నిజామాబాద్

బాబోయ్...వేసవి వచ్చేస్తుందీ...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్, ఫిబ్రవరి 24:తెలంగాణ - మహారాష్టల్ర నడుమ గల మంజీరా నదిలో హద్దుల సమస్య ఏళ్ల తరబడి నానుతోంది. ఇసుక తవ్వకాలు మొదలు కాగానే ఈ సమస్య వేడెక్కుతోంది. హద్దులు దాటి తవ్వకాలు జరుగుతున్నారని మీడియాలో కథనాలు రాగానే అధికారులు వెళ్లి అక్కడ వాహనాలను సీజ్ చేస్తుంటారు. మిషన్‌లు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తుంటారు. కానీ ఈ సమస్య పునరావృతం కాకుండా హద్దులు ఏర్పాటు చేసే శాశ్వత చర్యలు మాత్రం చేపట్టలేక పోతున్నారు. ప్రస్తుతం మళ్లీ వేసవి కాలం ముంచుకు వస్తుండటంతో మహారాష్ట్ర సర్కారు ఇసుక క్వారీలకు అనుమతులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొందరు ఇసుక కాంట్రాక్టర్‌లు ఇందులో తవ్వకాల కోసం మహారాష్టల్రో పైరవీలు కూడా మొదలు పెట్టారు. మంజీరా నదిలో ఇసుక నిలువలు పుష్కలంగా ఉండటం వలన మహారాష్టల్రో కాంట్రాక్టర్‌లు తమ పైరవీలను వేగవంతం చేశారు. ఇక్కడి ఇసుక కాసులు కురిపిస్తుండటం వలన ప్రతీ వేసవిలో ఇందులో మరాఠా క్వారీలు తెరుచుకుంటున్నాయి. ఈ సారి కూడా వేసవిలో ఇందులో క్వారీలు తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఐదేళ్ల నుండి మహారాష్ట్ర సర్కారు రెండు రాష్ట్రాల నడుమ గల ఈ మంజీరాలోని తమ భూబాగంలో ప్రతీ సారి అడ్డగోలుగా క్వారీలకు అనుమతులిస్తోంది. ఈ క్వారీలను దక్కించుకునే కాంట్రాక్టర్‌లు తమకు కేటాయించిన భూబాగంలో తవ్వకాలు జరుపాల్సి ఉండగా తెలంగాణ భూబాగంలోనికి ఇష్టమొచ్చినట్లు చొచ్చుకుని వచ్చి తవ్వకాలు కొనసాగిస్తుండటం వలన ప్రతీ సారి ఇక్కడి పోలీసు, రెవెన్యూ అధికారులు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. ఈ క్వారీలు మొదలు కాగానే సరిహద్దు గ్రామాల ప్రజలు, నాయకులు రోడ్లమీద కొచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపిస్తూ ధర్నాలు చేయడం, లారీలను అడ్డుకోవడం వలన సరిహద్దులో ఉన్నటువంటి రెవెన్యూ, పోలీసు అధికారులు అక్కడికి పరుగులు తీయాల్సి వస్తోంది. కొన్ని సందర్భాలలో మంజీరా నదిలోనే పోలీసులు రోజుల తరబడి బందోబస్తు విధులు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయి. ఎన్ని రకాల కేసులు నమోదు చేసినా మరాఠా క్వారీల నిర్వాహకులు మాత్రం తమ అక్రమ దందాను యదావిధంగా కొనసాగిస్తూనే ఉన్నారు. గతంలో కోటగిరి శివారులో ఏకంగా రెవెన్యూ అధికారులపైనే మరాఠా ప్రజలు తిరగబడిన సంఘటనలు ఉన్నాయి. అలాగే బోధన్ మండలం హున్స, మందర్న, ఖండ్‌గాం శివార్లలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినా అధికారులు ఇప్పటి వరకు ఈ మంజీరా సరిహద్దుల పై దృష్టి సారించక పోవడం గమనార్హం. ప్రస్తుతం మంజీరా నదిలో నీళ్లు లేకపోవడం వలన రెండు రాష్ట్రాల అధికారులు హద్దులు ఏర్పాటు చేసేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కానీ ఈ హద్దుల విషయంలో అధికారులు ఇప్పటి వరకు కూడా దృష్టి పెట్టలేక పోయారు. హద్దులు లేని కారణంగానే క్వారీల కాంట్రాక్టర్‌లు ఇష్టమొచ్చినట్లు తెలంగాణ భూబాగంలోనికి చొచ్చుకుని వచ్చి ఇక్కడి ఇసుక నిలువలను దోచేస్తున్నారు. ప్రస్తుతం వేసవి కాలంలో గనుక మరాఠా సర్కారు క్వారీలకు అనుమతులు ఇస్తే ఇక్కడ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చే అవకాశాలు లేకపోలేవు. ఈ క్వారీలు ప్రారంభమైతే మంజీరా సరిహద్దులో ఉన్న గ్రామాల ప్రజలు కూడా అధికారుల మాట వినే పరిస్థితి ఉండదు. క్వారీల కాంట్రాక్టర్‌లు తెలంగాణ భూబాగంలోనికి చొచ్చుకుని రావడం, ఇక్కడి అధికారులు వెళ్లి అడ్డుకోవడం వంటివి జరుగడం వంటివి జరుగడం వలన రెండు రాష్ట్రాల ప్రభుత్వ శాఖాదికారుల నడుమ విభేదాలు రాజుకుంటున్నాయి. రెండు ప్రాంతాల అధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంటుండటం వలన క్రిందిస్థాయిలో విధులు నిర్వహించే రెవెన్యూ, పోలీసు సిబ్బందికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మంజీరా నదిలో గతంలో ఇక్కడి రెవెన్యూ అధికారులు మరాఠా క్వారీల నిర్వాహకులు అక్రమంగా తవ్వకాలు జరుపకుండా ఉండేందుకు స్తంబాలు ఏర్పాటు చేసినా అవి నేడు కనిపించకుండా పోయాయి. ప్రస్తుతం క్వారీలన్నీ మూసివేసి ఉండటం వలన రెండు రాష్ట్రాల అధికారులు ఈ మంజీరాలో ఇసుక తవ్వకాల విషయంలో హద్దులు నిర్దేషిస్తే రాబోయే వేసవిలో క్వారీల గొడవలకు ఎటువంటి అవకాశాలు ఉండవు. అంతేకాకుండా సరిహద్దు గ్రామాల ప్రజల ఆందోళనలు కూడా బందయ్యే అవకాశాలు లేకపోలేవు. గత రెండు రోజుల క్రితం రెండు రాష్ట్రాల పోలీసు అధికారుల సమావేశంలో కూడా ఈ ఇసుక రవాణా వ్యవహారం, హద్దుల విషయం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఇదే తరుణంలో అధికారులు మంజీరాలో హద్దులు గనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే రెండు రాష్ట్రాల అధికారులకు ఇసుక సమస్య లేకుండా పోతుందని చెప్పవచ్చు.

