Others

నిరుద్యోగ నిర్మూలన జరిగేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిరుద్యోగ సమస్య అనేది ప్రపంచవ్యాప్తంగా తన ప్రభావమేమిటో చూపుతుందని ఇటీవల వివిధ సంస్థలు వెల్లడించిన నివేదికలు చూస్తుంటే అర్థమవుతున్నది. ప్రపంచ నిరుద్యోగిత రేటు ప్రతి సంవత్సరం పెరుగుతుంది. చేయడానికి పనులు లేక నిరుద్యోగులు అష్టకష్టాలు పడుతున్నారని, ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని వరల్డ్ ఎంప్లాయిమెంట్ అండ్ సోషల్ అవుట్ నివేదికను సమర్పించింది. 2019 వరకు ప్రపంచవ్యాప్తంగా 18.8 కోట్ల నిరుద్యోగులుంటే 2020 నాటికది 19.5 కోట్లకు చేరుకుంది. భారత ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను విశే్లషించే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ విడుదల చేసిన సర్వే ఫలితాలను పరిశీలిస్తే భవిష్యత్‌లో జరగబోయే పరిణామాలు కనబడతాయి. 2017 మూడో త్రైమాసికానికి (మే-ఆగస్టు) 3.8 శాతం ఉంటే 2019-20 (సెప్టెంబర్- డిసెంబర్) నాకది 7.5 శాతానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా 1.74 లక్షల ఇళ్ళనుండి సమాచారం సేకరించి విశే్లషిస్తే గ్రామీణ భారత్‌లో 6.8 శాతం నిరుద్యోగిత రేటు ఉంటే పట్టణ భారత్‌లో 9 శాతం నిరుద్యోగిత రేటు వున్నది. అలాగే 20-24 సంవత్సరాల వయస్సులో 37 శాతం నిరుద్యోగులుంటే అందులో 60 శాతానికి పైగా బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసినవారున్నారు.
దేశంలో ఆత్మహత్యలు- 2018 పేరిట జాతీయ నేర గణాంకాల సంస్థ విడుదల చేసిన ఫలితాలను చూస్తే 2015 సంవత్సరంలో మొత్తం 1,33,623 మంది ఆత్మహత్యలు చేసుకుంటే అందులో నిరుద్యోగ సమస్యతో 10,912 మంది రైతులు 12,602 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 2017 నాటికది మొత్తం 1,29,788 ఆత్మహత్యలు చేసుకుంటే నిరుద్యోగులు 12,241 మంది, రైతులు 10,655 మంది, తర్వాతి సంవత్సరం 2018లో మొత్తం 1,34,516 ఆత్మహత్యలలో నిరుద్యోగులు 12,936 మంది రైతులు 10,349 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే 2018లో 13వేల మందిలో 10,687 పురుషులు, 2,249 మంది స్ర్తిలు నిరాశ, నిస్పృహలకు లోనై ఆత్మహత్యలకు లోనుకావడం బాధాకరం. దీనిని బట్టి దేశంలో ప్రతి గంటకు ఒక నిరుద్యోగి ఉసురుతీసుకుంటున్నారన్నమాట... రైతుల ఆత్మహత్యలతో పోలిస్తే, నిరుద్యోగుల ఆత్మహత్యలు 2 శాతం ఎక్కువగా ఉన్నాయంటే దేశంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయో తెలియకనే తెలుస్తుంది.
దేశంలో రాష్ట్రాల వారీగా నిరుద్యోగ ఆత్మహత్యలను పరిశీలిస్తే కేరళలో 1,585 నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడి 12.3 శాతంతో ప్రథమస్థానంలో నిల్వగా, ద్వితీయ స్థానంలో తమిళనాడు 1,579 తర్వాతి స్థానాలలో మహారాష్ట్ర 1,260, కర్ణాటక 1,094 మరియు ఉత్తరప్రదేశ్‌లో 902 మంది నిరుద్యోగిత యువత ఆత్మహత్యలకు పాల్పడటమనేది పాలకుల అసమర్థత గురించి తెలియజేస్తుంది. ప్రభుత్వాలు మారిన, పాలకులు మారిన నిరుద్యోగ బ్రతుకులకు మాత్రం భరోసా లేకుండాపోయిందనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు.
