నిజామాబాద్

కలెక్టరేట్ ముట్టడి బీడీ కార్మికుల అరెస్టు, విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, డిసెంబర్ 15: బీడీ కార్మికులకు ఆన్‌లైన్‌లో కాకుండా నగదు రూపంలోనే వేతనాలు ఇవ్వాలని ఐఎఫ్‌టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేందర్ డిమాండ్ చేశారు. గురువారం ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో బీడీ కార్మికులు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు వారిని అడ్డుకోని కొందరిని అరెస్టు చేసి వ్యక్తిగత పూచికత్తుపై వదిలిపెట్టారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టియు నాయకులు నరేందర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పెద్దనోట్ల రద్దుతో సామాన్య ప్రజలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు. చదువురాని ఖాతాదారులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తు అనారోగ్యానికి గురి అవుతున్నారన్నారు. సుమారు 40రోజులు అవుతున్న డబ్బుల కష్టాలు అలాగే ఉన్నాయన్నారు. బీడీ కార్మికులకు నేరుగానే నగదు చెల్లించాలని డిమాండ్ చేశారు. పిఎఫ్ కార్డులలో తప్పులుగా నమోదు అయిన కొందరి కార్మికుల పేర్లను సరి చేయాలన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ సత్యనారాయణకు అందించారు. ఈ ఆందోళనలో బీడీ, ఐఎఫ్‌టియు ప్రతినిధులు గొండక్క, రాజు, ఆజాద్, ప్రకాశ్, దేవిసింగ్, పరమేశ్, సునిత, తదితరులు పాల్గొన్నారు.

నగదు రూపంలోనే వేతనాలు చెల్లించాలి

కలెక్టరేట్ ఎదుట ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో బీడీ కార్మికుల ధర్నా

కంఠేశ్వర్, డిసెంబర్ 15: బీడీ కార్మికులకు ఆన్‌లైన్‌లో కాకుండా నగదు రూపంలోనే వేతనాలు చెల్లించాలని కోరుతూ గురువారం ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో బీడీ కార్మికులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టియు రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ మాట్లాడుతూ, దేశ ప్రధాని నరేంద్రమోడీ పెద్ద నోట్లను రద్దు చేసి, నల్లధనంపై యుద్ధం చేస్తున్నానని ప్రకటించారని, కానీ, ప్రస్తుతం ఈ నోట్ల రద్దు నిర్ణయం వల్ల పేద ప్రజలపై యుద్ధం చేసినట్లుగా ఉందన్నారు. నోట్ల రద్దు వల్ల నల్ల కుబేరులను భరతం పడ్తామని చెప్పిన మోడీ, సరిపడా నగదులు నిల్వలను అందుబాటులో ఉంచకుండా పేదల చావుకు కారణం అవుతున్నారని ఆరోపించారు. పేద, మధ్యతరగతి ప్రజలు బ్యాంకులు, ఎటిఎంల వద్ద క్యూలు కడుతూ తిప్పలు పడుతున్నారని, నల్ల కుబేరుల ఇనుప పెట్టేల్లోకి మాత్రం కోట్లాది రూపాయల కొత్త కరెన్సీ ఎలా వచ్చి చేరుతోందో కేంద్రం సమాధానం ఇవ్వాలన్నారు. మోడీ నిర్ణయం వల్ల రోజు కూలీల పరిస్థితి మరీ దారుణంగా తయారైందని, 37రోజులు సామాన్య ప్రజలు నగదు కోసం బ్యాంకుల చుట్టు ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీడీ కార్మికుల చెల్లింపులను సైతం ఆన్‌లైన్, బ్యాంకుల ద్వారా మాత్రమే చేపట్టాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయడం దారుణమన్నారు. తెలంగాణలో 7లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారని, ఇందులో 70శాతానికి పైగా నిరాక్షరాస్యులే ఉన్నారని అన్నారు. అలాగే పిఎఫ్ ఫారం నెంబర్ 9లో కార్మికుల ఇంటి పేర్లు, తండ్రి, భర్త పేరు, వయస్సు ఇలా అనేకం తప్పులు ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో బీడీ కార్మికులకు ఆన్‌లైన్ ద్వారా వేతనాలు చెల్లిస్తామనడం సమంజసం కాదన్నారు. ఒకవైపు రోజువారి కూలీలు పనులు లేక పస్తులుంటున్నారని, మరోవైపు బీడీ కార్మికులు చేసిన పనికి రావాల్సిన డబ్బుల కోసం బ్యాంకుల చుట్టు ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందన్నారు. ఇప్పటికైనా కేంద్రం నోట్ల రద్దు విషయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రజలు, కార్మికులు తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. అంతకు ముందు రాజీవ్‌గాంధీ ఆడిటోరియం నుండి కలెక్టరేట్ వరకు బీడీ కార్మికులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ధర్నాలో సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు యాదగిరి, వెంకట్, ముత్తెన్న, భూమన్న, ప్రభాకర్‌తో పాటు వేలాదిమంది బీడీ కార్మికులు పాల్గొన్నారు.