ఓ చిన్నమాట!

ప్రయాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలా కాలం నుంచి ‘లా’ పుస్తకాల షాపుల వైపు వెళ్లలేదు. న్యాయమూర్తిగా ఉన్నప్పుడు తరచూ వెళ్లేవాడిని. పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యునిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ‘లా’ పుస్తకాల షాపుల వైపు వెళ్లడం చాలా తగ్గింది.
తెలుగులో చాలా ‘లా’ పుస్తకాలు రాశాను. వాటిని ఈ రోజుకి తగినట్టుగా కొత్త తీర్పులతో మార్పులు చేయమని నా పబ్లిషర్స్ చాలా కాలం నుంచి కోరుతున్నారు. ఆ పనిని పూర్తిగా ఆలస్యం చేశాను. కొత్త పదవిలో చేరినా ఆలస్యం చేయాల్సిన పనిలేదు. కానీ అలా జరిగిపోయింది.
ఈ మధ్య ‘లా’ పుస్తకాల షాపు వైపు వెళ్లాను. నా అన్ని పుస్తకాలు రీ ప్రింటులో కన్పించాయి. తెలుగులో రీప్రింట్‌లు కొంటారు. ఇంగ్లీష్‌లో అంతగా కొనరు. ఎందుకంటే తెలుగులో సులువుగా చదివించే ‘లా’ పుస్తకాలు చాలా తక్కువ.
దాదాపు వంద ‘లా’ పుస్తకాలు రాయాలని, తెలుగులో ‘లా’ డిక్షనరీ రాయాలని నా కోరిక. ఆ విషయాన్ని దాదాపు మర్చిపోయాను. పబ్లిషర్స్ నుంచి వస్తున్న స్పందనని చూసిన తరువాత మళ్లీ నా గోల్స్ గుర్తుకు వచ్చాయి. ఒక్కసారి జూలు విదిల్చాను.
పని చేయడానికి వయస్సుతో పనిలేదు. మనుషులు వయస్సుని బట్టి ఆలోచిస్తారు. కానీ పక్షులు, జంతువులు ఆ విధంగా ఆలోచించవు.
సింహం ఉదయం లేవగానే తన వేటను ప్రారంభిస్తుంది.
పెంగ్విన్స్ మంచి చేప కోసం నీటిలో వెతుకుతూ ఉంటాయి.
తేనెటీగలు మకరందం వున్న పుష్పాల కోసం తిరుగుతూ వుంటాయి.
కానీ మనిషి...
మనిషి కూడా వాటిలాగా మారిపోవాలి.
లక్ష్యాలు మన దరి చేరవు.
మనమే లక్ష్యాల వైపు పరుగు తీయాలి.
ఇప్పుడు నేను చేస్తున్నది అదే పని.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001