నిజామాబాద్

పలువురి నామినేషన్ల తిరస్కృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, నవంబర్ 20: జిల్లాలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల నుండి ఎన్నికల్లో పోటీ చేసేందుకు దాఖలైన నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు మంగళవారం పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా లేని వాటిని తిరస్కరించారు. బాల్కొండ, నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్లలో దాఖలైన అన్ని నామినేషన్లు చెల్లుబాటు కాగా, మిగతా నాలుగు సెగ్మెంట్లు బోధన్, ఆర్మూర్, బాన్సువాడ, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాల పరిధిలో వివిధ కారణాల వల్ల పలువురి నామినేషన్లను తిరస్కరించారు. ప్రధాన పార్టీల తరఫున అభ్యర్థులుగా నామినేషన్లు వేసినప్పటికీ నిర్ణీత గడువులోపు బీ.్ఫం సమర్పించకపోవడం, అభ్యర్థులను 10మంది ప్రతిపాదించాల్సి ఉండగా, తగిన సంఖ్యలో ప్రతిపాదితులు లేకపోవడం, ఒకవేళ ఉన్నా ఇతర నియోజకవర్గాల్లో ఓటు హక్కు కలిగి ఉండడం వంటి కారణాలతో పలువురి నామినేషన్లు తిరస్కరించామని రిటర్నింగ్ అధికారులు వెల్లడించారు. బాన్సువాడ నియోకవర్గానికి సంబంధించి రోహిత్, మల్యాద్రి, శ్రీనివాస్‌గౌడ్, బీ.సాయిలు, పీ.సంగారెడ్డిలు ప్రధాన పార్టీల అభ్యర్థులుగా నామినేషన్‌లు దాఖలు చేసినప్పటికీ, బీ.్ఫంలు అందించకపోవడంతో వారి నామపత్రాలను తిరస్కరించారు. అదేవిధంగా ఇదే నియోజకవర్గానికి చెందిన పుల్లయ్య నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది. బోధన్ అసెంబ్లీ నియోజకవర్గంలో అడ్లూరి శ్రీనివాస్, జీ.విక్రంరెడ్డి, సుభాష్‌లు ముగ్గురూ భారతీయ జనతా పార్టీ తరఫున నామినేషన్లు వేసినప్పటికీ, వీరు బీ.్ఫంలు అందించకపోవడంతో వారి పేర్లను తిరస్కరణ జాబితాలో చేరారు. ఆర్మూర్ నియోజకవర్గంలో బీఎల్‌ఎఫ్ అభ్యర్థిగా పల్లపు వెంకటేశ్ వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. పది మంది ప్రతిపాదకుల్లో ఒకరు ఆర్మూర్‌కు బదులుగా మరో సెగ్మెంట్ పరిధిలో ఓటు హక్కు కలిగి ఉండడంతో అతని నామినేషన్‌ను తిరస్కరించారు. కాగా, ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా 33మంది అభ్యర్థులు, 55నామినేషన్లను దాఖలు చేసిన నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్ నామపత్రాల పరిశీలన ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. భారీగా నామినేషన్లు రావడంతో ఒక్కో దానిని సమగ్రంగా పరిశీలన జరపడంతో ఎనలేని జాప్యం జరిగింది. ఈ సెగ్మెంట్‌లో ఆరుగురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. ఓటర్ల జాబితాలో పేరు లేకపోవడంతో ఆర్.చక్రధర్ నామినేషన్‌ను తిరస్కరించగా, బదావత్ మీరాబాయి, నాయుడు ప్రకాశ్, జైద్‌బిన్ తాహెర్, మహ్మద్ వాజిద్‌అలీ, శేక్ అతీక్‌ల నామినేషన్లు కూడా వివిధ కారణాల వల్ల తిరస్కరణకు గురయ్యాయి. పరిశీలన ప్రక్రియ అనంతరం బరిలో మిగిలిన అభ్యర్థుల్లో ఎంతమంది తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటారు, ఎంతమంది తుది పోరులో నిలుస్తారన్నది 22వ తేదీ నాటి ఉపసంహరణ గడువు ముగిసిన మీదట తేటతెల్లం కానుంది.

మహిళలు హక్కులు తెలుసుకొని ముందుకెళ్లాలి
- కలెక్టర్ ఎంఆర్‌ఎం.రావు
కంఠేశ్వర్, నవంబర్ 20: ప్రభుత్వాలు వర్తింపచేసిన హక్కులను తెలుసుకుని అందుకు అనుగుణంగా మహిళలు, బాలికలు అభివృద్ధి పథంలో పయనించాలని కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు హితవు పలికారు. మంగళవారం నగరంలోని న్యూ అంబేడ్కర్ భవన్‌లో స్నేహా సొసైటీ, సఖీ, జిల్లా స్ర్తిశిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్ర్తి అంటే శక్తి స్వరూపిని అంటుంటారని, తన శక్తిని తెలుసుకుని తద్వారా తన కుటుంబానికి, సమాజ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా బాలికలకు జీవించే, అభివృద్ధి చెందే, రక్షణ పొందే, పాల్గొనే హక్కులు కల్పించడం జరిగిందని, వీటిపై అందరికి అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. మహిళలు, బాలికలు తమ హక్కుల గురించి పూర్తిగ తెలుసుకొని భవిష్యత్తులో ఏవిదంగా ముందుకు వెళ్లాలో ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. విద్యా, ఉద్యోగ పరంగా, క్రీడలు, ఇతర రంగాలలో అమ్మాయిలు ఇప్పటికే చాలా విషయాల్లో ముందంజలో ఉన్నారని అన్నారు. అన్ని రంగాల్లోను పురుషులతో సమానంగా మరింత ముందుకు వెళ్లాలని మహిళలకు, బాలికలకు సూచించారు. నిజామాబాద్ జిల్లాలో పురుషుల కంటే మహిళల నిష్పత్తే అధికంగా ఉండడం ఒక అదృష్టంగా భావించాలన్నారు. మహిళలు, బాలికలపై వివక్ష లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అదేవిధంగా మహిళల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుని అవసరమైన సదుపాయాలు సమకూర్చవలసిన అవసరం ఉందన్నారు. స్నేహాసొసైటీ నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని, వీరి స్ఫూర్తిని ఇతరులు కూడా అలవర్చుకుని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. డిసెంబర్ 7న జరిగే సాధారణ ఎన్నికల్లో దివ్యాంగులు ఓటు వేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరు ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం బాలబాలికల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ స్రవంతి, స్నేహాసొసైటీ కార్యదర్శి సిద్ధయ్య, ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ కవితారెడ్డి, బోర్గాం పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్రా రామారావు, స్నేహాసొసైటీ ప్రిన్సిపాల్ జ్యోతి, విద్యార్థులు పాల్గొన్నారు.