ఓ చిన్నమాట!

శక్తి సామర్థ్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి వస్తువుని నిశితంగా పరిశీలించాలి. అలా పరిశీలిస్తే మనకు తెలియని విషయాలు ఎన్నో గోచరమవుతాయి. ఆ పరిశీలన దృష్టి వుండాలి.
చెట్టు ఓ మామూలు చెట్టులా కన్పిస్తుంది. కాని అలా దానివైపు చూస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి. అది లేత ప్రాయంలో వున్నప్పుడు అది బతుకుతుందా లేదా కూడా తెలియదు. ఎందుకంటే ఏ జంతువో, మనిషో దాని మీదినుంచి నడిచే అవకాశం వుంది. అది భూమిలో కలిసిపొయ్యే అవకాశం వుంది. కానీ కొంతకాలం తరువాత అది పెరిగి పెద్దది అవుతుంది. కొంచెం పెద్దగా అయిన తరువాత అది తన శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగిస్తుంది. ఎక్కడా రాజీ పడదు. ఆగిపోదు. విశ్రమించదు.
సగమే పెరిగి ఇక్కడితోనే నేను ఆగిపోతాను అని ఏ చెట్టూఅనుకొని ఆగిపోదు. ఎంత ఎత్తుకు ఆ చెట్టు పెరగగలదో అంతవరకు అది పెరుగుతుంది.
అంతేకాదు. తన వేర్లను భూమిలోకి ఎంతమేరకు పంపించగలదో అంతమేరకు పంపిస్తుంది.
వైశాల్యంలోనూ అంతే. ఎంత వెడల్పుగా మారగలదో అంతగా మారుతుంది.
ఎన్ని పండ్లను ఇవ్వగలదో అన్ని పండ్లనూ ఇస్తుంది.
ఎన్ని కూరగాయలను ఇవ్వగలదో అన్ని కూరగాయలను ఇస్తుంది.
ఇది ఒక్క చెట్టు విషయంలోనే కాదు. సృష్టిలోని అన్ని జీవులు కూడా ఇదేవిధంగా ప్రవర్తిస్తాయి.
ఒక్క మనిషి మాత్రం వింతగా ప్రవర్తిస్తాడు. నిజానికి అన్నింటికన్నా శక్తిమంతుడు మనిషి. మిగతా జీవుల్లా కాకుండా మనిషికి మెదడు వుంది. ఆలోచన వుంది. మిగతా జీవులను నియంత్రించే శక్తి సామర్థ్యాలు వున్నాయి.
అయినా మనిషి వింతగా ప్రవర్తిస్తాడు. తనకు వున్న శక్తి సామర్థ్యాలన్నింటిని పూర్తిగా వినియోగించడు. కొంతమేరకు మాత్రమే ఉపయోగించి ఇక చాలనుకుంటాడు.
కొంతమంది మాత్రమే తమ శక్తి సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించారు, ఉపయోగిస్తున్నారు కూడా.
ఆ కొద్దిమంది ఉపయోగించిన శక్తి సామర్థ్యాల వల్ల ఈ ప్రపంచం ఈ విధంగా నిర్మితమైంది. అది ఏ రంగంనుంచైనా కావచ్చు. ఆ కొద్దిమంది తమ శక్తిసామర్థ్యాలను సంపూర్ణంగా వినియోగించడం వల్ల ఈ ప్రపంచం ఈ రోజు వున్న మాదిరిగా వుంది.
మనం బ్రతకడం తప్పదు. అలాంటప్పుడు మనలో వున్న శక్తి సామర్థ్యాలని సంపూర్ణంగా ఉపయోగించుకోకూడదా!
మన శక్తి సామర్థ్యాలకి పరిధి వుందని మనం భ్రమిస్తున్నాం. ఆ పరిధి మనం ఏర్పరచుకున్నదే. దాన్ని అధిగమించాల్సిన అవసరం ఎంతైనా వుంది.
చెట్టుని చూసి నేర్చుకోవాల్సింది ఇదే!
చెట్టునే కాదు, ఈ సృష్టిలోని అన్ని జీవాలని చూసి మనిషి నేర్చుకోవాల్సింది ఇదే!
అదే తన శక్తి సామర్థ్యాలని సంపూర్ణంగా వినియోగించడం.

- జింబో 94404 83001