నిజామాబాద్

ఆర్మూర్ స్థానం కాంగ్రేదే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందీపేట్, నవంబర్ 19: అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవడం ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్సీ ఆకుల లలితారాఘవేందర్ సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నందిపేటలో నిర్వహించిన రోడ్‌షోలో ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆకులలలితకు 50మంది మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా రాజానగర్, దుబ్బా, 1, 2, 3, 4 వార్డులలో వీధివీధిన పాదయాత్ర చేస్తూ ఇంటింటికి వెళ్లి చేతి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆమె అభ్యర్థించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తమ వార్డులలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, డ్రైనేజీలు, అంతర్గత రోడ్లు నిర్మించకపోవడంతో మురికి వాడలుగా మారాయని మహిళలు ఎమ్మెల్సీ దృష్టికి తెచ్చారు. ఓట్ల కోసం వచ్చిన నాయకులు నాలుగేళ్లయినా మళ్లీ తమ వార్డు ముఖం చూడలేదని ఆక్షేపించారు. ఈ సందర్భంగా పలు వాడలు, ప్రధాన కూడళ్లలో నిర్వహించిన రోడ్‌షోలో ఆకుల లలిత మాట్లాడుతూ, గత నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో పల్లెలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చక ప్రజలకు మొండిచేయి చూపించారని ఆరోపించారు. ఇళ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇవ్వలేదని, ఎస్‌సీ, ఎస్టీలకు మూడెకరాల భూమి, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇంటికో ఉద్యోగం, ఇంటింటికి కుళాయి ద్వారా శుద్ధి జలాలు, మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు ఇస్తానని ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ పాలనలో ఆర్మూర్ అభివృద్ధికి నోచుకోక ఆగమాగమైందని ఆమె ఆవేదన వెలిబుచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సమస్యలన్ని పరిష్కరిస్తామని, ప్రధానంగా గ్రామాల్లో వౌలిక వసతులు, ఉచితంగా 6వంటగ్యాస్ సిలిండర్ల పంపిణీ, గృహ నిర్మాణానికి 5 లక్షల నిధుల మంజూరు, రైతులకు 2 లక్షల రుణమాఫీ, ధాన్యం మద్దతు ధర 2వేలు, పసుపు పంట క్వింటాలుకు 10వేలు చెల్లిస్తామని, మహిళా సంఘాలకు 10లక్షల వరకు వడ్డీలేని రుణం మంజూరు చేస్తామని ఆమె అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేసి తనను గెలపించాలని ఆకుల లలిత కోరారు. ఈ ప్రచారంలో స్థానిక పార్టీ నాయకులు ఇంద్రుడు, సాయికృష్ణారెడ్డి, ముత్యం, సుక్కబొట్ల మోహన్, చిన్నయ్య, దేవత లింగం, తమ్మె గంగాధర్, మంద మహిపాల్, ప్రశాంత్ మనె్నసాగర్, దూడ వెంకటేష్, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.