ఓ చిన్నమాట!

అవ్యక్త శక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి మనిషిలోనూ అవ్యక్తమైన శక్తిసామర్థ్యాలు ఉంటాయి. వాటిని అతను వినియోగించుకోవడంలో విఫలం అవుతుంటాడు. ఆ శక్తిని, సామర్థ్యాలను అతను ఉపయోగించడానికి మరో వ్యక్తి అవసరమవుతాడు.
ఓ కొండ మీద చిన్న రాయి ఉందనుకుందాం. ఆ రాయిలో కూడా అవ్యక్తమైన శక్తి ఉంది. దాన్ని ఎవరైనా తోసివేసినప్పుడు అది క్రిందకు పరుగెడుతుంది. మొదట దాని చలనం మెల్లిగా ఉంటుంది. కొంత దూరం వెళ్లిన తరువాత వేగం పెరుగుతుంది. దానిలోని శక్తి బహిర్గతమవుతుంది. ఆ శక్తి చలనం ద్వారా వస్తుంది. ఆ శక్తి ఆ రాయికి రావడానికి కారణం - దాన్ని నెట్టడంవల్ల వచ్చింది. దారిలో ఏవైనా చిన్నచిన్న ఆటంకాలు ఎదురైనా అది తన చలన శక్తి ద్వారా కిందికి ప్రయాణం చేస్తుంది.
మనలో కూడా చాలామందికి ఇలాంటి నెట్టడమే అవసరం ఏర్పడుతుంది. అప్పుడు కానీ వాళ్ల ప్రయాణం మొదలవదు.
ఒక వ్యక్తికి మంచి జ్ఞాపకశక్తి ఉంటుంది. కానీ అంత జ్ఞాపకశక్తి ఉందని అతను అనుకోడు. ఎవరో ఒకరు గుర్తించి విడమరిచి చెప్పిన తరువాత అతనికి అతని మీద నమ్మకం ఏర్పడి అతని ప్రయాణం కొనసాగుతుంది.
ఇలా ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు.
మనలో చాలామందికి కావాల్సింది - చిన్నగా నెట్టడం. ఆ విధంగా నెట్టే వ్యక్తులు కావాలి. అలా నెట్టే వ్యక్తులు లేనప్పుడు వారి శక్తి సామర్థ్యాలు వృథా అయిపోతాయి.
ప్రతి వ్యక్తిలో ఆంజనేయునిలా అతనికి తెలియని శక్తి సామర్థ్యాలు ఉంటాయి.
ఆ సామర్థ్యాలు అతనికి వున్నాయని చెప్పే వ్యక్తి అవసరమవుతాడు.
నిజమే!
అలా చెప్పే వ్యక్తి లేనప్పుడు, ఆ వ్యక్తి శక్తిసామర్థ్యాలు వృథా కావల్సిందేనా?
మనకు మనం నెట్టుకొని మన అవ్యక్త ప్రజ్ఞాపాటవాలని పరుగెత్తించలేమా?

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001