నిజామాబాద్

కేంద్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందరికీ అందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డి, జూన్ 23: కేంద్రంలోని నరేంద్ర మోదీ నేతృత్వంలో రెండేళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు అందడం, అట్టడుగు స్థాయికి వెళ్లడం సంతోషంగా ఉందని కేంద్ర జౌళి శాఖ మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ అన్నారు. గురువారం ఎల్లారెడ్డి పట్టణంలోని స్థానిక ముత్యపు రాఘవులు పెంటయ్య ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన భారత్ వికాస్ పర్వ్ (ప్రగతిపథంలో భారత దేశం) అనే కార్యక్రమానికి కేంద్ర మంత్రి సురేష్ కుమార్ గంగ్వార్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ సహాయ మంత్రి సాద్వినిరంజన్ జ్యోతి, ఝార్ఖుండ్ మాజీ ముఖ్య మంత్రి అర్జున్ ముండా, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, జిల్లా, రాష్టస్థ్రాయి నాయకులు హాజరయ్యారు. ఈసందర్భంగా సురేష్ కుమార్ గంగ్వార్ మాట్లాడుతూ, కేంద్రంలో ప్రధాన మంత్రిగా నరేంద్ర మోది రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా సాధించిన ప్రగతి, అభివృద్ధి ఫలాలను గురించి ప్రజలకు చేరువయ్యేలా, వారికి వివరించేందు కోసం ఈ కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా 200 జిల్లాల్లో నిర్వహిస్తున్నామన్నారు. మోది చాయ్‌వాలాగా తన జీవితాన్ని ప్రారంభించి, నేడు దేశ ప్రధానిగా ప్రజల ముందు సేవకుడిలా పని చేస్తూ, అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందించేందుకోసం కృషి చేస్తున్నారన్నారు. దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలు కూడా నరేంద్ర మోది పాలన వైపు ఆసక్తిగా చూస్తున్నాయన్నారు. మోది నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో పురొభివృద్ధి పథంలో పయణిస్తుందన్నారు. గ్రామీణ మహిళలు కట్టెల పొయ్యిపై వంట చేస్తూ కళ్ల వ్యాధులకు గురవుతున్నారని, స్వయంగా ప్రధాని తల్లి సైతం కట్టెల పొయ్యిపై వంట చేయడం తాను ఇంకా మర్చి పోలేదని, ఇలాంటి కష్టాలు దేశంలో ఏ మహిళ కూడా పడవద్దని ఉజ్వల ఫథకం కింద సబ్సిడీ సిలిండర్‌లను మహిళలకు దేశ వ్యాప్తంగా అందజేయడం జరిగిందన్నారు. మోది ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన ఉన్నత వర్గాల వారు దాదాపు కోటి రూపాయల సబ్సిడీని వదులు కున్నారని, ఇది ప్రధాని మోది ఘనతగా చెప్పుకోవచ్చన్నారు. తాను నిర్వహిస్తున్న జౌళి శాఖ ద్వారా 3 ఏళ్లలో కోటి ఉద్యోగాలను నిరుద్యోగులకు కల్పించేందు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సురేష్ కుమార్ అన్నారు.
ప్రతి ఒక్కరికి స్వయం ఉపాధి కల్పించడమే మోది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అనంతరం కేంద్రఫుడ్ ప్రాసెసింగ్ శాఖ సహాయ మంత్రి సాద్వి నిరంజన్ జ్యోతి మాట్లాడుతూ, ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నేరుగా చేర వేయడం కోసం జన్ ధన్ యోజన పథకం ద్వారా దేశంలోని ప్రతి ఒక్కరికి జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయించి, నేరుగా సబ్సిడీ ఫలాలను అకౌంట్‌లో జమ చేసే విధంగా చర్యలు తీసుకుందన్నారు. సురక్ష, ఫసల్ యోజన తదితర సంక్షేమ ఫథకాల ద్వారా దేశంలోని రైతులను ఆదుకుంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలలు ప్రతి ఒక్కరికి అందేందుకోసం కృషి చేయడం జరుగుతోందన్నారు. ప్రజలంతా నరేంద్ర మోది పాలనలో సంతోషంగా ఉన్నారని అన్నారు. అంతకు ముందు ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా మాట్లాడారు. గత ప్రభుత్వాలు అవినీతి ప్రభుత్వాలుగా కీర్తిగడించాయని, నేడు నరేంద్ర మోదీ నేతృత్వంలో అభివృద్ధి సాధించి ఖ్యాతి గడిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందేలా చేయడమే తమ లక్ష్యం అని చెప్పారు. తాను స్వయంగా గిరిజన జ్యాతికి చెందిన వ్యక్తిని అయనప్పటికీ భారతీయ జనతాపార్టీ తనకు ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యునిగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇలా ఉన్నత పదవులు కల్పించినందుకు జీవితాంతం పార్టీకి రుణపడి ఉంటానన్నారు. తాను గిరిజనుడైనందును గిరిజనులను ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందే విధంగా కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు.