ఓ చిన్నమాట!

ఇష్టమైన పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలు చదువు మీద దృష్టి కేంద్రీకరించకుండా మిగతా వాటి మీద దృష్టి కేంద్రీకరించినప్పుడు వాళ్లని పెద్దవాళ్లు నిరుత్సాహపరుస్తూంటారు. అందులో తప్పు కన్పించదు. పెద్దవాళ్ల ఉద్దేశం మంచిదే. చదువుకొని వృద్ధిలోకి రావాలన్నది పెద్దవాళ్ల కోరిక.
మరికొన్ని సందర్భాలలో పిల్లలు బాగానే చదువుతుంటారు. కొన్నిసార్లు సరదాపడి కొన్ని ఇష్టమైన పనులు చేస్తూ ఉంటారు. వాటిని హాబీలని అంటూ ఉంటాం. ఈ హాబీలని కూడా కొంతమంది నిరుత్సాహ పరుస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు చిత్రలేఖనం మీద ఉత్సాహం చూపుతూ ఉంటారు. మరి కొంతమంది పిల్లలు సంగీతం మీద తమ దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటారు. ఇట్లా రకరకాలైన హాబీల మీద వాళ్ల దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటారు. ఆ రంగాల్లో పరిపూర్ణత సాధించలేరు కదా ఎందుకు పిల్లలు తమ సమయాన్ని వృధి చేసుకుంటారని పిల్లలని మందలిస్తూ ఉంటారు. ఆయా రంగాల్లో ఇప్పటికే ఎంతోమంది నిష్ణాతులు ఉండి ఉండవచ్చు. ఆయా రంగాల్లో పిల్లలు పరిపూర్ణతని సాధించే అవకాశం లేకపోవచ్చు. అయినా కూడా వాళ్లని నిరుత్సాహపరచడం సమంజసమేనా? వాళ్లు నేర్చుకున్న విద్య ఎప్పుడు ఏ రకంగా ఉపయోగపడుతుందో ఎవరు చెప్పగలరు.
నేను డిగ్రీ చదువుకుంటున్నప్పుడు సాహిత్యం మీద అభిరుచి ఏర్పడింది. ఎప్పుడు చూసినా కథలూ, కవిత్వాలు, చరిత్ర లాంటి పుస్తకాలు చదువుతూ ఉండేవాడిని. ఇది గమనించిన మా బావగారు మా ఇంటికి వచ్చినప్పుడల్లా వాటిని చదవడం గురించి నిరుత్సాహపరిచేవాడు. సివిల్ సర్వీస్, గ్రూప్ వన్ లాంటి కాంపిటీటివ్ పరీక్షలు రాయాలని చెప్పేవారు. ఆయన ఉద్దేశం మంచిదే. ఈ ఇష్టమైన పనుల్లో పడి చదువుని నిర్లక్ష్యం చేసి పాడైపోతారని ఆయన ఉద్దేశం. ఆయన చెప్పినప్పుడు అట్లాగేనని తలూపి మా సాహిత్యపు గొడవల్లో మేం పడిపోయేవాళ్లం. అట్లాగని చదువుని నిర్లక్ష్యం చేయలేదు. ఇష్టంలేని సైన్స్ చదువుని వదిలేసి ఇష్టమైన ‘లా’ చదువుకి మారిపోయాను. ఆ తరువాత అటు సాహిత్యాన్ని, ఇటు చట్టాన్నీ రెండింటినీ సరిగ్గా చదవడం మొదలుపెట్టాను.
జీవిత ప్రయాణంలో కాస్త నిలదొక్కుకున్న తరువాత సాహిత్యంలో కాస్త గుర్తింపు వచ్చిన తరువాత మా బావగారు సాహిత్యం చదవడం గురించి విమర్శించలేదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రశంసించడం మొదలుపెట్టారు.
‘ప్రజలు ప్రేమించేది గౌరవించేది చర్యలని కాదు ఫలితాలని’.
ఆసక్తి వున్న విషయాల్లో పిల్లలని ప్రోత్సహించాలి. కానీ మా బావ చెప్పినట్టు అది వాళ్ల జీవితానికి ఆటంకంగా మారకూడదు.

-జింబో 94404 83001