ఓ చిన్నమాట!

అన్నీ సక్రమంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజూ తొమ్మిదింటికి భోజనం చేస్తాం. ఓపిక వుంటే మా ఆవిడ వంటిల్లు సర్ది చదువుకోవడానికి వెళ్తుంది.
తొమ్మిదింటి నుంచి పదింటి వరకు చదువుకోవడం అలవాటు. ప్రతిరోజూ ఇట్లాగే ఉంటుందని కూడా చెప్పలేను. సాధారణంగా ఇలాగే ఉంటుంది.
పదింటి తరువాత చదివిన పుస్తకాలని సర్ది పడుకుంటాను. ఓపిక లేకపోతే అవి అలాగే చిందర వందరగా ఉంటాయి.
ఉదయం లేచిన తరువాత నా టేబిల్‌ని శుభ్రంగా సర్దుకుంటాను. ఎక్కడి పుస్తకాలు అక్కడకు వెళతాయి.
వంటిల్లూ కూడా శుభ్రమవుతుంది.
సింక్ తళతళ మెరుస్తుంది.
పని మనిషి రాకతో ఇల్లంతా మిలమిలా మెరుస్తుంది. సూర్యుడిని చూసి మొగ్గలు విచ్చుకొని నవ్వినట్టు.
నిద్ర లేవగానే ఇల్లంతా శుభ్రంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కాంక్షిస్తారు. చిందర వందరగా వుంటే వాటిని ఒక క్రమంలో పెడతారు.
అవి ఆ క్రమంలో లేకపోతే ఆ రోజు అంత సులువుగా, సుఖంగా గడవదు.
వంటిల్లు సంగతి చెప్పాల్సిన పనిలేదు. అది శుభ్రం చేయకపోతే వాసన కూడా వస్తుంది.
ఇది ఒక్క వంటిల్లు
చదువుకునే రూంకి సంబంధించిన అంశం కాదు.
జీవితానికి సంబంధించిన అంశం.
ఫ్లవర్ వాజ్‌లో వుంచిన పుష్పం వాడిపోతుంది. దాన్ని తీసి కొత్త పుష్పాల్ని పెడతాం.
నిన్నటి మీద ఇంకా కొంచెం అందంగా కన్పించేట్టుగా అమరుస్తాం. అవి నిన్నటికన్నా అందంగా లేకపోయినా అందంగా కన్పించాలని కోరుకుంటాం.
ఆ దిశగా మనం ప్రయత్నం చేస్తాం.
మన ప్రయత్నంలో లోపం వుండకూడదు.
మన రోజులో కూడా అన్నీ సక్రమంగా వుండవు. వాటిని క్రమపద్ధతిలో వుండే విధంగా ప్రయత్నిద్దాం.
ఆదుర్దా అవసరం లేదు.
ఆందోళన అంతకన్నా అవసరం లేదు.
మన ప్రయత్నం మనం చేద్దాం.
మనం నిద్ర లేవగానే
అన్నీ సక్రమంగా వుండవు.
మనం సరి చేసుకోవాల్సిందే
ఒక్కోసారి సూర్యుడు కూడా మబ్బుల చాటున దాక్కుంటాడు.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001