నిజామాబాద్

కేటీఆర్ నాయకత్వాన్ని స్వాగతిస్తూ తెరాస శ్రేణుల సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 14: యువనేత కే.తారకరామారావుకు తెరాస రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించడం పట్ల ఆ పార్టీ శ్రేణులు హర్షాతిరేకాలు వెలిబుచ్చుతూ సంబరాలు జరుపుకున్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఏకపక్షంగా విజయాన్ని నమోదు చేసిన జోష్‌లో ఉన్న గులాబీ దండు, కేటీఆర్‌కు కొత్తగా పార్టీ నిర్వహణ బాధ్యతలు కట్టబెట్టడంతో ఎక్కడికక్కడ బాణాసంచా పేలుస్తూ, మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. బాన్సువాడ తదితర చోట్ల కేసీఆర్, కేటీఆర్‌ల చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు జాతీయ రాజకీయాలపై దృష్టిని కేంద్రీకరించనున్న నేపథ్యంలో, రాష్ట్రంలో పార్టీ సారథ్య బాధ్యతలను కేటీఆర్ చక్కబెట్టనున్నారని స్పష్టమవుతోంది. దీంతో తెరాస శ్రేణులు ఆయన నాయకత్వం పట్ల ఎనలేని నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు. కార్యనిర్వాహక అధ్యక్ష పదవికి కేటీఆర్ అన్ని విధాలుగా సమర్ధులని తెరాస జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే కేటీఆర్ జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో పాటు ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తన నాయకత్వ పటిమను నిరూపించుకున్నారని, అన్ని వ్యవహారాలను చక్కబెడుతూ పార్టీ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించే సత్తా తనకు ఉందని చాటుకున్నారని అన్నారు. కేటీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ మరింత ముందుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా, కేటీఆర్‌కు కీలక పదవి దక్కడం పట్ల ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు నాయకుల్లో ఎనలేని హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనతో ఈ ప్రాంత పలువురు ఎమ్మెల్యేలకు మంచి సాన్నిహిత్యం ఉండగా, కేటీఆర్ చొరవతో కీలక పదవులను దక్కించుకునే అవకాశం లభించిందని ఉవ్విళ్లూరుతున్నారు.

ఓటరు లిస్ట్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి
- రాష్ట్ర ఎన్నికల కమిషన్ సెక్రటరీ అశోక్‌కుమార్
కామారెడ్డి, డిసెంబర్ 14: త్వరలో జరుగనున్న గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఓటరు లిస్ట్‌ను సిద్దంగా ఉంచుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సెక్రటరీ అశోక్‌కుమార్ అన్నారు. ఆయన శుక్రవారం జిల్లా పంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, రిటర్నింగ్ అధికారి స్టేజ్ -1, స్టేజ్-2, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు పంచాయితీ ఎన్నికల శిక్షణను ఎన్నిసార్లు ఇచ్చారో వివరాలు ఆడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఓటరు లిస్ట్‌ను పూర్తిగా సిద్దంగా ఉంచుకోవాలని సూచించారు. పంచాయితీ ఎన్నికల ఏర్పాట్లకు కార్యాచరణ రూపోందించాలని ఆదేశించారు. పోలింగ్‌కు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు, పేపర్ సీల్స్, మిగతా సామాగ్రిని సరిపడినంత ఉంచుకోవాలని తెలిపారు. పోలింగ్ సామాగ్రి అందినదో లేదా అని తెలుసుకున్నారు. పోలింగ్ సిబ్బందికి ప్రణాళిక ప్రకారం శిక్షణను ఇవ్వాలని ఆదేశించారు. ఓటర్ల లిస్ట్‌ను ఆప్‌డేట్ చేసుకోవాలని సూచించారు. మండలాల వారిగా పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ఆధికారులను ఆదేశించారు. అభ్యంతరకరమైన ఓట్లను ఎలా నిర్ణయించాలో పోలింగ్ సిబ్బందికి శిక్షణలో వివరించాలని సూచించారు. ఆనంతరం జనహిత హాల్‌లోని బ్యాలెట్ బాక్సులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జేసీ యాదిరెడ్డి, ఇంఛార్జీ డీపీవో సాయన్న, ట్రైనీ డీపీవో జయసుధ, ఎంపీడీవో నాగేశ్వర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ
ఇందూర్, డిసెంబర్ 14: పోలీసు శాఖలో విధులు నిర్వర్తించి అనారోగ్యం, వివిధ కారణాలతో మృతి చెందిన సిబ్బంది కుటుంబాలకు సీపీ కార్తికేయ శుక్రవారం డెత్‌ఫండ్ చెక్కులను అందజేశారు. నవీపేట పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తూ ఆగస్టు 26న డి.చంద్రకాంత్ మృతి చెందగా, ఆయన కుమారుడు డి.అరుణ్‌ముమార్‌కు 1,33,200రూపాయల చెక్కు, ఏఆర్‌పీసీ-670 కమ్యూనికేషన్ నందు విధులు నిర్వర్తిస్తూ హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందిన రవిబాబు సతీమణి శ్రీమతి అమ్మాజీకి 1,32,900రూపాయల చెక్కు, రుద్రూర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తూ అనారోగ్య కారణంగా ఆత్మహత్య చేసుకొని మరణించిన ఎ.గంగాధర్ భార్య లావణ్యకు 1,35,500రూపాయల చెక్కును సీపీ కార్తికేయ చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు అందజేశారు. పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తూ అనుకోకుండా గానీ, ప్రమాదవశాత్తు గానీ మృతి చెందిన కుటుంబాలను ఆదుకునేందుకు వీలుగా ఆ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న సీపీ స్థాయి అధికారి నుండి కానిస్టేబుల్ వరకు సిబ్బంది ఒకరోజు వేతనాన్ని డెత్‌ఫండ్‌కు అందజేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో పై ముగ్గురు మృత్యువాతపడగా, ఆ కుటుంబాలకు డెత్‌ఫండ్ ఆర్థిక సహాయం చెక్కులను అందజేయడం జరిగిందని పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు షకీల్‌పాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో షకీల్‌పాషాతో పాటు బాధిత కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.