ఓ చిన్నమాట!

రిహార్సల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నప్పుడు ఒకే ఒక నాటకంలో వేషం వేశాను. దాదాపు 15 రోజులు రోజూ ఓ గంట ప్రాక్టీస్ చేశాం. ఎందుకంటే డైలాగులు నోటికి రావాలి. ఎక్కడా తడబడకూడదు.
ఆ తరువాత ఒక రోజు ముందు డ్రెస్ రిహార్సల్ చేశాం. ఆ తరువాత నాటకం విజయవంతం అయ్యింది.
పోలీసు అకాడెమీలో పని చేస్తున్నప్పుడు కూడా పోలీసులు కూడా పరేడ్ రిహార్సల్ చేయడం చూశాను. ఒక రోజు ముందు వాళ్లు కూడా రిహార్సల్ చేయడం చూశాను.
రిహార్సల్ పేరు ఇప్పుడు కొన్ని విషయాల్లో మారిపోయింది. నేరం చేసే విషయంలో దుండగులు రెక్కీ నిర్వహిస్తారు. ఆ తరువాత చర్యలోకి దిగుతారు.
రిహార్సల్‌ని రెక్కీతో పోల్చడంలోని సామ్యం బాగులేదు. కానీ ప్రతి దానికి రిహార్సల్ ఉండదు.
రిహార్సల్ అనేది జీవితం మాత్రమే.
డ్రెస్ రిహార్సల్‌లో తప్పు చేస్తే తుది నాటకంలో సరి చేసుకోవచ్చు. కానీ జీవితం అలాంటి అవకాశం ఇవ్వదు.
చేసిన తప్పిదాలను సరిదిద్దుకోవాల్సిందే. కొన్ని సరిదిద్దుకోలేం. అందుకని అప్పుడప్పుడు ఇలా అనుకుంటాం.
ఓ సంవత్సరం, ఓ పది సంవత్సరాలు వెనక్కి తిరిగితే బాగుండునని అనుకుంటాం.
తమ జీవితంలో ఎప్పుడో ఒకసారి అందరూ అనుకుంటారు.
గడియారం వెనక్కి తిరగదని తెలుసు.
అయినా అలా అనుకుంటాం.
మన జీవితంలో లైట్లని ప్రత్యేకంగా వేయరు. అవి వేసే వుంటాయి.
తెర పైకి ఎత్తరు.
ఎత్తే ఉంటుంది.
ప్రేక్షకులు ప్రత్యేకంగా టికెట్లు కొనుక్కొని రారు.
వాళ్లు ఇదివరకే అక్కడ వున్నారు.
ఓ నవలా రచయిత అన్నట్టు జీవితంలో డ్రెస్ రిహార్సల్స్ ఉండవు.
రెండో అవకాశం రాదు. వస్తుందో రాదో చెప్పలేం.
అందుకని నాటకంలో నటిస్తున్నట్టు జీవించాలి.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001