నియోజకవర్గ అభివృద్ధికి కృషి

ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

ఫోటో: 24ఎఆర్‌ఎం1: దేగాం పంచాయతికి ఇజ్రాయెల్ వాసులు అందించిన ట్రాక్టర్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

24ఎఆర్‌ఎం2: మామిడిపల్లిలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని సన్మానిస్తున్న పద్మశాలి సంఘం సభ్యులు

ఆర్మూర్, ఫిబ్రవరి 24: ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని, ఎవరికి ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆర్మూర్ మండలంలోని దేగాం, మామిడిపల్లి గ్రామాల్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ప్రారంభోత్సవాలు చేశారు. మామిడిపల్లి గ్రామంలో పద్మశాలి సంఘం ఒకటవ తర్ప నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే దేగాం గ్రామ పంచాయతికి ఇజ్రాయెల్ దేశంలో ఉంటున్న గ్రామస్థులు ట్రాక్టర్‌ను బహూకరించగా ఆయన పూజలు చేసి ప్రారంభించారు. అలాగే పలు వివాహ కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యే పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంగా తనపై మరింత బాధ్యత పెరిగిందని, అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ త్రివేణి గంగాధర్, మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్, కౌన్సిలర్లు రమాకాంత్, పండిత్ ప్రేమ్, గుద్దేటి రమేష్, టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇట్టెడి లింగారెడ్డి, దేగాం ఉప సర్పంచ్ గడ్డం గంగారెడ్డి, మాజీ సర్పంచ్ బియాంక్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

