నిజామాబాద్

పోడు భూములకు పట్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డి, నవంబర్ 20: మళ్లీ తాము అధికారంలో వచ్చిన వెంటనే గిరిజనుల పోడు భూములకు పట్టాలిస్తామని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజక వర్గ కేంద్రానికి ఎన్నికల ప్రచారం నిమిత్తం సాయంత్రం 4.39 నిముషాలకు హెలికాప్టర్‌లో ఎల్లారెడ్డిలో బస్‌డిపోకు కేటాయించిన స్థలంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద దిగారు. అక్కడి నుండి దాదాపు అరకిలోమీటర్ దూరంలో ఉన్న సాయినగర్ వెంచర్‌లో ఏర్పాటు చేసిన సభా స్థలికి సీఎం వాహనంలో 11 నిమిషాల్లో చేరారు. సభా స్థలికి రాగానే హెలిక్యాప్టర్‌లో వెళ్లేందుకు సమయం సరిపోదు కాబట్టి త్వరగా తన సందేశాన్ని అందిస్తానంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తమ ప్రభుత్వం హయాంలోనే గిరిజనులకు న్యాయం చేశామని అన్నారు. తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన భూప్రక్షాళన సర్వేలో భాగంగా పార్ట్‌‘బి’లో ఉన్న గిరిజనుల పోడు భూములకు తమ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే పట్టాలు ఇస్తామని అన్నారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. గిరిజనులకు కాంగ్రెస్ పాలనలో అన్యాయం జరిగిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాల భూమికి సాగునీరు అందించే ప్రణాళిక రూపొందించామని అన్నారు. ఇంకో 25రోజుల్లో ఇంటింటికి భగీరథ నీరు అందించనున్నామని అన్నారు. తిరిగి తమ ప్రభుత్వమే అధికారంలో వస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతో మెరుగుపడ్డాయని, ఇప్పుడు క్లబ్‌లు, పేకాటలు లేవని, పోలీసుల పనితీరు ఎంతో బేషుగ్గా ఉందని అన్నారు. దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందన్నారు. ఎల్లారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్‌లోని ధర్మారావుపేట్, మోతే, గుజ్జల్ వద్ద 22కోట్ల రూపాయలు వెచ్చించి డ్యాంలు నిర్మించి, మూడు వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని అన్నారు. ఎల్లారెడ్డి సెగ్మెంట్‌కు 10టీఎంసీల నీరు అందనున్నాయని అన్నారు. రైతులకు 24గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ అందిస్తున్నామని అన్నారు. ఎల్లారెడ్డి సెగ్మెంట్‌లో ఏనుగు రవీందర్‌రెడ్డి ఎమ్మెల్యే విద్యుత్ సమస్య లేకుండా అనేక విద్యుత్ సబ్‌స్టేషన్‌లు మంజూరు చేయించుకుని సెగ్మెంట్‌లో ఎలాంటి విద్యుత్ సమస్య లేకుండా చూసుకున్నారని అన్నారు. ఇక తాము మళ్లీ అధికారంలో వచ్చిన వెంటనే అన్ని రకాల పింఛన్‌లను పెంచడం జరుగుతోందని అన్నారు. నిరుద్యోగులకు 3 వేల రూపాయల నిరుద్యోగ భృతిని అందిస్తామని అన్నారు. రైతు బందు పథకం కింద ఎకరానికి నాల్గు వేలను 5వేలకు పెంచడం జరుగుతోందని అన్నారు. మిషన్‌కాకతీయ పథకం కింద ఎల్లారెడ్డి సెగ్మెంట్‌లో అత్యధిక చెరువులు మరమ్మతులు చేయించుకున్న ఘనత రవీందర్‌రెడ్డికి దక్కిందన్నారు.

కేసీఆర్‌ను ఎందుకు గద్దె దించాలో మహాకూటమిని ప్రశ్నించాలి: ఎంపీ కవిత
డిచ్‌పల్లి, నవంబర్ 20: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎందుకు గద్దె దించాలో మహాకూటమి నేతలను ప్రశ్నించాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రజలకు సూచించారు. తెలంగాణ ప్రజల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను దేశమంతా ప్రశంసిస్తుంటే, దానిని చూసి జీర్ణించుకోలేకపోతున్న మహాకూటమి నేతలు అవాకులు, చెవాకులు పేలుతున్నారని ఆమె దుయ్యబట్టారు. మంగళవారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం దర్పల్లి మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్‌కు మద్దతుగా జరిగిన రోడ్‌షోలో ఎంపీ కవిత పాల్గొని ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఆనాడు తెలంగాణ ఏర్పాటుకు అడ్డంకిగా నిలిచిన వాళ్లే ఇప్పుడు కెసీఆర్‌ను గద్దె దించాలనుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ రాక ముందు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి ఉండేదని, పేద ఇంటి మహిళ గర్భవతి అయితే ఇల్లు గడవని దుస్థితిలో కుటుంబీకులు మనోవేదనకు గురయ్యేవారని అన్నారు. దీనిని గమనించిన కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత కాన్పులు చేయిస్తూ, 12వేల రూపాయలను అందజేస్తున్నారని, కేసీఆర్ కిట్‌ను కూడా ప్రభుత్వ కానుకగా అందిస్తున్నారని తెలిపారు. ఇలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నందుకా కేసీఆర్‌ను గద్దె దించాలి? అని ఆమె మహాకూటమి నేతలను ప్రశ్నించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఇదివరకు తెలుగుదేశం పార్టీ తరఫున మండవ వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిలోనూ కొనసాగినప్పటికీ సెగ్మెంట్‌ను అభివృద్ధి చేయలేకపోయారని అన్నారు. ప్రచార కార్యక్రమంలో తెరాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.