AADIVAVRAM - Others

మబ్బులు (సండేగీత )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడప్పుడు -
ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటాయి.
ముఖ్యంగా
ఇలాంటి దృశ్యాలు వర్షాకాలంలో ఎక్కువగా కనిపిస్తాయి.
ఆ మబ్బుని చూసి
రైతులు ఆశపడతారు
వర్షం పడుతుందని.
చాలాసార్లు
వర్షం పడదు
మబ్బులు తేలిపోతాయి.
రైతు నిరుత్సాహపడతాడు.
మనుషులు కూడా
మబ్బుల మాదిరిగా కన్పిస్తారు.
జీవితంలో
బాగా ఎత్తుకు ఎదిగిపోతారని
పెద్దవాళ్లు భావిస్తారు.
కొంతమంది మాత్రమే
వర్షం మాదిరిగా కురుస్తారు.
చాలామంది తేలిపోతారు.
అలా తేలిపోకూడదు.
మబ్బులు రైతును నిరుత్సాహపరచవచ్చు
మనం
పెద్దవాళ్లని నిరుత్సాహపరచకూడదు.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001