మద్దతు ధరపై వౌనం వీడని సర్కారు
ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబాద్, ఫిబ్రవరి 24: పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర కోరుతూ గత మూడు వారాల నుండి రైతులు దశల వారీగా ఉద్యమిస్తున్నప్పటికీ, ప్రభుత్వం మాత్రం వౌనముద్ర వీడడం లేదు. ఇప్పటికే ఆర్మూర్ డివిజన్ రైతాంగం మూడు పర్యాయాలు జాతీయ రహదారులను దిగ్బంధించి, వంటావార్పుతో నిరసనలు చాటారు. పోలీసుల నిర్బంధాన్ని దాటుకుని జిల్లా కేంద్రానికి సైతం చేరుకుని కలెక్టరేట్ ఎదుట కదం తొక్కుతూ తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఇంత జరిగినా రైతుల డిమాండ్ పట్ల ప్రభుత్వ వర్గాల నుండి నామమాత్రంగానైనా స్పందన కానరాకపోవడం రైతులను తీవ్ర అసహనానికి గురి చేస్తోంది. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు వీలుగా ప్రస్తుతం మరోమారు నిరసనకు దిగేందుకు సమాయత్తం అయ్యారు. ఆర్మూర్ డివిజన్‌లోని 11మండలాలతో పాటు దర్పల్లి, ఇందల్వాయి ప్రాంతాలకు చెందిన పసుపు, ఎర్రజొన్న రైతులంతా సోమవారం ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే రైతు నాయకులు, గ్రామ కమిటీలు ఇంటికి ఇద్దరు చొప్పున తప్పనిసరిగా ధర్నాకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం ముందస్తుగానే అప్రమత్తమై నిరసనల తీవ్రతను తగ్గించే యత్నాల్లో నిమగ్నమైంది. రైతు సంఘాల బాధ్యులు వీ.ప్రభాకర్, దేవరాం, రామకృష్ణ తదితరులను ఇప్పటికే అరెస్టు చేయగా, గ్రామాలలో రైతులను సైతం పోలీసు అధికారులు కలుస్తూ శాంతిభద్రతల సమస్య తలెత్తేందుకు ఆస్కారం ఉన్నందున ఆందోళనను విరమించుకోవాలని నచ్చజెప్పే ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు రైతుల ఆందోళనతో ప్రభుత్వ ప్రతిష్టకు భంగం వాటిల్లే పరిస్థితి నెలకొనడంతో అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు కూడా రైతు ప్రతినిధులతో మంతనాలు జరుపుతూ ఆందోళన పథం నుండి వారి దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం తమకు న్యాయం చేసేంత వరకు ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేదని రైతులు కరాఖండీగా తేల్చి చెబుతున్నారు. తాము రాజకీయ పార్టీలకు అతీతంగా తమ సమస్యల సాధన కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనలు చేస్తున్నామని, పసుపు పంట క్వింటాలుకు 15వేలు, ఎర్రజొన్నకు 3500రూపాయల మద్దతు ధరను ప్రకటిస్తూ ప్రభుత్వపరంగానే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ రైతుల డిమాండ్ పట్ల ప్రభుత్వం నుండి ఇంతవరకు స్పందన శూన్యంగానే ఉందని చెప్పవచ్చు. కేవలం జిల్లా కలెక్టర్ ఎంఆర్‌ఎం.రావు ఒక పర్యాయం అధికారుల సమక్షంలో రైతు ప్రతినిధులు, ఎర్రజొన్న విత్తన వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు మద్దతు ధర చెల్లించి పంటను సేకరించాలని, లేనిపక్షంలో విత్తన వ్యాపారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినప్పటికీ సదరు సీడ్ వ్యాపారులు, దళారులు ఎర్రజొన్న క్వింటాలుకు 1600రూపాయలకు మించి ధర చెల్లించబోమని తెగేసి చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ప్రభుత్వం పైనే భారం వేసి ఆందోళన బాటలో పయనిస్తున్నారు. అయితే గతేడాది కూడా ఇదే తరహాలో రైతులు ఉద్యమించడంతో ప్రభుత్వం స్పందించి మార్క్‌ఫెడ్ ద్వారా ఎర్రజొన్న పంటను క్వింటాలుకు 2300రూపాయల చొప్పున కొనుగోలు చేసింది. అనంతరం ప్రైవేట్ వ్యాపారులు కూడా ఇంచుమించు అంతేమొత్తం ధరను చెల్లించడంతో రైతులు నష్టాల బారినుండి బయటపడగలిగారు. ఇప్పుడు కూడా అదే తరహాలో ప్రభుత్వపరంగానే ఎర్రజొన్న పంటను సేకరించాలని రైతులు కోరుతున్నప్పటికీ, గతేడాది ఈ పంట సేకరించిన మార్క్‌ఫెడ్ సంస్థ 50కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసిన దరిమిలా ఈసారి ప్రభుత్వం వ్యూహాత్మక వౌనాన్ని అవలంభిస్తోంది.

