ఓ చిన్నమాట!

కృతజ్ఞతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను హైదరాబాద్‌లో పని చేసిన తరువాత తిరుపతికి బదిలీ అయ్యింది. తిరుపతి మేజిస్ట్రేట్‌గా పని చేయాలని చాలామంది ఉత్సాహపడతారు. కానీ అలాంటి ఉత్సాహం కలుగలేదు. కారణాలు అనేకం. అక్కడ వుండే ప్రొటోకాలు పనులు. అందులో ముఖ్యమైనది. వారం రోజుల్లో ఒక్కరోజు కొండ పైన కోర్టు నిర్వహించాలి. ఆ రోజు మాత్రం ఉత్సాహంగా ఉండేది. కొండపైకి వెళ్తుంటే ఉండే అనుభూతి ఒకటైతే, వి.ఐ.పి దర్శనం మరొకటి.
మిత్రులు, బంధువులు, రచయిత మిత్రులు ఎవరు తిరుపతికి వద్దామని అనుకున్నా వాళ్లని శుక్రవారం ఉదయం వచ్చే విధంగా రమ్మని చెప్పేవాడిని. అలా వచ్చిన వ్యక్తులకి నాతోపాటూ మంచి దర్శనం లభించేది. చాలామంది రచయిత మిత్రులు అదే విధంగా వచ్చేవాళ్లు.
ఓ శుక్రవారం ఇద్దరు సీనియర్ కథా రచయితలు తిరుపతికి వచ్చారు. రాజారాంగారు, మేమందరం కలిసి కొండకి వెళ్లాం. దర్శనం చేసుకున్నాం. హారతి కూడా ఇచ్చారు. ఆ తరువాత వస్త్రాల గదిలోకి తీసుకొని వెళ్లాను. దేవునికి కట్టిన వస్త్రాలను మనకి ఇస్తే కళ్లకి అద్దుకుని తిరిగి ఇవ్వాలి. అదొక పరిమళ అనుభూతి. ఆ ఇద్దరు సీనియర్ రచయితలకి, మధురాంతకం రాజారాం గారికి అదొక కొత్త అనుభూతి. ఆ రోజంతా ఆ విషయమే మాట్లాడినారు.
ఆ ఇద్దరు సీనియర్ రచయితలు హైదరాబాద్ వెళ్లిపోయిన తరువాత ఉత్తరాలు రాశారు. ఆ ఉత్తరాలు ఎంత సంతోషాన్ని ఇచ్చాయో చెప్పలేను. ‘ఎరుక ఏడుళ్ల పెట్టు’ అని ఒకరు కృతజ్ఞతలు వ్యక్తపరుస్తే, మరొకరు మరో రకంగా కృతజ్ఞతలు వ్యక్తపరిచారు. తిరుపతి నుంచి వెళ్లే ముందే వాళ్లు కృతజ్ఞతలు చెప్పారు. అయినా ఉత్తరాలు రాసి మళ్లీ కృతజ్ఞతలు వ్యక్తపరిచారు. అన్నింటిలోనూ వాళ్లు పెద్దవాళ్లు. అందులో ఒకరు సంపాదకులు. అయినా ఉత్తరాలు రాసి కృతజ్ఞతలు మరీ వ్యక్తపరిచారు. అది వారి వ్యక్తిత్వం. అవి మరువలేని ఉత్తరాలు.
కృతజ్ఞతలని వ్యక్తపరచడం చాలా అవసరం. మనకు సహాయం చేసిన వ్యక్తులకి కృతజ్ఞతలు చెప్పడం ధర్మం. అదేదో నాలుక మీది నుంచి కాకుండా హృదయం నుంచి చెప్పాలి.
మన జీవితంలో మంచి మలుపు తిప్పిన వ్యక్తులకి మనం కృతజ్ఞతలు తెలియజెప్పడం ఎంత ముఖ్యమో, మనల్ని ఆనందంగా ఉంచే వ్యక్తులకి కృతజ్ఞతలు చెప్పడం ఇంకా ఎంతో అవసరం.
మీరు బాగా చదువుకోవడానికి సహాయం చేసిన వ్యక్తులకి మీరు కృతజ్ఞతలు చెప్పారా? మనం మన స్థాయిలో అభివృద్ధి చెందడానికి సహాయం చేసిన వ్యక్తులకి కృతజ్ఞతలు చెప్పడం ఎంతో అవసరం.
జీవితంలో ఆనందం పొందడానికి ఎన్నో సాధనాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైంది కృతజ్ఞతలు చెప్పడం. ఆనందానికి మించి కృతజ్ఞతలు చెప్పడం. కృతజ్ఞతలు పొందడంలో ఇంకా గొప్ప ఆనందం ఉంటుంది. అది మన చేతిలో లేదు. కాని కృతజ్ఞతలు చెప్పడం మన చేతిలోని పని.
ఇది చదివిన మీ అందరికీ నా కృతజ్ఞతలు - ధన్యవాదాలు.

-జింబో 94404 83001