నిజామాబాద్

రిజర్వేషన్ల వైపు ఆశావహుల చూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, డిసెంబర్ 14: గ్రామాల్లో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల పదవుల పందేరంపై ఆశావాహులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ప్రభుత్వం ప్రకటించనున్న రిజర్వేషన్ల వైపే అందరు ఆశగా చూస్తున్నారు. ప్రతీ గ్రామంలో ఒక్కో పదవికి ఆశావాహుల సంఖ్య రెండంకెల కంటే ఎక్కువగానే ఉంది. అయితే ఏ పదవికి ఏ రిజర్వేషన్ వర్తిస్తుందో అంచనా వేయలేక ఆశావాహులంతా సతమతమవుతున్నారు. నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీలతో గతంలో వలే ఈసారి ఈ గ్రామ పంచాయతీకి ఈ రిజర్వేషన్ వర్తిస్తుందని ఇదమిద్దంగా చెప్పలేని పరిస్థితి. దీంతో క్రియాశీలక పదవులపై అంచనాలు పెట్టుకున్న ద్వితీయ శ్రేణి నేతలు ఎవరికి వారు, వారికి అనుకూలంగా ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో అధికార పార్టీకి భారీగానే వలసలు జరిగాయి. కాంగ్రెస్‌తో పాటు వివిధ పార్టీల క్రియాశీలక నేతలు తెరాసలోకి మారిపోయారు. స్థానిక పదవులపై దృష్టి సారించిన నేతలు ఈ ఎన్నికల్లో గట్టిగానే పని చేశారని చెప్పవచ్చు. ఎదుటి పార్టీల్లో ఉన్న క్రియాశీలక నేతలను తెరాసకు మరల్చడంతో అలాంటి నేతలు ప్రముఖ పాత్ర పోషించారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జనవరిలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో సర్పంచ్‌ల పదవులపై పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య భారీగానే ఉంది. బాల్కొండ నియోజకవర్గంలో 25నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. పాతవి 88కలుపుకొని వీటి సంఖ్య 113కు చేరింది. అయితే భీమ్‌గల్ మున్సిపాలిటీగా మారడంతో ప్రస్తుతం దానిని గ్రామ పంచాయతీ జాబితా నుండి తొలగించారు. నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడకముందు రిజర్వేషన్ల కేటాయింపు ఎలా ఉంటుందో ముందుగానే ఊహించే అవకాశం ఉండేది. గడిచిన నాలుగు పర్యాయాలుగా వచ్చిన రిజర్వేషన్లను బేరీజు వేసుకుని, త్వరలో జరుగనున్న రిజర్వేషన్ల కేటాయింపుల్లో తమ గ్రామానికి ఈ రిజర్వేషన్ వస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చేది. అయితే నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుతో ప్రస్తుతం అన్ని గ్రామ పంచాయతీలకు నూతన రిజర్వేషన్ విధానానే్న పాటించాల్సి ఉంటుందన్నది అధికారవర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే ఏ గ్రామ సర్పంచ్ పదవికి, ఏ రిజర్వేషన్ వర్తిస్తుందో చెప్పలేకపోతున్నారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ అనే తేడా లేకుండా అన్ని గ్రామ పంచాయతీల్లోనూ ఆశావాహులు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వారికి అనుకూలంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరిని పలుకరించినా సర్పంచ్ స్థానానికి అభ్యర్థిగానే మాట్లాడుతు చర్చలు జరుపుతున్నారు. వార్డు సభ్యుల స్థానానికి అంతగా పోటీ లేకపోయినప్పటికీ, ఉప సర్పంచ్, సర్పంచ్ పదవులపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. సర్పంచ్‌ల పదవుల రిజర్వేషన్ స్థానాన్ని బట్టి ఆ తర్వాత జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీలపై ఒక నిర్ధారణకు రావచ్చని భావిస్తున్న పలువురు నేతలు, ప్రభుత్వం ప్రకటించనున్న రిజర్వేషన్ల వైపే ఆశగా చూస్తున్నారు. ఇప్పటికే బీసీ గణనకు సంబంధించి ప్రభుత్వం గ్రామసభలు నిర్వహిస్తోంది. అది పూర్తయితే గానీ, రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం లేదన్నది అధికారవర్గాల సమాచారం. ఏదీ ఏమైనప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల హడావుడి కంటే గ్రామాల్లో క్రియాశీలక పదవులపై కనే్నసిన ద్వితీయ శ్రేణి నేతల హంగామానే ఎక్కువగా కనిపిస్తోంది.

