నిజామాబాద్

ముగిసిన నామినేషన్ల పర్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, నవంబర్ 19: అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల దాఖలు పర్వం సోమవారం నాటితో ముగిసింది. చివరి రోజున నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయా పార్టీల తరఫున అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. టిక్కెట్ ఆశించి భంగపడిన పలువురు ఆశావహులు తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్ వేయగా, మరికొందరు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలుస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే తెరాస అభ్యర్థులు దాదాపుగా నామినేషన్లు దాఖలు చేయడం పూర్తవగా, చివరి రోజున కాంగ్రెస్ అభ్యర్థులు అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేయడం కనిపించింది. బాన్సువాడలో కాంగ్రెస్ అభ్యర్థి కాసుల బాల్‌రాజ్ సుమారు వేయికి పైగా ద్విచక్ర వాహనాలతో భారీ ఎత్తున కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించి నామపత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. నిజామాబాద్ రూరల్ అభ్యర్థి ఆర్.్భపతిరెడ్డి కూడా ఇదే తరహాలో ర్యాలీగా తరలివచ్చి నామినేషన్ వేయగా, ఆర్మూర్‌లో బీజేపీ అభ్యర్థి పీ.వినయ్‌కుమార్‌రెడ్డి కూడా హంగామా చేశారు. తెరాస అభ్యర్థులు ఇదివరకే రెండు సెట్ల నామినేషన్లు వేయగా, బుధవారం నాడు పలువురు మరో సెట్ నామినేషన్‌లు సమర్పించారు. బాన్సువాడలో పోచారం తరఫున ఆయన తనయుడు సురేందర్ మరో సెట్ నామినేషన్ వేశారు. మొత్తంగా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఎవరికివారు పోటాపోటీగా ర్యాలీలు నిర్వహిస్తూ, అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 12వ తేదీ నుండి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవగా, గత శనివారం నాటికి ఉమ్మడి జిల్లాలో 102నామినేషన్లు దాఖలయ్యాయి. ఆదివారం సెలవు దినం కావడంతో చివరి రోజైన సోమవారం అన్ని సెగ్మెంట్ల పరిధిలోనూ నామినేషన్లు పోటెత్తాయి. నిజామాబాద్ జిల్లాలోని అర్బన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి తాహెర్‌బిన్ హందాన్, బీజేపీ తరఫున యెండల లక్ష్మినారాయణ, శివసేన అభ్యర్థిగా ధన్‌పాల్ సూర్యనరాయణగుప్తా, బీఎస్‌పీ తరఫున రాశమల్లు రమేష్, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ కాంగ్రెస్ అభ్యర్థిగా నరాల రత్నాకర్, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున డాక్టర్ సిరాజుద్దీన్, స్వతంత్ర అభ్యర్థులుగా పీ.రాము, ప్రదీప్‌కుమార్, కేవీ.లక్ష్మారెడ్డి, శివప్రసాద్ మహాజన్, మహ్మద్ ఖాజామొయినుద్దీన్, గోపు శంకర్, ఎం.మారుతి, జి.ప్రశాంతి, మల్యాల గోవర్ధన్, సయ్యద్ ఖైసర్, సునీల్‌కుమార్ దయామా, మహ్మద్ వాజిద్‌అలీ, శేక్ అతీక్‌లు, తెలంగాణ ప్రజాపార్టీ అభ్యర్థిగా ఎం.రఘునాథ్, కాంగ్రెస్ అభ్యర్థిగా జైద్‌బిన్ తాహెర్, అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా సయ్యద్ ముజీబుద్దీన్‌లు నామినేషన్‌లు దాఖలు చేశారు. నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్‌కు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డి, బీజేపీ అభ్యర్థిగా గడ్డం ఆనంద్‌రెడ్డి, బీఎల్‌ఎఫ్ అభ్యర్థిగా నూర్జహాన్, ఎన్‌సీపీ అభ్యర్థిగా మలావత్ విఠల్, టీఆర్‌ఎహ్ తరఫున బాజిరెడ్డి గోవర్ధన్, ఇండియా ప్రజా బంధు పార్టీ అభ్యర్థిగా మల్లె మనోజ్, బీఎస్‌పీ అభ్యర్థిగా ఇమ్మడి గోపి, స్వతంత్ర అభ్యర్థిగా ఎం.