ఓ చిన్నమాట!

వయస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వయస్సు అనేది ఒక సంఖ్య మాత్రమే. మనస్సుకి వయస్సు లేదు’ ఈ మాట అన్నది భారతీయ అమెరికన్ భక్తవార్‌సింగ్ బ్రార్. అతని వయస్సు 105 సంవత్సరాలు. ఇటీవలె అతను తన జన్మదిన సంరంభం జరుపుకున్నాడు. ఆయన జరుపుకోలేదు. ఆయన వ్యవసాయ క్షేత్రంలో పని చేస్తున్న ఉద్యోగులు ఆయన జన్మదిన ఉత్సవాన్ని జరిపారు.
భక్తవార్ సింగ్ బ్రార్ గతంలో ఇండియన్ ఆర్మీలో సైనికునిగా పని చేశాడు. పదవీ విరమణ చేసిన తరువాత అతను పెన్షన్ కోసం ఆశించలేదు. తాను పని చేస్తాను. సంపాదిస్తాను. బతుకుతాను అని అన్న వ్యక్తి. బ్రార్ కుమారుడు అమెరికాలోని కాలిఫోర్నియా నివాసి. అక్కడ ఆయనకు 18000 ఎకరాల వ్యవసాయ క్షేత్రం వుంది. 1980వ సంవత్సరంలో తన 68వ ఏట అమెరికాకు వెళ్లాడు బ్రార్. అప్పటి నుంచి కొడుకు వ్యవసాయ క్షేత్రంలో రైతుగా పని చేస్తున్నాడు. అతని వ్యవసాయ క్షేత్రాన్ని పర్యవేక్షిస్తున్నాడు. కొడుకు వ్యవసాయ క్షేత్రాన్ని అతను 2006 నుంచి పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నాడు.
క్రియాశీలకంగా పని చేయడమే జీవితమే, జీవితమే క్రియాశీలకమని అంటాడు బ్రార్. బ్రార్ ఇంకా ఇలా అంటాడు ‘ఎవరైతే కాలాన్ని వృథా చేస్తారో వాళ్లు వాళ్లను కోల్పోతారు.’
బ్రార్ జన్మదినాన్ని ఓ ఉత్సాహవంతంగా అతని దగ్గర పనిచేసే ఉద్యోగులు జరిపారు. బ్రార్ మాటలు ఆశాజనకంగా, రిటైర్‌మెంట్ అనేది జీవితంలో వుండదన్న అభిప్రాయం ఆయన జీవితాన్ని పరిశీలించిన వ్యక్తుల్లో బలపడుతుంది.
‘ఏ వ్యక్తి జీవితంలో నిరుపయోగంగా పరిణమించడు. కాకపోతే అతని నిర్వహణలో వయస్సురీత్యా హెచ్చుతగ్గులు వుండవచ్చు. ఎవరైనా తమ దేశం కోసం ఎంతో కొంత మంచి చేయడానికి అవకాశం వుంటుంది. ఇలాంటి విషయాలు ఎన్నో బ్రార్ చెబుతాడు.
బ్రార్ సెలవు తీసుకోడు. తన జన్మదినం నాడు కూడా సెలవు తీసుకోలేదు. అంతేకాదు. ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు ఆఫీసుకి వచ్చి పని చేస్తాడు.
105 సంవత్సరాల వయస్సులో కూడా అతని జ్ఞాపకశక్తి బాగా వుంది. ఆరోగ్యంగా వున్నాడు. వీటన్నింటికి కారణం అతను పని చేయడమే. వయస్సుని మరచిపోవడమే. ఆరోగ్యం సహకరించినంత కాలం పని చేస్తూ వుండాలి.
యువకులతో పోటీ పడాలి.
వయస్సుతో పోటీ పడాలి.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001