ఓ చిన్నమాట!

వార్తలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో మంచితనం వుంది. ప్రజల్లో చాలా మంచివాళ్లు ఉన్నారు. రాజకీయ నాయకుల్లో మంచి వ్యక్తులు వున్నారు. ఈ పరిస్థితి ప్రతి వ్యవస్థలో వుంది. డాక్టర్లు, పోలీసులు, వ్యాపారులు, న్యాయవాదులు, అధికారులు అందరూ చెడ్డవాళ్లు కాదు. వాళ్లలో ఎంతోమంది మంచి వ్యక్తులు వున్నారు. మీడియాలోనూ అంతే!
ప్రతిరోజు చెడ్డ పనులు చేసేవాళ్లు ఎలా వున్నారో మంచి పనులు చేసే వ్యక్తులు అట్లాగే ఉన్నారు. మనుషుల పట్ల దయ, ప్రేమ వున్న వ్యక్తులతో పాటూ అవి కన్పించని వ్యక్తులూ వున్నారు.
చాలామంది మంచి విషయాలని, ఆశావహ విషయాలకన్నా, వ్యతిరేక భావనలు వున్న విషయాల పట్ల ఎక్కువ ఆకర్షితులవుతారు. చాలామంది ఆ విధంగా ఆకర్షితులు అయ్యే విధంగా చాలామంది పనిచేస్తూ ఉంటారు. అందులో ప్రధాన పాత్ర మీడియా పోషిస్తుంది. దానికి సహకారం అందిస్తున్నది సినిమా ప్రపంచం.
ఏ రోజూ వార్తాపత్రికను తిరగేసినా మంచి వార్తలు ప్రధాన వార్తలుగా కన్పించవు. నెగెటివ్ వార్తలే ప్రధాన వార్తలుగా కన్పిస్తాయి. ఓ నాయకుడు ఇంకో నాయకుడిని తిట్టిన వార్తలు, దుమ్మెత్తి పోసిన వార్తలు ప్రధాన శీర్షికల్లో కన్పిస్తాయి. అవినీతి ఆరోపణలు, నిందలు లాంటి వాటికి దక్కిన ప్రాధాన్యం మిగతా వార్తలకు మిగతా వాటికి దక్కదు.
హత్యలు, దోపిడీలు, ఎన్‌కౌంటర్లు, రేప్‌లు, దొంగతనాల వార్తలకి అత్యంత ప్రాధాన్యత లభిస్తుంది. కోట్ల కొద్ది కొత్తనోట్లు, కిలోల కొద్ది బంగారం దొరికిన శేఖర్‌రెడ్డి ప్రధాన వార్తల్లో కన్పిస్తాడు. అమ్మ ముందు, చిన్నమ్మ ముందు వంగి వంగి దండాలు పెట్టిన ఫొటోలు ప్రధానంగా ప్రత్యక్షమవుతాయి. ఆడంబరంగా వివాహం చేసిన వ్యక్తుల ఫొటోలు విరివిగా కన్పిస్తాయి. నల్లడబ్బు కుబేరుల జీవిత చరిత్రలు పేజీల నిండా కన్పిస్తాయి. సెక్స్ స్కాండల్స్, స్కాముల ప్రాముఖ్యత గురించి అవసరం లేనే లేదు. యాక్సిడెంట్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. లారీలు ‘్ఢ’ నలుగురు ‘్ఢ’లాంటి హెడ్డింగ్‌లతో అదరగొట్టేస్తారు.
ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తరువాత ఇలాంటి వార్తలు బాగా పెరిగిపోయాయి. ఒకే వార్త గంటల కొద్ది ప్రసారితమవుతుంది. ఇలాంటి వార్తలకి ప్రాముఖ్యం ఇచ్చి ఏం సాధిస్తారో తెలియని పరిస్థితి. ఒక పత్రికను చూసి మరో పత్రిక, ఒక టీవీ చానల్‌ని చూసి మరో టీవీ చానల్ పోటీ పడుతూ ఉంటాయి. ఇది ఓ అంతులేని వింత ప్రహసనం.
సిన్సియర్‌గా ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వ్యాపారుల ఫొటోలు పత్రికల్లో కన్పించవు. ఓ రైలు యాక్సిడెంట్ జరగకుండా కాపాడిన గ్యాంగ్‌మెన్ ప్రధాన వార్త అయ్యే అవకాశం లేదు. ఉచితంగా రోగులకి చికిత్స అందజేస్తున్న డాక్టర్ గానీ సంస్థలు గానీ ప్రముఖ వార్తగా మారే పరిస్థితి లేదు. ఒకరైనా ఓ మంచి పని చేస్తే అది మొదటి పేజీలో వస్తే ఎంత బాగుంటుంది. ఆశావహ దృక్పథం వున్న వార్తలు దినపత్రికల్లో ప్రధాన వార్తలుగా చలామణి అయితే మరెంత బాగుంటుంది. ఇలాంటి వార్తలు చూసి తమ వైఖరులు మార్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది.
నెగెటివ్ ప్రపంచం పాజిటివ్‌గా మారే అవకాశం ఏర్పడుతుంది.

- జింబో 94404 83001