ఓ చిన్నమాట!

తల్లి కోడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా ఇల్లు చాలా పెద్దగా వుండేది. తొమ్మిది అర్రలు (గదులు) వుండేవి. మా తాతకి ఓ అర్ర వుండేది. దాన్ని ‘తాతర్ర’ అనేవాళ్లం. ఆయన చనిపోయిన తరువాత ఆ గది ఖాళీగా వుండిపోయింది. అది చాలా చిన్న అర్ర. ఓ మంచం, ఓ అల్మైరా ఓ చిన్న బెంచి పట్టే విధంగా ఉండేది.
మా తాత చనిపోయిన తరువాత ఎక్కువగా వాడని వస్తువులని అందులో పెట్టేవాళ్లు. అందులో ముఖ్యమైంది ‘పాతాళగరిగె’.
మా ఇంటి రెండు వైపులా చాలా ఖాళీ స్థలం వుండేది. ఒకవైపు మా బర్రెలను (గేదెలు) వుంచేవాళ్లు. రెండో వైపు ఉన్న స్థలంలో మల్లె చెట్టు, సంపెంగ చెట్టు, దానిమ్మ చెట్టు, బాదం చెట్టు ఇట్లా వుండేవి. ఇవి వుండగా ఓ పెద్ద బావి, ఇంకా చాలా స్థలం వుండేది. మా ఇంట్లో చాలా కోళ్లు ఉండేవి. అవి ఎగరడానికి, తినడానికి ఈ స్థలం బాగా ఉపయోగపడేది. మా కోళ్లు కోడిగుడ్లను మాత్రం మా తాతర్రలో పెట్టేవి. కొన్ని కోడిగుడ్లు జమ అయిన తరువాత పొదుగు పట్టిన కోడి ఆ కోడిగుడ్లను పొదిగేది. ఇప్పటి తరానికి ఈ విషయం తెలియదు. ఆ పొదుగు పట్టిన కోడి ఆ కోడిగుడ్ల వైపు ఎవరన్నా వస్తే చాలా కోపంగా వాళ్ల వైపు వచ్చేది. పిల్లలు పుట్టిన తరువాత కూడా ఆ పిల్లలు తన రెక్కల క్రింద రక్షించేది. ఆకాశంలో గద్ద తిరగాడుతున్న పరిస్థితిని గమనించి తల్లికోడి చాలా కోపంగా వుండేది. పొదుగు పట్టిన నుంచి కోడిపిల్లలు పెద్దవి అయ్యేవరకు తల్లికోడి గొప్ప దీక్షను పట్టేది.
మన మనస్సు కూడా చాలా విషయాలను పొదుగుతుంది. తల్లి కోడిలా మనం కూడా దీక్షగా పొదగాలి.
అయితే కొత్త సృష్టికి ఉపయోగపడే విధంగా ఉండాలి.
మనం అవమానపడిన విషయాలని, గాయపడ్డ విషయాలని పొదిగితే అసంతృప్తి మనిషిగా తయారవుతాం.
చిన్నచిన్న విజయాలను, సంతోషాలను, పరిష్కారాలను పొదిగితే సంతృప్తి కలిగిన మనిషి మిగులుతాడు. చెడు ఆలోచనలని, అసంతృప్తులని వెంటాడే తల్లి కోడిలా పరిణామం చెందుతాడు.
మన మనస్సులో ఏమి పొదుగుతామన్నది ముఖ్యం.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001