గంగాధర్‌లు నామినేషన్‌లు వేశారు. బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించి బీఎస్పీ అభ్యర్థిగా ముత్యాల సునీల్‌కుమార్, కాంగ్రెస్ అభ్యర్థిగా ఈరవత్రి అనిల్, బీజేపీ తరఫున రుయ్యాడి రాజేశ్వర్, టీఆర్‌ఎస్ తరఫున వేముల ప్రశాంత్‌రెడ్డి, సమాజ్‌వాది పార్టీ అభ్యర్థిగా అబ్దుల్ నరుూమ్, తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థిగా బింగివార్ రవి, బీఎల్‌ఎఫ్ అభ్యర్థిగా మధుకర్, స్వతంత్ర అభ్యర్థులుగా గుంటి బెనర్జీ, ఈరవత్రి సుహాసిని, సుద్దపల్లి సుధాకర్‌లు నామినేషన్లు సమర్పించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులుజీవన్‌రెడ్డి, ఆకుల లలితలు మరో సెట్ నామినేషన్లు దాఖలు చేయగా, బీజేపీ అభ్యర్థి వినయ్‌కుమార్ మూడు సెట్లు వేశారు. అలాగే బీఎస్‌పీ అభ్యర్థిగా కే.సుధాకర్, బీఎల్‌ఎఫ్ అభ్యర్థిగా పీ.వెంకటేశ్, అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా చరణ్‌కుమార్, స్వతంత్ర అభ్యర్థులుగా సుంకె శ్రీనివాస్, మాస్త దయానంద్, మదావత్ మీరాబాయిలు నామినేషన్‌లు దాఖలు చేశారు. బోధన్ నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి శకీల్ ఆమిర్ రెండు సెట్లు, కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి రెండు సెట్లు, సమాజ్‌వాది పార్టీ తరఫున ఎం.డీ.యూసుఫ్, బీఎల్‌ఎఫ్ అభ్యర్థిగా బీ.జీవన్, బీజేపీ అభ్యర్థులుగా సుభాష్, అల్జాపూర్ శ్రీనివాస్, అడ్లూరి శ్రీనివాస్, గడ్డం విక్రంరెడ్డిలు నామినేషన్‌లు దాఖలు చేశారు. వీరితో పాటు ఇదే సెగ్మెంట్ నుండి బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా పాండు, శివసేన అభ్యర్థిగా గోపీకిషన్, మజ్లిస్ బచావో తెహ్‌రిక్ అభ్యర్థిగా ఎండీ.నవాజ్‌పాషా, స్వతంత్ర అభ్యర్థులుగా షర్జీల్ పర్వేజ్, మహ్మద్ ఆజం, జీ.విక్రంరెడ్డిలు నామినేషన్లు దాఖలు చేశారు. బాన్సువాడ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి కాసుల బాల్‌రాజ్, స్వతంత్ర అభ్యర్థిగా పోచారం తనయుడు పీ.సురేందర్న్రెడ్డి, బీజేపీ అభ్యర్థులుగా నాయుడు ప్రకాశ్, పీ.సంగారెడ్డి, తెరాస అభ్యర్థిగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బీఎల్‌ఎఫ్ అభ్యర్థి వీ.పుల్లయ్య, స్వతంత్ర అభ్యర్థిగా ఎం.రమేష్‌లు నామినేషన్లు సమర్పించారు. వీరిలో ఎంతమంది బరిలో నిలుస్తారు, ఎంతమంది వైదొలగనున్నారన్నది నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసే నాటికి తేటతెల్లం కానుంది. పెద్ద సంఖ్యలోనే స్వతంత్ర అభ్యర్థులు పోటీకి సిద్ధపడడంతో తమ ఖాతాలోకి చేరాల్సిన ఓట్లకు ఎక్కడ గండిపడుతుందోనని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. గడువు లోపు వారిచే నామినేషన్లను ఉపసంహరింపజేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేయనున్నారు. దాఖలైన నామినేషన్లను మంగళవారం స్క్రుటినీ జరిపిన అనంతరం ఈ నెల 22 తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. అనంతరం బరిలో ఉండే అభ్యర్థుల జాబితా వెలువడనుంది. చివరి రోజున నామినేషన్ల పర్వం హోరెత్తే అవకాశం ఉందని ముందుగానే ఊహించిన పోలీసు యంత్రాంగం రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. 100మీటర్ల దూరంలో బారికెడ్లను ఏర్పాటు చేసి పోలీసు బలగాలను మోహరించారు. అభ్యర్థి వెంట పరిమితికి లోబడి నలుగురిని మాత్రమే లోనికి అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నామినేషన్ల దాఖలు పర్వం ముగియడంతో ఎన్నికల్లో ఒక అంకం పూర్తయ్యిందని అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఎన్నికల్లో తలపడేందుకు పెద్ద సంఖ్యలోనే స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్‌లు దాఖలు చేసినప్పటికీ, ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్, పలు చోట్ల బీజేపీ పార్టీలకు చెందిన అభ్యర్థుల మధ్యే పోటీ కొనసాగనుంది.