నిజామాబాద్

హరితహారంలో 82 శాతం లక్ష్య సాధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఆగస్టు 2: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం అమలులో నిజామాబాద్ జిల్లా ప్రగతిని చాటుతూ ముందంజలో దూసుకెళ్తోంది. జిల్లాలో 3.35కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించగా, ఇప్పటివరకు 2.76కోట్ల మొక్కలు నాటడం ద్వారా 82శాతం లక్ష్యాన్ని సాధించారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ యోగితారాణా ఈ విషయాన్ని సిఎస్ దృష్టికి తెచ్చారు. మరో మూడు రోజుల్లోగా పూర్తిస్థాయి లక్ష్యాన్ని సాధించేలా అన్ని చర్యలు చేపట్టామని వివరించారు. మొక్కలు నాటడంతోనే సరిపెట్టుకోకుండా వాటిని సంరక్షించేందుకు, అవసరమైన మేర నీటిని అందించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అయితే టేకు మొక్కలకు ఉపాధి హామీ పథకంలో నీటిని అందించేందుకు అవసరమైన సదుపాయాలు లేనందున, వీటి సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు వీలుగా 42కోట్ల రూపాయలను మంజూరు చేయాలని ప్రధాన కార్యదర్శిని కోరారు. ఇతర మొక్కలకు ఉపాధి హామీ పథకం ద్వారా ముళ్ల కంచెలు ఏర్పాటు చేయిస్తున్నామని చెప్పారు. ఇవి కాకుండా మరో 10లక్షల ట్రీగార్డులు అవసరమవుతాయని అన్నారు. మొక్కలు నాటే లక్ష్యం దాదాపుగా తుదిదశకు చేరుకున్నందున నాటిన మొక్కలను పూర్తిస్థాయిలో కాపాడడంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. పక్షం రోజుల్లోగా నాటిన అన్ని మొక్కల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశామన్నారు