే 86బీ.్ఫంలను ఇవ్వడం జరిగిందన్నారు. ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవడానికి రాష్ట్ర అధ్యక్షుడు ఉద్దవ్‌థాక్రేతో పాటు శివసేనకు చెందిన మంత్రులందరు తెలంగాణలో ప్రచారం చేస్తారని అన్నారు. ఇక నగర అభ్యర్థి అయిన శ్రీహరిగౌడ్ ఆది నుంచి పార్టీ జెండా మోస్తున్నాడని, దాంతో ఆయనకు ఈ నెల 15న శివసేన జిల్లా అధ్యక్షుడు గోపికిషన్ సమక్షంలో బీ.్ఫం ఇచ్చామని, కానీ 15వ తేదీ తర్వాత శివసేనలోకి బీజేపీ పార్టీ నుండి వచ్చిన ధన్‌పాల్ సూర్యనారాయణకు టిక్కెట్ ఇస్తే బాగుంటుందని పార్టీ అధిష్టానానికి చెప్పడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని పక్కనబెట్టి అతనే మళ్లీ పార్టీకి వ్యతిరేకంగా విలేఖరుల సమావేశం పెట్టి ప్రచారం చేశాడని, దీంతో అతనిపై సస్పెన్షన్ వేటు వేశామన్నారు. శివసేన పార్టీ అధికారం కోసం పాకులాడదని, పని చేసే వారికే టిక్కెట్ ఇస్తుందన్నారు. శ్రీహరి హిందుత్వం కోసం పనిచేయకుండా ఆయన స్వార్ధం కోసం పని చేశాడని, అంతేకాకుండా సోషల్ మీడియాలో శివసేన పార్టీపై దుష్పప్రచారం చేశారని, అందుకే సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. ఇక అర్బన్ నియోజకవర్గం నుంచి ధన్‌పాల్ సూర్యనారాయణ పోటీ చేయడం జరుగుతుందని, ఆయనకు బీ.్ఫం కూడా ఇవ్వడం జరిగిందన్నారు. నగరంలో శివసేన పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో శివసేన అర్బన్ అభ్యర్థి ధన్‌పాల్ సూర్యనారాయణ, కొండ ఆశన్న, అంతిరెడ్డి దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.