ఓ చిన్నమాట!

అయినప్పటికీ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో ఓ రెండు పదాలు వున్నాయి. ఆ మాటకొస్తే అవి అన్ని భాషల్లోనూ వున్నాయి. అవి ‘కానీ’, ఎందుకంటే.
నేను పరీక్ష పాస్ కాలేదు ఎందుకంటే...
నాకు ఉద్యోగం రాలేదు ఎందుకంటే..
నా పుస్తకానికి ప్రైజ్ రాలేదు ఎందుకంటే..
ఆ సమయంలో నేను సరైన నిర్ణయం తీసుకోలేదు ఎందుకంటే...
ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు.
కానీ కొంతమంది ఈ పదాన్ని వాడరు. వాళ్లు ఉపయోగించే పదం ‘అయినప్పటికీ.’
నాకు కాలు విరిగింది అయినప్పటికీ...
నా ఆర్థిక స్తోమత బాగోలేదు అయినప్పటికీ...
నాకు అండదండలు లేవు అయినప్పటికీ..
అని విజయాలు సాధిస్తారు. అయినప్పటికీ అన్న పదం విన్నప్పుడు మనకి చాలామంది గుర్తుకు వస్తారు. వారిలో ముద్దసాని రాంరెడ్డి ఒకరు. ఆయన కరీంనగర్ జిల్లాలోని ఊటూరు గ్రామానికి చెందిన వ్యక్తి. పౌర సంబంధాల శాఖలో పనిచేసేవాడు. అంతకు ముందు ‘గోల్కొండ’ పత్రికలో పనిచేశారు. జర్నలిజమ్ పట్ల సాహిత్యం పట్ల చాలా మక్కువ వున్న వ్యక్తి. ఓసారి ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ వస్తున్నప్పుడు రోడ్డు ప్రమాదంలో ఆయన వెన్నుపూసకు గాయాలై మంచానికే పరిమితమై పోయాడు. తన స్వగ్రామం ఊటూరుకు ముగ్గురు పిల్లలతో వెళ్లిపోయాడు. నడుము నుంచి క్రింది భాగం పనిచేయదు. అన్నింటికీ భార్యే ఆధారం.
అయినప్పటికీ-
ఆయన ధైర్యం కోల్పోలేదు. మంచానికే పరిమితమైన జీవితాన్ని విశ్వవ్యాపితం చేశారు. కలం తీసుకొని రచనలు ప్రారంభించాడు. అంతకు ముందు ఆయన వ్యాసాలకే పరిమితమైన వ్యక్తి సాహిత్యం వైపు దృష్టి మరల్చాడు. సురవరం ప్రతాపరెడ్డి జీవితం - రచనలు అన్న పుస్తకం రాయమని సాహిత్య అకాడెమీ ప్రకటన చూసి రచనలు ప్రారంభించారు. ఆయన రాసిన పుస్తకానికి ఎల్లూరి శివారెడ్డి గారితో బాటూ ప్రథమ బహుమతి వచ్చింది.
ఆ తరువాత తెలుగు అకాడెమీ ప్రకటన చూసి అరవిందుని మీద పుస్తకం రాసి బహుమతి పొందారు. భారతీయ స్వాతంత్య్ర ఉద్యమం గురించి ఆయన రాసిన పుస్తకానికి దేశ స్థాయిలో మూడవ బహుమతి వచ్చింది. ఆ తరువాత, సాహిత్య అకాడెమీ, నేషనల్ బుక్ ట్రస్ట్ పుస్తకాన్ని ఇంగ్లీషు, హిందీ భాషల నుంచి భాషాంతీకరణ చేశారు.
మంచంలో పడుకొనే ఆయన తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించాడు. పుస్తకాలు, ఫోన్, వీల్‌ఛైర్, ఆయన భార్య, ఆయన సన్నిహితులు.. మంచం నుంచి కదలలేని పరిస్థితుల్లో వున్నా ఆయన రచనలు కొనసాగించి తెలుగు సాహిత్యంలో ఆయన స్థానాన్ని ఏర్పరచుకున్నారు.
ఎందుకంటే అన్న పదానికి ప్రాముఖ్యతని ఇవ్వకుండా, అయినప్పటికీ అన్న పదానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
ఏమంటారు?
ఆయనపై ఓ చిత్రరూపకాన్ని వారాల ఆనంద్ తీశారు. యూట్యూబ్‌లో వుంది ఆసక్తి కలిగిన వాళ్లు చూడొచ్చు.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001