నిజామాబాద్

ఊపందుకున్న ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, నవంబర్ 19: శాసనసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు పర్వం ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. డిసెంబర్ 7న పోలింగ్ జరుగనుండగా, ఈ.సీ నిబంధనల మేరకు 48గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉండడంతో మిగిలి ఉన్న సమయాన్ని ఏమాత్రం వృథా చేయకుండా ప్రచార పర్వంలో బిజీగా మారారు. పోలింగ్‌కు చివరి సమయంలో ఓటర్లతో ఎంత మమేకమైతే, అంతగా వారి మద్దతును కూడగట్టుకోవచ్చన్న ఉద్దేశ్యంతో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ తదితర పార్టీల అభ్యర్థులు క్షణం తీరిక లేకుండా సుడిగాలి పర్యటన జరుపుతున్నారు. అభ్యర్థులకు మద్దతుగా ఆయా పార్టీల నాయకులు సైతం విస్తృతంగా పర్యటిస్తున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతుగా భారీ మెజార్టీని అందించాలనే లక్ష్యంతో ఆ పార్టీ నాయకత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటికే ఆపద్ధర్మ మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్ తదితరులు జిల్లాలో ప్రచార సభల్లో పాల్గొన్నారు. శాసనసభను రద్దు చేసిన అనంతరం మలివిడత ప్రచారాన్ని సైతం కేసీఆర్ నిజామాబాద్ నుండే మొదలుపెట్టారు. తాజాగా ఆయన నియోజకవర్గాల వారీగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో మంగళవారం ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో ప్రచారానికి హాజరవుతున్నారు. 22వ తేదీన ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో ప్రచార సభకు మరోమారు కేసీఆర్ హాజరుకానున్నారు. తెరాస అధినేత కేసీఆర్ హాజరవుతున్న ఈ సభలకు భారీగా జన సమీకరణ జరిపేందుకు కసరత్తులు కొనసాగిస్తున్నారు. పార్టీ పరంగా ఓవైపు ప్రచారం ఊపందుకోగా, అధినేత ప్రచారంతో క్యాడర్‌లో మరింత జోష్ వస్తుందని తెరాస అభ్యర్థులు ఆశిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఇప్పటికే కామారెడ్డిలో రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించగా, టీ.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్, కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తదితరులు కూడా ఆయా సెగ్మెంట్లలో అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి కూడా కామారెడ్డి నియోజకవర్గం పరిధిలో ప్రచారంలో పాల్గొనేలా రూట్‌మ్యాప్ రూపొందించారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ అగ్రనేతలను ఆహ్వానిస్తున్నారు. ఇలా అన్ని ప్రధాన రాజకీయ పక్షాల ముఖ్య నేతలు ప్రచార సభలతో ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. అభ్యర్థులు తమకు పట్టు ఉన్న ప్రాంతాలతో పాటు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు చేసిన గ్రామాల్లో సైతం పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. ఇదిలాఉండగా, అభ్యర్థులు ఓ వైపు ప్రచారంలో తలమునకలవుతూనే, మరోపక్క ఓటర్లకు గాలం వేసేందుకు బేరసారాలను ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఓ ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థులకు ఇటీవలే పెద్దఎత్తున ఎన్నికల ఖర్చుల నిమిత్తం పార్టీ ఫండ్ చేతికందడంతో, కుల సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాల ప్రతినిధులను కలిసి పంపకాలను పదునెక్కించినట్టు ప్రచారం జరుగుతోంది. సాధ్యమైనంత వరకు పరిస్థితిని అనుకూలంగా మల్చుకోవాలనే తాపత్రయంతో ప్రలోభాల పర్వానికి దిగి ఓటర్లకు ఎర వేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థులు కూడా గెలుపుపై ఎనలేని ధీమాతో, ఓటర్ల మద్దతు కోల్పోకుండా ఉండేందుకు కొద్దోగొప్పో పంపకాలతో సంతృప్తిపర్చడంలో నిమగ్నమైనట్టు సమాచారం. వచ్చే నెల 5వ తేదీ నాటితో ప్రచార పర్వానికి తెరపడనుండగా, పోలింగ్ వరకు కూడా ఈ పంపకాల పర్వం కొనసాగుతూ అంతకంతకూ పదునెక్కనుంది. డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు గురి చేయకుండా ప్రత్యేకంగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినప్పటికీ, అభ్యర్థులు పెద్దమొత్తంలో పైకాన్ని సమకూర్చుకుని జోరుగా పంపకాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.