నిజామాబాద్

ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, డిసెంబర్ 9: యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ జన్మదినోత్సవాన్ని ఆదివారం నగరంలోని కాంగ్రెస్ భవన్‌లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ ఇన్‌చార్జ్ అధ్యక్షుడు కేశ వేణు మాట్లాడుతూ, యుపీఏ హాయంలో చైర్‌పర్సన్‌గా ఉన్న సోనియాగాంధీ పేదల సంక్షేమానికి కృషి చేశారని, అనేక సంస్కరణలు చేపట్టి దేశ అభివృద్ధికి పాటుపడటం జరిగిందన్నారు. తనకు దేశ ప్రధాని కావడానికి రెండుసార్లు అవకాశం వచ్చిన ప్రధాని పదవిని త్యాగం చేసి, ఆర్థిక సంస్కరణలు తెలిసిన మన్‌మోహన్‌సింగ్‌కు ప్రధాని పదవిని కట్టబెట్టి తన ఔన్యత్యాన్ని చాటుకున్నారని ఆయన కొనియాడారు. ప్రతి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు యుపిఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఆశయాలకు అనుగుణంగా పయనించాలని, 2019లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడైన రాహుల్ గాంధీని ప్రధాని పదవిలో కూర్చోబెట్టాల్సిన అవసరం ఉన్నదని, ఈ దిశగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. మూడు రోజుల క్రితం తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ప్రజాఫ్రంట్ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అర్బన్ అభ్యర్థిగా పోటీ చేసిన తాహెర్‌బిన్ హందాన్ మాట్లాడుతూ, యుపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఆశయ సాధనకోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకుడు కృషి చేయాలన్నారు. డిసెంబర్ 11న వెలువడనున్న తెలంగాణ అసెంబ్లీ ఫలితాల్లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ విజయదుందుభి మోగిస్తుందన్నారు. అనంతరం ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యుఐ నాయకులు పంచరెడ్డి చరణ్, విపుల్‌గౌడ్, మాజీ జడ్పీటీసీ బుజ్జి, సుమన్, తంబాకు చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.