అభయాంజనేయస్వామి ఆలయంలో
ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ ప్రత్యేక పూజలు
నిజాంసాగర్, డిసెంబర్ 14: నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణ్‌పల్లి గ్రామ గేటు వద్ద గల శ్రీ అభయాంజనేయస్వామి సహిత శివపంచాయతన విగ్రహ ప్రథమ వార్షికోత్సవ వేడుకలకు శుక్రవారం ఉమ్మడి జిల్లాల జడ్పీ చైర్మెన్ దాపెదర్ రాజు, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండేలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ప్రథమ వార్షికోత్సవాలలో భాగంగా ధ్వజస్తంభ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అభయాంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, జడ్పీ చైర్మెన్ దఫేదార్ రాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వీరికి ఆలయ ధర్మకర్త పట్లోళ్ల కిషోర్‌కుమార్ శాలువ కప్పి పూలమాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ వినయ్‌కుమార్, సీడీసీ చైర్మెన్ పట్లోళ్ల దుర్గారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ మోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గైని విఠల్ తదితరులు పాల్గొన్నారు.

చిరుత దాడిలో లేగదూడ మృతి
లింగంపేట్, డిసెంబర్ 14: మండలంలోని మోతె గ్రామంలోని పాగల సాయిరాంకు చెందిన లేగదూడను గురువారం రాత్రి చిరుత పులి దాడిలో మృతి చెందిన్నట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.... సాయిరాంకు చెందిన ఆవు గ్రామ సమీపంలోని పోలం వద్ద కోట్టంతో ఉండేది. అయితే గురువారం రాత్రి సాయిరాం పాలు పితుక్కుని ఇంటికి వచ్చాడు. అనంతరం మధ్యలో ఒకసారి ఆవుకు మేత వేయడానికి వెళ్ళాడు, అప్పుడు కూడా లేగదూడ మంచిగానే ఉంది. అలాగే రోజు వారి మాదిరిగా ఉదయం 5 గంటల ప్రాంతంలో పాలు పితకడానికి వెళ్లగా అక్కడా లేగదూడ పేగులు బయటకు వచ్చి చనిపోయి ఉంది. సమాచారం అందుకున్న గ్రామస్తులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. ఆనంతరం కొందరూ అటవీ శాఖ అధికారులు వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించగా అక్కడా చిరుత పులి కాలి గుర్తులు కనిపించాయి. దీంతో చిరుత పులి దాడి చేసి చంపివేసిందని వారు తెలిపారు. ఈసందర్భంగా బాధితులు మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వంలో సబ్సిడి పథకం ద్వారా తనకు 70 వేల ఆవు వచ్చిందన్నారు. అయితే ప్రస్తుతం లేగదూడ 10 వేల రూపాయాలు ఉంటుందని, కానీ లేగదూడ లేకపోవడంతో ఆవు పాలు ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెండు విధాలుగా నష్టపోయనన్నారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరారు. ఆయితే ఈ సంఘటనపై పశువైద్యధికారిణి వివరణ కోరగా మోతె గ్రామంలో చిరుతపులి దాడిలో లేగదూడ మరణించడం వాస్తవమేనన్నారు.

హోంమంత్రిని కలిసిన ఎంపీ బీబీ పాటిల్
కామారెడ్డి రూరల్, డిసెంబర్ 14: తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రిగా నూతన పదవీ బాధ్యతలు చేపట్టిన మహామూద్ అలీని శుక్రవారం జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జహీరాబాద్ ఎంపి బీబీ పాటిల్ పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.