నిజామాబాద్

ఐదేళ్లలో అద్భుతాలు చేసి చూపుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, నవంబర్ 20: ప్రస్తుత ఎన్నికల్లో ప్రజలు మరోమారు ఆశీర్వదించి అధికారంలోకి తెస్తే, వచ్చే ఐదేళ్లలో తమ ప్రభుత్వం అద్భుతాలు చేసి చూపుతుందని రాష్ట్ర ఆపద్ధర్మ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్ తరాల కోసం పని చేసే వారినే ఎన్నుకోవాలని, ఈ దిశగా ఇప్పటికే తన నాలుగున్నరేళ్ల పాలనలో తెరాస అంకితభావంతో ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర ప్రగతి కోసం పని చేస్తూ చిత్తశుద్ధిని చాటుకుందన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించేందుకు అనునిత్యం దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల నుండి ప్రతినిధుల బృందాలు తెలంగాణను సందర్శిస్తున్నాయంటే స్థానికంగా తమ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కార్యక్రమాలు ఎంత గొప్పవో ఊహించుకోవచ్చని అన్నారు. మంగళవారం ఆయన కోటగిరి మండలం సుంకిని, కొల్లూర్, రాంగంగానగర్, సోంపూర్ గ్రామాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ, భవిష్యత్తులో తెలంగాణ మరింతగా అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికీ చేరాలన్నా తెరాసను మళ్లీ అధికారంలోకి తేవడం అత్యావశ్యకమని పిలుపునిచ్చారు. దేశానికి అన్నం పెట్టే రైతులు సంక్షోభంలో కూరుకుపోవడాన్ని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్, వారి బాధలను దూరం చేస్తూ వ్యవసాయ రంగాన్ని పండుగలా మార్చేందుకు రైతుబంధు పథకాన్ని అమల్లోకి తెచ్చారని, ఎకరానికి 8వేల రూపాయల పెట్టుబడిని అందిస్తున్నారని, దానిని 10వేల రూపాయలకు పెంచనున్నారని తెలిపారు. 24గంటల ఉచిత విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చారని, ప్రాజెక్టుల నిర్మాణాలకు లక్షన్నర కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నారని వివరించారు. కులవృత్తుల వారిని ప్రోత్సహించడంలో భాగంగా యాదవులకు 75శాతం సబ్సిడీతో గొర్రెలను అందిస్తున్నామని, మత్స్యకారులకు వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలను చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో పెంచుతున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు స్వయం ఉపాధి కోసం సబ్సిడీతో కూడిన రుణాలను విరివిగా అందిస్తున్నామని గుర్తు చేశారు. అర్హులైన వారందరికీ అన్ని వసతులతో కూడిన డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తున్నామని, ఇవి ఒక్కోటి కాంగ్రెస్ హయాంలో అందించిన ఏడు ఇందిరమ్మ ఇళ్లతో సమానమని పేర్కొన్నారు. కాంగ్రెస్, తెదేపాలు సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం మహాకూటమిగా జత కట్టాయని ఆక్షేపించారు. ఈ కూటమిని కనుమరుగు చేస్తూ, తెరాసకు పట్టం కట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

సీఎంకు విద్యార్థిని విరాళం
ఎల్లారెడ్డి, నవంబర్ 20: త్వరలోజరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, గిరిజన విద్యార్థిని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌కు, ఎన్నికల ప్రచార నిమిత్తం నగదు విరాళాన్ని అందించింది. మంగళవారం ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని స్థానిక సాయినగర్ వెంచర్‌లోగల ఖాళీస్థలంలోనిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ప్రసంగం ముగియగానే, స్థానిక టీఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగురవీందర్‌రెడ్డి కేసీఆర్ వద్ద గిరిజన విద్యార్థిని పిలిపించారు. గాంధారి మండలం చద్మల్ గ్రామానికి చెందిన 7వ తరగతి చదువుతున్న మంజ గీర్వాణి, తాను పోగుచేసుకున్న స్వంత డబ్బులను 11,116రూపాయలను, ఆమె చేతుల మీదుగా ఎన్నికల ప్రచారం నిమిత్తం ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌కు అందజేశారు. అనంతరం విద్యార్థినిని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ అభినందించి ఆశీర్వదించారు.