నిజామాబాద్

నాణ్యమైన విద్యను అందించేందుకు ట్రాస్మా కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, మే 23: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రైవేటు పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ట్రాస్మా కృషి చేస్తోందని, ప్రభుత్వం కూడా తమవంతు సహకారం అందించేందుకు ముందుకు వచ్చిందని ట్రాస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని ఓ ప్రైవేటు హోటల్‌లో ట్రాస్మా జనరల్ బాడీ సమావేశం అనంతరం స్థానిక విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలల్లో 56శాతం విద్యార్థులు చదువుతున్నారని, గడిచిన రెండు సంవత్సరాలుగా ప్రైవేటు స్కూళ్ల మంచి చెడులను చర్చించేందుకు ప్రభుత్వం రెండుమూడు పర్యాయాలు చర్చలకు ఆహ్వానించడం జరిగిందన్నారు. ప్రైవేటు స్కూళ్లలో మంచి విద్యను అందించి, కార్పొరేట్ విద్యా సంస్థలను తరిమికొట్టాలని ప్రభుత్వం బావిస్తోందన్నారు. ఎందుకంటే కార్పొరేట్ పాఠశాలలు వ్యాపార దృక్ఫదంతో వ్యవహరించడమేనని అన్నారు. తమ విద్యా సంస్థలు ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ, మంచి విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. అందులో భాగంగానే సిబిఎస్‌ఇ లాంటి విద్యను అందిస్తూ విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలుపుతున్నామని అన్నారు. ప్రభుత్వం, ప్రభుత్వం ముద్రించే పుస్తకాలనే వినియోగించాలని ఆదేశించడంతో తాము కోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు. ఇందుకు న్యాయస్థానం తమకు అనుకూలంగానే స్టే ఇవ్వడం జరిగిందని తెలిపారు. దాంతో ప్రభుత్వం చేసేదేమీలేక 2016-17 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పుస్తకాలనే వాడుకోవచ్చని సూచించడం జరిగిందన్నారు. అంతేకాకుండా తమ పాఠశాలల్లో నిష్టాణులైన ఉపాధ్యాయులనే నియమించుకుని విద్యా బోధన కొనసాగిస్తున్నామన్నారు. జీవో నెంబర్ 1ద్వారా ప్రైవేటు పాఠశాలల్లో మైదానం సమస్య తప్పా, వౌలిక సదుపాయాలన్నింటిని సమకూర్చడం జరిగిందన్నారు. గతంలో సంవత్సరానికి ఒకసారి ప్రైవేటు స్కూళ్లు రెన్యూవల్ చేసుకునేవారమని, తెలంగాణ సర్కార్ వచ్చిన తర్వాత 5సంవత్సరాలకు ఒకసారి రెన్యూవల్ చేసుకునే అవకాశం కల్పించడం పట్ల వారు కృత్ఞతలు తెలిపారు. జూన్ 29న హైదరాబాద్‌లో ట్రాస్మా ఆధ్వర్యంలో మహాసభ నిర్వహించడం జరుగుతుందని, ఈ సభకు విద్యాశాఖ మంత్రి, డిప్యూటీ సిఎం కడియం శ్రీహరిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నట్లు వారు వెల్లడించారు. కార్పొరేట్ పాఠశాలల్లో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నందున ప్రైవేటు స్కూళ్లలో 40వేల వరకు ఫీజులు వసూలు చేసే విధంగా వెసులుబాటు కల్పించాలని మహాసభలలో విద్యాశాఖ మంత్రిని కోరడం జరుగుతుందన్నారు. అలాగే ప్రభుత్వం కామన్ విద్యా విధానం ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ సమావేశంలో ట్రాస్మా ప్రతినిధులు జయసింహా, నర్సింహారావు, సుందర్, మామిడాల మోహన్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.