ఓ చిన్నమాట!

మంచి వ్యక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2013వ సంవత్సరం డిసెంబర్‌లో లీవ్ ట్రావెల్ కనె్షషన్ మీద గుజరాత్ వెళ్లాం. ద్వారక నుంచి పోర్‌బందర్ వెళ్లాం. అక్కడి నుంచి సోమ్‌నాథ్ వెళ్లాలి.
సోమ్‌నాథ్ నుంచి కోర్టు సిబ్బంది ఫోన్ చేసి ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లలో ఖాళీలు లేవని, దర్శనం కోసం ఇబ్బంది లేదని చెప్పారు. మంచి హోటల్స్ కూడా నిండిపోయాయని, మామూలు హోటళ్లు దొరుకుతాయని, అయితే వాటి ధరలు ఎక్కువగా వున్నాయని చెప్పారు. ఏదో ఒక హోటల్ బుక్ చెయ్యమని చెప్పేలోపు ఒక ఆలోచన వచ్చింది. సోమ్‌నాథ్ నుంచి డయ్యూ 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. డయ్యూ కూడా చూసినట్టు ఉంటుంది. అక్కడ ఈ రాత్రికి వుంటే బాగుంటుందేమోనని అన్పించింది. ఇంటర్‌నెట్‌లో కోర్టు నెంబర్ వెతికాను. అక్కడ న్యాయమూర్తి సెలవులో వున్నారు. పోలీసు అధికారుల లిస్ట్ చూశాను. అందులో ఒక తెలుగు పేరు కన్పించింది. ఆయన పేరు రమేష్. డయ్యూలో డీఎస్పీగా పని చేస్తున్నాడు.
నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సెషన్స్ జడ్జినని చెప్పి డయ్యూలో వసతి గురించి అడిగాను. ‘ఈ రాత్రి ఇక్కడి దాకా అవసరం లేదు సార్! దగ్గర్లో సిద్దూ సిమెంట్ గెస్ట్ హవుస్ ఉంది. వాళ్ల పి.ఆర్.ఓ.కి చెబుతాను. మీరు ఈ రాత్రి అక్కడ ఉండి రేపుదయం ఇక్కడి వచ్చేద్దురూ’ అన్నాడు.
ఆ సిమెంట్ ఫ్యాక్టరీ పి.ఆర్.ఓ. నెంబర్‌ని నాకు షేర్ చేశాడు. నేను ఫోన్ చేద్దామని అనుకునేంతలో ఆ పి.ఆర్.ఓ ఫోన్ చేశాడు. గెస్ట్ టహౌస్ ఉందని, ఎలాంటి సమస్యా లేదని, మంచి కుక్ కూడా గెస్ట్ టహౌస్‌లో వున్నాడని చెప్పాడు.
సోమ్‌నాథ్‌లో దర్శనం చేసుకొని దగ్గర్లో వున్న గెస్ట్‌హౌస్‌కి వెళ్లాం. చాలా బాగుంది. మంచి భోజనం. మంచి వసతి. ఎక్కడో ఓ చిన్న హోటల్‌లో వుండాల్సిన పరిస్థితి తప్పింది.
ఎక్కడి హైదరాబాద్? ఎక్కడి సోమ్‌నాథ్? ఎక్కడి డయ్యూ? ఎక్కడి రమేష్? రమేష్ తెలుగువాడు కాదు. అతను తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఉద్యోగరీత్యా అక్కడ పని చేస్తున్నాడు.
నేను న్యాయమూర్తి కావడం వల్ల అతను పోలీస్ అధికారి కావడంవల్ల సహాయం చేశాడని అనుకోవచ్చు. కానీ అతనికి నాతో ఏం పని ఉంటుంది?
ఈ కథనంతో చెప్పే విషయం ఏమిటంటే - మంచి మనుషులు ఈ ప్రపంచంలో ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్లకి కొదువలేదు. వాళ్లని మనం కనుగొనాలి.
వాట్సప్‌ల నుంచి
వార్తల నుంచి
సీరియల్స్ నుంచి బయటపడి లోకాన్ని చూడాలి.
అంతే! ఇది ఒక ఉదాహరణ మాత్రమే.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001