నిజామాబాద్

ప్రశాంతంగా ముగిసిన ఎంసెట్-2016

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, మే 15: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి సారిగా నిర్వహించిన ఎంసెట్ ప్రవేశ పరీక్ష సందర్భంగా కలెక్టర్ యోగితారాణా పరీక్షా కేంద్రాల్లో పర్యటించి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల్లో ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులకు ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించగా, కలెక్టర్ డాక్టర్ యోగితారాణా నగరంలోని పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షా తీరును పర్యవేక్షించారు. ఉదయం జరిగిన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు 7371అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 20పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఆదివారం ఉదయం నిర్వహించిన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు 7,055మంది హాజరు కాగా, 316మంది గైర్హాజర్ అయ్యారు. అదే విధంగా మధ్యాహ్నం నిర్వహించిన మెడిసిన్ కోర్సుకు 3965మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 3,718 పరీక్షలకు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. అంతకు ముందు నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల బయట సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో మజ్జిగ, తాగునీటి కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించి పంపిణీ చేశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ యాదిరెడ్డి, డిఎస్పీ ఆనంద్‌కుమార్, ఎస్‌హెచ్‌ఓ యాదయ్య తదితరులు ఉన్నారు. ఎంసెట్ ప్రవేశ పరీక్ష ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.