నిజామాబాద్

ఆకతాయిల భరతం పడుతున్న ‘షీ’ టీమ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, డిసెంబర్ 17: మహిళలు, యువతులు, విద్యార్థినులకు భద్రత కల్పించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన షీ టీమ్‌లు ఆకతాయిల భరతం పడుతున్నాయి. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత ఏడాదిన్నర కాలం నుండి ఆరు బృందాలను రంగంలోకి దించిన విషయం విదితమే. ఈ బృందాలు నిజామాబాద్‌తో పాటు ఆర్మూర్, బోధన్ డివిజన్లలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, ముఖ్య కూడళ్లు, ఆటో స్టాండ్‌లు, జన సమ్మర్ధం కలిగి ఉండే ప్రదేశాల్లో నిఘా ఉంచుతూ మహిళలను వేధింపులకు గురి చేయడం, విద్యార్థినులను ఈవ్‌టీజింగ్‌కు పాల్పడే వారిని గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నాయి. వేధింపులకు గురి చేసేందుకు ఎక్కువగా ఆస్కారం ఉన్న ప్రాంతాలను ముందుగానే ఎంపిక చేసుకుని మఫ్టీ దుస్తుల్లో షీ టీమ్ బృందాల్లోని పోలీసులు నిఘాను కొనసాగిస్తున్నారు. మహిళలు, యువతుల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిని గుర్తించి వారి చర్యలను వీడియోల్లో చిత్రీకరిస్తూ పక్కా ఆధారాలతో అదుపులోకి తీసుకుంటున్నారు. వారి ప్రవర్తనా తీరును బట్టి కౌన్సిలింగ్ నిర్వహించడం, వేధింపులు ఎక్కువగా ఉన్న సందర్భాల్లో కేసులు నమోదు చేస్తున్నారు. ఓ వైపు నిఘా పెడుతూనే, మరోవైపు షీ టీమ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం సిరికొండ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో షీ టీంల పనితీరు గురించి, ఈవ్‌టీజింగ్, వేధింపులు ఎదురైన సందర్భాల్లో అనుసరించాల్సిన పద్ధతుల గురించి విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది తలెత్తితే వెంటనే 100 డయల్‌కు కానీ, షీ టీమ్ నిర్వహణలో ఉండే 9490618029 వాట్స్‌యాప్ నెంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని భరోసా కల్పించారు. పోలీసు కళాజాత బృందం కళాకారులు సైతం ఆటపాటల ద్వారా విద్యార్థినులకు అవగాహన కల్పిస్తూ వారిలో ధైర్యాన్ని పెంపొందింపజేశారు. ఈ కార్యక్రమంలో సిరికొండ ఎస్‌ఐ బషీర్‌అహ్మద్, సిబ్బంది పాల్గొన్నారు. కాగా, షీ టీమ్‌లు ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తే మహిళలు, యువతులను వేధింపులకు గురి చేసే వారికి తగిన శాస్తి జరగడంతో పాటు ఇలాంటి సంఘటనలు గణనీయంగా తగ్గుముఖం పట్టేందుకు ఆస్కారం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

చేతి వృత్తుల వారికి అధిక ప్రాధాన్యం
- జేసీ యాదిరెడ్డి
కామారెడ్డి, డిసెంబర్ 17: చేతి వృత్తుల వారికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలో కుమ్మరి శాలివాహన సభ్యులకు మట్టి వాటర్ బాటిల్ తయారీపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆగస్టు 25వ తేదీన జిల్లా నుంచి 5 మంది శాలివాహనులకు రామానంద తీర్థ ట్రైనింగ్ సెంటర్ (్భదన్ పోచంపల్లి)లో శిక్షణ ఇచ్చిన్నట్లు తెలిపారు. ప్రసుత్తం జిల్లా కేంద్రంలో 30 మంది శాలివాహనులకు 3 రోజుల పాటు మట్టి వాటర్ బాటిల్‌పై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. నేటి సమాజంలో ప్లాస్టిక్ బాటిల్ వినియోగం ఎక్కువగా ఉందని, దీంతో విపరీతంగా కాలుష్యం పెరుగుతుందన్నారు. మట్టి వాటర్ బాటిల్‌లు కుండలు, మట్టి పాత్రలు తయారు చేసి కాలుష్యాన్ని నివారించవచ్చని తెలిపారు. శాలివాహనులు తయారు చేసిన ఉత్పత్తులకు విస్తృతంగా మార్కెంటింగ్ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. మూడు రోజులు శిక్షణ తీసుకున్న శాలివాహనులు గ్రామాల్లోని మిగతా సభ్యులకు శిక్షణ ఇచ్చిమట్టి పాత్రలు ఎక్కువగా తయారుచేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. మట్టికుండలు, పాత్రలతో కాలుష్యాన్ని అదుపు చేయవచ్చని తెలిపారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఝాన్సీరాణి మాట్లాడుతూ, శాలివాహనులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శాలివాహనులు ఆర్థికంగా ఎదగడానికి శిక్షణ కార్యక్రమం ప్రయోజనాత్మకంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ద్ధిఅధికారి జాన్సీరాణి, శాలివాహన జిల్లా అధ్యక్షుడు రమేశ్, ఉపాధ్యక్షుడు విఠల్, సెక్రటరీ మధు, ప్రవీణ్, చంద్రం, సంతోష్ పాల్గొన్నారు.