నిజామాబాద్

పోలీసు బందోబస్తు నడుమ బ్లాక్ డే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 6: బాబ్రీ మసీదు కూల్చివేతకు గురైన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లాలో పలు ముస్లిం సంఘాలు చేపట్టిన బ్లాక్ డే ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జిల్లా వ్యాప్తంగా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అసలే ఎన్నికలు కొనసాగుతూ, పోలింగ్‌కు ఒక్క రోజు గడువు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో బ్లాక్ డే రావడంతో పోలీసు అధికారులంతా భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. సమస్యాత్మక ప్రాంతాలలో ముందుగానే ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించరాదని, సామరస్యతను కాపాడాలని పోలీసులు ప్రజలకు సూచించారు. కాగా, బ్లాక్ డే సందర్భంగా జిల్లా కేంద్రంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మైనార్టీ నాయకులతో పాటు ముస్లిం మత పెద్దలు వేర్వేరుగా కలెక్టరేట్‌కు తరలివచ్చి డీఆర్‌ఓ అంజయ్యకు వినతిపత్రాలు అందజేశారు. డిప్యూటీ మేయర్ ఎంఏ.్ఫహీమ్ నేతృత్వంలో ఎంఐఎం కార్పొరేటర్లు, నాయకులు నల్ల రిబ్బన్లు ధరించి కలెక్టరేట్ తరలివచ్చి వినతిపత్రం అందజేశారు. తెరాస మైనార్టీ సెల్ నాయకులు నవీద్‌ఇక్బాల్, తారిక్ అన్సారీ తదితరులు సైతం కలెక్టరేట్‌కు చేరుకుని మెమోరాండం సమర్పించగా, ముస్లిం పర్సనల్ లా ప్రతినిధులు, సీనియర్ సిటిజన్ ఫోరం బాధ్యులు డీఆర్‌ఓను కలిసి విజ్ఞాపనలు అందజేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనతో కోట్లాది మంది ముస్లిం మైనార్టీల మనోభావాలు దెబ్బతిన్నాయని ముస్లిం పెద్దలు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ మతోన్మాద శక్తులు అనేక చోట్ల ముస్లిం మైనార్టీలపై దాడులకు తెగబడుతూ, వివక్షకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కూల్చివేతకు గురైన చోటే బాబ్రీ మసీదును పునర్ నిర్మించాలని డిమాండ్ చేశారు. కాగా, బ్లాక్ డేను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ముస్లిం మైనార్టీ వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. అహ్మదీబజార్, నెహ్రూపార్క్, గాంధీచౌక్, బడాబజార్, అర్సపల్లి, మాలపల్లి, ఖిల్లా తదితర ప్రాంతాల్లో వ్యాపార సముదాయాలను మూసి ఉంచి నిరసన చాటారు. కూరగాయల దుకాణాలు, మటన్ మార్కెట్‌లు కూడా బంద్ ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన నిఘా కొనసాగించారు. జిల్లా కేంద్రంతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో ముమ్మరంగా పెట్రోలింగ్ జరిపారు.