ఓ చిన్నమాట!

కుటుంబం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుటుంబం అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైంది. కుటుంబం లేకుండా ఒంటరిగా జీవించడం అంత సులువైన విషయం కాదు. చాలామంది పెద్దవాళ్లు వృద్ధాశ్రమాలకి వెళ్తున్నారు. కాదు. వాళ్లు ఆ విధంగా వుండే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు కొత్తగా వస్తున్న ఆశ్రమాల్లో అన్ని సౌకర్యాలు ఉంటున్నాయి. సరైన సమయానికి టిఫిన్, భోజనాలు, వైద్య సదుపాయాలు ఇట్లా ఎన్నో. కానీ ఆ పెద్దవాళ్లల్లో ఏదో కన్పించని బాధ. ప్రేమను కోల్పోయామన్న వ్యధ, వాళ్లని వెంటాడుతుంది.
అదే విధంగా అనాధ ఆశ్రమం చూసినప్పుడు కూడా ఇలాంటి భావనే కలుగుతుంది. ఆ చిన్నపిల్లల చుట్టూ వాళ్ల బాగోగులు చూడ్డానికి చాలామంది వ్యక్తులు ఉండవచ్చు. కానీ అమ్మలాంటి వ్యక్తి లేదు కదా. వాళ్లు ఎంతో ప్రేమని, రక్షణని ఇచ్చినప్పటికి తల్లి ఇచ్చిన ప్రేమని వాళ్లు ఇవ్వగలరా? తండ్రి ఇచ్చే రక్షణని వాళ్లు ఇవ్వగలరా?
ఈ రెండు ఆశ్రమాలని దృష్టిలో పెట్టుకొని ఒక్క క్షణం ఆలోచిస్తే ఇంట్లో వున్న పిల్లలకి తాము ఎంత అదృష్టవంతులో అర్థమవుతుంది. పెద్దవాళ్లకి కూడా ఈ విషయమే స్పష్టమవుతుంది. ఇంట్లో కలుగుతున్న చిన్నచిన్న అసౌకర్యాలు అసౌకర్యాలుగా అన్పించవు.
కుటుంబంలో మనం ఎన్నో విషయాలని నేర్చుకుంటాం. క్రమశిక్షణ, విధేయత, అలవాట్లు, సేవ, మానవత్వం ఇట్లా ఎన్నో విషయాలని ఎవరూ చెప్పకుండానే తెలుసుకునే వీలవుతుంది. అదే విధంగా ఎదుటి వ్యక్తుల కోసం రాజీపడటం, ప్రేమని పంచడం, సహాయం చేయడం, గౌరవించడం లాంటి విషయాలు కూడా బోధపడుతాయి. పెద్దవాళ్ల అనుభవాల వల్ల ఎన్నో విషయాలు, విలువలు తెలుస్తాయి. అందుకే కుటుంబం అవసరం ఏర్పడింది. ఒకరికి మరొకరు ఎంతో అవసరం. అది పిల్లలకి పెద్దవాళ్లకే కాదు. అందరికీ ఇది వర్తిస్తుంది.
ఒక్క క్షణం ఆలోచిస్తే కుటుంబం విలువ మనకు అర్థమవుతుంది. అమ్మ మన అవసరాలని చూస్తుంది. భోజనం దగ్గర నుంచి పడుకునేదాకా అమ్మ మనల్ని పట్టించుకుంటుంది. నాన్న కూడా అంతే! మంచి స్నేహితులు లేరని కొంతమంది బాధపడుతూ ఉంటారు. కాస్త ఆలోచిస్తే సోదరిలాగా, సోదరునిలాగా వుండే స్నేహితులు ఎవరైనా ఉంటారా? కొన్నిసార్లు అమ్మానాన్నలకన్నా మించిన స్నేహితులు ఎవరికైనా దొరుకుతారా? మన బలహీనతలని, మన తప్పులని, మన రహస్యాలని వాళ్లు దాచుకున్నంతగా మరెవరైనా దాచుకోగలరా? మన తప్పులని మన బలహీనతలని మన్నిస్తూ మనల్ని ప్రేమించే వ్యక్తులు కుటుంబంలోని వ్యక్తులకన్నా ఇంకా ఎవరైనా ఉంటారా? ఈ ప్రపంచంలో. ఈ విషయం గుర్తిస్తే కుటుంబం వున్న వ్యక్తులు ఆనందంలో తేలిపోవాల్సి ఉంటుంది.
కుటుంబంకన్నా ముఖ్యమైంది, విలువైనది ఏదీ లేదు ఈ ప్రపంచంలో. ఈ మాటని సరైన దృక్పథంతో తీసుకోవాలి. కుటుంబం మన వెంట ఉంటే అసంతృప్తులు, ఒంటరితనాలు, బాధలు, వ్యధలు దూరమవుతాయి.
అందుకే కుటుంబంతో గుణాత్మకమైన సమయాన్ని కేటాయించాలి. అందరూ చేయాల్సిన పని ఇదే.

మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, రచనలు, కార్టూన్లు, ఫొటోలు bhoomisunday@deccanmail.comకు పంపించవచ్చు.

-జింబో 94404 83001