ఓ చిన్నమాట!

శక్తి సామర్థ్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యాయశాస్త్రానికి సంబంధించి తెలుగులో చాలా పుస్తకాలు రాశాను. వ్యాసాల సంగతి చెప్పాల్సిన పనిలేదు. లెక్కలేనన్ని రాస్తూనే వున్నాను.
కథలూ, కవిత్వం వాటికి అదనం. అవి ఓ పది పుస్తకాలు వచ్చాయి.
వారంలో మూడు కాలమ్స్ రాసిన సందర్భాలు కూడా వున్నాయి. తీర్పులు చెబుతూ, న్యాయమూర్తి విధులను నిర్వహిస్తూ ఇన్ని పుస్తకాలూ, కాలమ్స్ రాయడం చాలామందికి ఆశ్చర్యం కలిగించేది. అప్పుడప్పుడు నాకు ఆశ్చర్యం కలిగేది.
నేను మేజిస్ట్రేట్‌గా పని చేస్తున్నప్పుడు న్యాయమూర్తి ఉద్యోగం కోసం పోటీ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకి కొన్ని క్లాసులను తీసుకున్నాను. అక్కడ నా పుస్తకాల ప్రస్తావన కూడా వచ్చేది.
అందరూ ఆశ్చర్యపోయేవారు.
చాలామంది అభ్యర్థులు తరచూ నన్ను ఒక ప్రశ్న అడిగేవాళ్లు - ‘ఇంత సమయం మీకు ఎలా లభిస్తుంది?’
సమయం లభించడం అంటూ ఏమీ ఉండదు.
ఎవరికైనా వుండేది 24 గంటలే.
మన ప్రాధాన్యతలు మన పురోగతిని ఏర్పరుస్తాయి.
జీవితంలో ఎన్నో సంఘటనలు వుంటాయి. ఎన్నో ఇష్టాలు ఉంటాయి.
సినీమాలు, షికార్లు, టీవీలు, ఆటలు, మిత్రులతో బాతాఖానీలు ఇట్లా ఎన్నో వుంటాయి. అన్నీ ముఖ్యమని అనుకుంటే కుదరదు. అట్లా అని అవి వదులుకోవాలని నేను అనడం లేదు.
మనం ఒక వాలుకుర్చీలో కూర్చొని ఆలోచిస్తుంటేనో, రిక్లైనర్‌లో కూర్చొని టీవీ చూస్తుంటేనో ఫలితం వుండదు.
మనం నిరంతరం పని చేస్తూ వుండాలి. అభివృద్ధి కోసం పాటుపడుతూ వుండాలి. మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి.
తమ శక్తి సామర్థ్యాలను సంపూర్ణంగా ఏ విజేత కూడా ఉపయోగించడం లేదు. ఇది వాస్తవం.
ఇదే మాట నేను వాళ్లతో చెప్పేవాన్ని.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001