Others

మనోనేత్రంతో చూసేవాడే...(డైరెక్టర్స్ చాయిస్..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-పరుశురామ్
యువత, ఆంజనేయులు, సోలో, సారొచ్చారు చిత్రాలతోపాటుగా ఇటీవల విడుదలైన శ్రీరస్తు శుభమస్తు చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు పరుశురామ్. మనోనేత్రంతో ముందుగా సినిమాను చూడాల్సింది దర్శకుడేనని చెబుతున్న పరురశుతో ఈ వారం చిట్ చాట్..
**
మీ నేపథ్యం?
-మాది వైజాగ్ జిల్లా నర్సీపట్నం. ఏయులో ఎంబిఏ చేశా. సినిమాలపై ఆసక్తిగా పరిశ్రమకు వచ్చాను. పూరి జగన్నాధ్, వీరూ పోట్ల, దశరథ్, బొమ్మరిల్లు భాస్కర్‌లవద్ద దర్శకత్వ మెళకువలు నేర్చుకున్నాను.
దర్శకుడిగా ఎలా...?
-బాల్యం నుంచీ అమ్మా నాన్నలతో కలిసి సినిమాలు చేసేవాడిని. అసలు సినిమా ఎలా తీస్తారు? అన్న ఆసక్తినుంచి దర్శకత్వ శాఖపై అభిరుచి ఏర్పడింది. హైదరాబాద్‌కు ఉద్యోగం కోసం వచ్చాకే పూర్తిస్థాయిలో సీరియస్ ప్రయత్నాలు మొదలయ్యాయి. పూరి జగన్నాధ్ కజిన్ అవడంతో నా ప్రయాణం సాఫీగానే మొదలైంది.
ఇష్టమైన జోనర్?
-నాకు అన్ని జోనర్లూ ఇష్టమే. పౌరాణికమా, సాంఘికమా, యాక్షనా, థ్రిల్లరా, ప్రేమకథా అనేది చూడను. సినిమా నచ్చిందంటే ఏ జోనరైనా ఓకె. ప్రేక్షకులు కూడా జోనర్ల కోణంలో సినిమాలు చూడరు. సినిమా బాగుంటే ఆదరిస్తారు.
లవ్, హారర్ చిత్రాల వెల్లువ?
-ఒక్కో పీరియడ్‌లో ఓక్కో జోనర్ నడుస్తుంది. ఏ సినిమా అయినా పకడ్బందీగా చిత్రీకరిస్తే, ప్రేక్షకులు విజయాన్ని కట్టబెడతారన్న సత్యం తెలిసిందే. లవ్, హారర్లే తీయాలని ఏ దర్శకుడూ అనుకొని కథలు రాయడు. ఒక్కో పీరియడ్‌లో అలా వెళ్తుందంతే.
పరిశ్రమలో సమస్యలు
-నేను అలాంటి ఇబ్బందులు ఏవీ ఎదుర్కోలేదు. అందరూ మంచి నిర్మాతలు దొరకడంతో ప్రోత్సహించి, మంచి చిత్రాలు రూపొందించేలా చేశారు.
నెక్స్ట్ ప్రాజెక్టులు?
-దాదాపు నాలుగు బౌండెడ్ స్క్రిప్టులు సిద్ధంగా ఉన్నాయి. ఈ జనవరి నుంచి గీతా ఆర్ట్స్ పతాకంపై సినిమా ప్రారంభం కావచ్చు.
దర్శకుడంటే?
-మనోనేత్రంతో ముందుగా సినిమా చూసి, తరువాత ప్రేక్షకులకు చూపించేవాడు.

-శేఖర్