పసుపు పనులకు ఇతర రాష్ట్రాల కూలీలే ఆధారం

మోర్తాడ్, ఫిబ్రవరి 24: ఆరుగాలం శ్రమించి రైతులు పండిస్తున్న పసుపును శుద్ధి చేయడంలో ఇతర రాష్ట్రాల కూలీలే క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. పసుపు తవ్వడం నుండి శుద్ధి చేసే వరకు వీరి ప్రాధాన్యత కనిపిస్తోంది. ముఖ్యంగా పసుపును శుద్ధి చేయడంలో ఈ కూలీలే ఎక్కువగా శ్రమిస్తున్నారు. పసుపు ఉడికించే యంత్రాల నిర్వాహకులు ఇతర రాష్ట్ర కూలీలను నియమించుకుంటూ పనులు చేయించుకుంటున్నారు. గతంలో దిగుడు పోయిలపై కడాయిలలో పసుపును ఉడికించేటపుడు రైతులే ఒకరికొకరు చేదోడువాదోడుగా పనులు చేసుకునేవారు. ఒక రైతు కుటుంబానికి మరో రైతు చేయూతనిచ్చి పసుపును ఉడికించుకునే వారు. అయితే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన పసుపు బాయిలింగ్ యంత్రాలలో ఆ ఆనవాయితీ కనిపించడంలేదు. ఇటీవల కాలంలో రైతులంతా పసుపును బాయిలింగ్ యంత్రాలలో ఉడికిస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు వీటిని అందజేస్తున్న అవి పక్కదారి పడుతూనే ఉన్నాయి. అయితే కొందరు వ్యక్తులు వ్యాపారులుగా మారి పసుపు కడాయి యంత్రాలను తయారుచేసి రైతులకు అద్దెకు ఇస్తున్నారు. నాలుగు కడాయిలలో పసుపును ఉడికిస్తూ అరబెట్టే బాధ్యత కడాయి యంత్రాల నిర్వాహకుడిదే. ఈ నేపథ్యంలోనే సదరు నిర్వాహకులు ఇతర రాష్ట్రాల కూలీలను నియమించుకుంటున్నారు. ఒక్క కడాయికిగాను రైతుల నుండి 2వందల రూపాయల వరకు వసూలు చేస్తుండగా, అందులో 80రూపాయాలు కూలీలకే చెల్లిస్తున్నట్లు రైతులు అంటున్నారు. ఈ పనులకుగాను మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల కూలీలు ఎక్కువగా పనులు చేసుకుంటున్నారు. ప్రస్తుతం వారి ప్రాధాన్యతనే అధికంగా కనిపిస్తోంది. పసుపును ఉడికించి, ఆరబెట్టే వరకు సదరు కూలీలదే బాధ్యత కావడంతో, రైతులకు కూడా పనులు సులభమయ్యాయి.