నిజామాబాద్

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, సెప్టెంబర్ 12: రాబోయే మూడు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున అధికార యంత్రంగాన్ని అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ యోగితారాణా తెలిపారు. ప్రజలకు అత్యావసర సేవలను అందించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని, వర్షం వల్ల ఏమైనా ఇబ్బందులు తలెత్తితే 18004256644 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌లో సంప్రదించాలని సూచించారు. సోమవారం తన చాంబర్‌లో జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన అత్యావసర సమావేశంలో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు మండల, గ్రామస్థాయి యంత్రంగాన్ని సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భారీ వర్షాలు కురిసినప్పుడు వాగులు, వంకలు పొంగిపొర్లి, రహదారులు మూతపడే మారుమూల గ్రామాల ప్రజలకు అత్యావసర సేవలు అందుబాటులో ఉంచాలన్నారు. రోడ్లు, విద్యుత్ వ్యవస్థకు నష్టం వాటిల్లితే వెంటనే పునరుద్ధరించాలని ఆయా శాఖల ఆదేశించారు. చెరువులు, కుంటలకు గండ్లు పడితే యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని, మిషన్ కాకతీయ చెరువులకు చేరే నీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, విఆర్‌ఓ, విఆర్‌ఎలను ఆదేశించారు. అదే విధంగా అత్యావసర మందులను అన్ని గ్రామాల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సమృద్ధిగా నిల్వ ఉంచాలని, తాగునీటి వనరులను క్లోరినేషన్ చేయాలని, వర్షాలు కురిసినప్పుడు అంటువ్యాధులు సోకకుండా పటీష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. వైద్య సేవలు అందించేందుకు గాను 108, 104 సర్వీసులను అందుబాటులో ఉంచాలని, నదులు, తక్కువ ఎత్తులో ఉన్న బ్రిడ్జిల వద్ద భద్రత చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జెసి రవీందర్‌రెడ్డి, డిఎస్‌ఓ కృష్ణప్రసాద్, ఎన్‌పిడిసిఎల్ ఎస్‌ఇ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.