నిజామాబాద్

పోలింగ్ స్టేషన్లకు తరలిన ఎన్నికల సిబ్బంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిపేట్, డిసెంబర్ 5: నందిపేట మండలంలో నిర్వహించే అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ సామాగ్రితో పాటు ఎన్నికల సిబ్బంది ఆయా గ్రామాలకు గురువారం సాయంత్రం చేరుకున్నట్లు ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి అలివేలు తెలిపారు. ప్రతి బూత్‌లో పోలింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్, ఇద్దరు క్లర్క్‌లు, వీవీప్యాట్, ఈవీఎం, పోలీసుల రక్షణలో ఆయా గ్రామాలకు చేరవేయడం జరిగిందని ఆమె తెలిపారు. నందిపేట మండలంలో మొత్తం 63 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. మండలంలో 51వేల 368 మంది ఓటర్లు ఉన్నారని గ్రామాల వారీగా ఓటర్ల సంఖ్య తెలిపారు. కుద్వాన్‌పూర్‌లో 2682 ఓటర్లు, శాపూర్ 1063 ఓటర్లు, దత్తాపూర్ 1091 ఓటర్లు, వనె్నల్ (కె) 1799 ఓటర్లు, సిద్ధాపూర్ 1111 ఓటర్లు, తొండాకూర్ 934 ఓటర్లు, మారంపల్లి 1645 ఓటర్లు, గంగాసముందర్ 613 ఓటర్లు, నూత్‌పల్లి 2105 ఓటర్లు, గాదేపల్లి 770 ఓటర్లు, నడ్కుడ 1284 ఓటర్లు, సిర్‌పూర్ 875 ఓటర్లు, అన్నారం 875 ఓటర్లు, డొంకేశ్వర్ 2863 ఓటర్లు, నికాల్‌పూర్ 1415 ఓటర్లు, కోమట్‌పల్లి 409 ఓటర్లు, బాద్గుణ 1395 ఓటర్లు, మాయాపూర్ 466 ఓటర్లు, ఉమ్మెడ 1433 ఓటర్లు, సీహెచ్.కొండూర్ 1821 ఓటర్లు, బజార్ కొత్తూర్ 929 ఓటర్లు, లక్కంపల్లి 819 ఓటర్లు, తల్వెద 2674 ఓటర్లు, చింరాజ్‌పల్లి 1030 ఓటర్లు, కంఠం 1647 ఓటర్లు, మల్లారం 357 ఓటర్లు, ఐలాపూర్ 2207 ఓటర్లు, నందిపేట్ 8275 ఓటర్లు, వెల్మల్ 4084 ఓటర్లు, ఆంధ్రనగర్ 1791 ఓటర్లు, కౌల్‌పూర్ 806 ఓటర్లు ఉన్నారని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి అలివేలు తెలిపారు.