ఏడాదికేడాది యువత తమ చదువులు పూర్తిచేసుకొని బయటికి వచ్చి ఉద్యోగాలకై ఎన్ని ప్రయత్నాలు చేసిన నిరాశే నిగులుతుంది. ప్రభుత్వ రంగంలోనైనా, ప్రైవేట్ రంగంలోనైనా ఉద్యోగ కల్పన అనేది నిరుద్యోగులకు చాలా ముఖ్యం. గానీ అలా జరగకపోవడానికి గల కారణాలను విశే్లషిస్తే.. ప్రభుత్వం పరిధిలో తగినన్ని ఖాళీలు లేకపోవడం ఒక్కెతె్తైతే ఖాళీల స్థానాలను సైతం భర్తీచేయలేని పరిస్థితి. ప్రైవేటు రంగంలో ఎన్ని ఖాళీలున్నా ఎవరికీ నైపుణ్యం కలిగిన అభ్యర్థులనే ఎన్నుకుంటారు. ఇక్కడ ఇంకో విషయాన్ని ప్రస్తావించాలి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విచ్చలవిడిగా వివిధ ప్రైవేటు విద్యాసంస్థలకు అనుమతులిచ్చి, ఫీజు రీయంబర్స్‌మెంట్ లాంటి సౌకర్యాలను కల్పిస్తూ, ఖచ్చితమైన తనిఖీ విభాగాలను ఏర్పర్చకుండా వ్యవహరిస్తే అందులో చదివిన విద్యార్థులకు సైతం నైపుణ్యం రాకుండానే సర్ట్ఫికెట్స్ పొందే అవకాశాలు కల్పించినప్పుడు ఎలా ఉద్యోగాలు పొందాలో ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది.
ప్రభుత్వం చేయాల్సిన పనులు:
* విద్యావ్యవస్థను ప్రక్షాళనగావించి, నాణ్యతమైన విద్యను అందించాలి.
* విద్యావ్యవస్థను ఎప్పటికప్పుడు తనిఖీలు గావించే విధానాన్ని కొసాగిస్తూ, ప్రభుత్వానుసారంగా పనిచేయని సంస్థలపై కొరడా ఝుళిపించాలి.
* నైపుణ్యం పెంచడానికి, నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ కేంద్రాలను ఏర్పర్చి వారికి అవగాహన కల్పించి, ఉద్యోగ కల్పనకు ప్రభుత్వమే తోడ్పాటు చేయాలి.
* అన్నింటికంటే ముందు ప్రభుత్వ సంస్థలలోని ఖాళీలను గుర్తించి వాటి భర్తీకి నోచుకోవాలి. ఏవో సాకులు జెప్పి పొడిగించడమనేది మంచిది కాదు.
* ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు సంస్థలు, కార్యాలయాలలో సిబ్బంది నియామకంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని ఉద్యోగ భద్రతకు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
* స్వయం ఉపాధికి చెందిన కార్యక్రమాలు చేబడుతూ, నిరుద్యోగులకు శిక్షణలిచ్చి, బ్యాంకుల ద్వారా సబ్సిడీలతో లోన్ సౌకర్యాలను కల్పించాలి.
* కుటీర పరిశ్రమలకు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రాధాన్యతనిస్తూ, సాంకేతిక విద్యనభ్యసించిన నిరుద్యోగులకు ప్రభుత్వమే ఆర్థిక సహాయాలందిస్తూ వాటి ద్వారా మరికొంతమందికి ఉపాధి దొరికేలా చూడాలి.
* వ్యవసాయాభివృద్ధిలో భాగంగా వాటితో అనుబంధం కలిగిన నిరుద్యోగులకు పాడి పరిశ్రమకు, కోళ్ళ పరిశ్రమకు కావాల్సిన వనరులను సమకూర్చాలి. అలాగే కూరగాయలు, పప్పు ధాన్యాలను పండించానికి ప్రోత్సహిస్తూ, వాటికి మద్దతు ధర కల్పిస్తూ, ఆర్థిక లాభాలు వచ్చే విధంగా తోడ్పడాలి.
* ప్రభుత్వాలకు కావాల్సిన వాటికై ఏ ప్రైవేట్ సంస్థలపై ఆధారపడకుండా ప్రభుత్వమే అలాంటి సంస్థలను నిర్వర్తిస్తే ఎంతోమందికి ఉపాధితోపాటు, వాటివలన వచ్చే లాభాలు సైతం ప్రభుత్వానికి ఉపయోగపడతాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి సమిష్టిగా నిరుద్యోగ నిర్మూలనకై ఏవిధంగా కార్యక్రమాలు చేపట్టాలో చర్చించి, అమలుపరిస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభించి పలువురి జీవితాలలో వెలుగులు నింపినట్లవుతుంది.

- డా. పోలం సైదులు, 9441930361