నిజామాబాద్

హోటల్‌పై ఎంహెచ్‌ఓ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, ఆగస్టు 18: నగరంలోని హైదరాబాద్ హౌస్ హోటల్‌పై గురువారం ఎంహెచ్‌ఓ సిరాజుద్దీన్ ఆకస్మిక దాడులు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు ఆరోగ్యకరమైన వంటలను చేసి వ్యాపారం చేయాల్సి ఉండగా, హెచ్‌హెచ్ హోటల్ నిర్వహకులు రెండుమూడు రోజుల క్రితం చేసిన వంటలను హోటల్‌కు వచ్చిన వారికి వడ్డిస్తున్నారని అన్నారు. తాము తనిఖీ చేయగా, స్టోర్ రూమ్‌లోని ఫ్రిడ్జ్‌లో రెండుమూడు రోజుల కింద వండిన బిర్యాని, కీమా, మటన్ లభ్యమయ్యాయని ఎంహెచ్‌ఓ తెలిపారు. అదేవిధంగా కాలం చెల్లిన మూడు కిలోల మసాలా దినుసుల ప్యాకెట్లు ఉన్నాయన్నారు. డ్రైనేజీ పైపులు సక్రమంగా లేవని, అసలు స్టోర్ రూమే అపరిశుభ్రంగా ఉందన్నారు. నిషేధిత ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్నారని, వీటి విషయమై ప్రశ్నిస్తే, మున్సిపల్ అధికారులు నల్లా నీళ్లే సరిగ్గా అందించడం లేదని, అలాంటప్పుడు పరిసరాలు ఎలా ఉంటాయని హోటల్ నిర్వహకులు ఎంహెచ్‌ఓతో వాగ్వాదానికి దిగుతూ ఒకింత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. జరిమానా చెల్లించాలని కోరితే, కట్టేది లేదంటూ మొండికేస్తూ నోటీసులు పంపించాలని నిర్వహకులు ఇష్టారీతిన మాట్లాడడంతో ఎంహెచ్‌ఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటల్‌లోని అస్తవ్యస్త పరిస్థితులపై పంచనామా జరిపి కోర్టుకు నివేదిక ఇస్తామని ఎంహెచ్‌ఓ తెలిపారు. అదేవిధంగా ఈ హోటల్‌కు పెయిడ్ లైసెన్స్ లేదని, నిబంధనలకు విరుద్ధంగా హోటల్ నడిపిస్తున్నారని అన్నారు. విధుల్లో ఉన్న ఉద్యోగులపై దురుసుగా ప్రవర్తించినందున యజమానులపై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. ఈ దాడుల్లో సానిటరీ ఇన్‌స్పెక్టర్‌లు ప్రకాశ్, నటరాజ్‌గౌడ్, అహ్మద్, వెంకటనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.