నిజామాబాద్

పోలీసుల కళ్లు గప్పి.. ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఖైదీ పరార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినాయక్‌నగర్, జూలై 17: జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి ఈ నెల 15వ తేదీన ఒక్కసారిగా కడుపునొప్పి రావడంతో జైలు అధికారులు కానిస్టేబుల్స్ ఎస్కార్ట్‌తో చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించగా, ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్సలు అందిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం ఉదయం నిందితుడు నీరోడి అరుణ్ తనకు బాత్‌రూమ్ వస్తుందని చెప్పడంతో ఎస్కార్ట్‌గా ఉన్న కానిస్టేబుల్ అతడిని బాత్‌రూమ్‌లోకి నిందితుడు అరుణ్, తనకు ఎస్కార్ట్‌గా వచ్చిన కానిస్టేబుల్‌కు చెప్పాడు. దీంతో అతడు వార్డులోని సిబ్బందికి చెప్పేందుకు వెళ్లగా, ఇదే అదనుగా భావించిన నిందితుడు ఎస్కార్ట్ కళ్లుగప్పి తప్పించుకుని పారిపోయినట్లు వన్‌టౌన్ ఎస్‌హెచ్‌ఓ రవీందర్ తెలిపారు.
ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ హత్యక కేసులో అరుణ్ నిందితుడని, ఈ నెల 14వ తేదీనే రిమాండ్ చేయడం జరిగిందని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. నిందితున్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించడం జరిగిందని ఎస్‌హెచ్‌ఓ వెల్లడించారు.